17, జూన్ 2019, సోమవారం


కదా కృష్ణా !
వెన్నెల వేకువయ్యే వేళాయె
జాబిలి పడమరలో తేలిపోయే
సింధూరం పూసుకుంటూ తూరుపమ్మ
మేఘాలతోటి ఆ గుసగుసలు ఎందుకమ్మా
పొన్న చెట్టు చిగురుల తేలియాడిన చిరుగాలి
మోసుకొచ్చెను నీ వేణుగాన మధురాలను
నన్ను మరచి నేను వెన్నకడవ నెత్తుకొని
మల్లెల వేళ మించునని పరుగు పరుగున వచ్చితిని
కదా కృష్ణా !
పున్నమిలో యమున వెండి వెలుగుల విందు చేసెనే
గోముగా మయూరమే తలను ఊపుతూ నాట్యమాడెనే
ముమ్మూర్తులా ప్రేమ సుధలు కురిపిస్తూ నీ కన్నులు
శ్వాసశ్వాస ఆరాధనల ఈ రాధను ఐక్యమే చేనుకొనె
కదా కృష్ణా !
ఈ రాసకేళిలో జరిగిన సమయమే ఎరుగకుంటిమి
విచ్చుకుంటున్న మందారాల సాక్షిగా
మనసుతో మనసు ముడివేయు బంధమే
రాధా మాధవుల సంబంధము
కదా కృష్ణా !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి