31, మార్చి 2014, సోమవారం


  • వసంత లక్ష్మి..

  • చెరుకు గడల తీపిని...వేప పూవులోని చేదును..
    మామిడి..పులుపు...సమపాళ్ళలో మిళితం చేసుకున్న

    ఉగాది పచ్చడిని అందిస్తూ....వసంత లక్ష్మి..

    మింటిలోని రంగుల హరివిల్లు నేల చేరిందా..
    అన్నట్టు ...సీతాకోకచిలుకల జోరు..
    వికసిత కుసుమాలపై దండయాత్ర చస్తూ..

    నల్ల బంగారం రంగు తనదైనదని..ఒకటేసిగ్గు..అయినా..
    మధురమైన గాత్రంతో...మత్త కోకిల....
    కుహు...కుహు..రావాల మైమరపింప జేస్తుంది...

    పంచాంగం చెపుతూ పంతులుగారు..దేవాలయం అరుగుమీద ...
    ఆసక్తిగా వింటూ...ఎవరికీ వారు..ఈ జయనామ సంవత్సరమయినా..
    జయాలను కలుగజేయాలి...స్వామి..అనుకుంటూ..

    చైత్రమాసపు సోయగం ప్రతి సంవత్సరం
    కొత్త హంగులే కాదు..కొత్త ఆశలు చిగురింప జేస్తూ...
    ఆమని తలపుల తలుపులను తడుతూ ఉంటుంది...!!

24, మార్చి 2014, సోమవారం

  • జై హింద్....!!

  • అమర వీరుల త్యాగ ఫలాన్ని
    అమృతతుల్యంగా అందుకుని
    అపరిమితమైన సేవా తత్పరతతో..
    అకుంటిత దీక్షతో...కదనరంగంలో..
    కాలు మోపిన శత్రువులను గడగడ లాడిస్తూ...
    మాతృ దేశ రక్షణ గావిస్తున్న సైనికులారా...
    వందనాలు...ఎన్ని చెప్పనా..తక్కువే..మీకు..

    మేము మీకు తోడు అంటూ వెన్నంటి ఉండే వనితలు..
    కాకి బట్టల్లో కలికితనానికి కరుకుతనం జతజేసి..
    ఝాన్సీ...రుద్రమల వారసులమనిపిస్తున్నారు..

    భారత మాత పైట చాటున భావి భారతం...
    బంగారు మయం కావాలంటే...ఇదే స్పూర్తి తో..
    యువత ఎల్లప్పుడూ ముందంజ వేస్తూ...
    అక్రమాల నరికట్టి ...అన్యాలని తెగ నరికి ..
    జైజవాన్ నినాదాల శోభిల్లాలి...జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తూ..!!

22, మార్చి 2014, శనివారం

మా ఊరు...

వెసవి సెలవులు ఎప్పుడు వస్తాయా...ఎప్పుడు మాఊరు (అంటే అమ్మమ్మగారి ఊరు) ఎప్పుడు వెళదామా..అని ఉండేది...మాంఇడి తోటలు..చింతతోటలు...ఎంత ఎండలోనైనా...చల్లని నీడనిచ్చే ఆ చెట్లకింద...అదుపు లేని ఆటలు... మరువలేని మధురానుభూతలు..మరి....

మా ఊరు "నిర్మల్" అదిలాబాద్ జిల్లా లోనిది...నిర్మల్ బొమ్మలు ప్రపంచ ప్రసిద్ది...మీకు తెలిసే ఉంటుంది కదూ నేస్తాలు....చెక్కతో చేసె ఈ బొమ్మలు...ఎంతో అందంగా ఉంటయి....బొమ్మల ఆదరణ లభించింది కానీ....అవి చేసే వారి కుటుంబాలవారికి సరీయిన వసతులు లేఖ ఈ మద్య కాలంలో...వారూ..తమ వృత్తికి దూరం అవుతున్నారు...ప్రభుత్వం కల్పించుకొని...ఇల చేతి వృత్తుల వారికి సరి అయిన సదుపాయాలి కలిగిస్తే..ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు మరి....

సరస్వతీ దేవి కొలువై ఉన్న "బాసర" మా ఊరికి దగ్గేరె....చల్లని గోదావరి ఆ ఊరికంతటికీ మంచినీటినిస్తుంది...

20, మార్చి 2014, గురువారం

అమ్మ అద్భుతమే..అమ్మ !!

అమ్మ కడుపులో జీవం పోసుకున్న క్షణం నాకు తెలియదు కానీ...
అమ్మనవుతున్నానన్న నిజం తెలిసిన క్షణం ...
అనిర్వచనీయమైన అనుభూతుల సమాగమనమే..నాలో...

అమ్మ ఆలింగానాల నులి వెచ్చని స్పర్శని ఎదగదిలో దాచుకొని..
నా పొత్తిళ్ళ చేరిన పాపాయికి అందించా...బద్రంగా....
అమ్మ వేలు పట్టుకొని నేర్చుకున్న నడకలను  అనుసరిస్తూ...
తప్పతడుగులను  తడబడ కుండా...నేర్పించా...నా చిట్టితల్లికి..

జీవిత పయనంలో ఎదురు గాలులకు ...వడ దెబ్బ తగలకుండా..
గమ్యం చేర్చాలనే తాపత్రయంతో ..పైటచెంగు చాటు చేసా...
అమ్మాయిని అబలగా చూసే లోకంలో ...ఆత్మస్థైర్యం నింపుతూ..

పది నెలలు మోసి ...పురిటి బల్లపై పంటి బిగువున బాధను భందిస్తూ
పెదవంచున చిరునవ్వు నింపుకున్న నా బంగారు తల్లిని చూస్తూ..
నా కడుపున జడి ఉండలు చుట్టుకుపోతుంటే...ముక్కోటి దేవతలకు మొక్కుకున్నా..
అమ్మమ్మని చేసిన మనవడిని ముద్దులతో ముంచేస్తూ...
అమ్మ...!!సృష్టిలో నిర్వచనం లేని అద్భుతం...అమ్మ...!! అనుకున్నా..!!


నీ కనుకొలుకులనుండి
రాలిన కోపాగ్ని శిఖలను
గుప్పిట పట్టుకు దాచాలనే
నా ప్రయత్నం....
విఫలమైనదే...సఖీ!

విప్పని పెదవుల
మాటలకు దూరమయిన
నీ మౌన భాషను
గ్రహించుటలో పొరపాటు
జరిగినదే...చెలీ!

నిట్టూర్పు తో విసిరిన
వాలుజడ కదలికలలోని
అలకలను....
కనుగొనలేకపోతినే సఖీ!

నీ విరహభూమిలో
నా మనసు వీరమరణము చెంది
అమరమైనదీ....
ఈ ప్రేమ కావ్యంలో.... 
అమ్మా నాన్నల
ముద్దు బిడ్డనై
ఆకు చాటు పిందెలాగా
పెరిగాను....
అప్పుడనుకున్నాను
అదే జీవితమని....

తాళి కట్టిన
భర్త అజమాయిషిలో
కాలం గడిపాను
అప్పుడూ అనుకున్నాను
అదే జీవితమని....

ఎదిగిన పిల్లల
ఈసడింపులలో
బ్రతుకు ఈడుస్తున్నాను
ఇప్పుడనుకుంటున్నాను
ఇదే జీవితమని....

కానీ....
నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను
నేను నేనుగా
ఎప్పుడు జీవించాననీ....?

కష్టాల కడలిలో
మునకలేస్తూ....
కావడి కొయ్యకు
చేరువౌతున్న వేళ
నీ కన్నుల నుండి జారిపడిన
అనురాగపు తుషారం
నన్ను కమ్మేసింది
ఆవేశపు అగ్నిలో
ఈ మంచు కౌగిలి
బిగి సడలనీయకు ప్రియా!
జన్మ జన్మలకూ
చేరువకావలనుకునే
స్నేహం మనది
మన ఈ ఙ్ఞాపకాల పుటలు
చరిత్రగా నిలిచి
ఆదర్శం కావాలి మరి...
 
నీవు లేని నేను లేను అనుకున్నాను
ఆ రోజు!
ఎగిరిపోయింది ఎక్కడికో
రెక్కలొచ్చిన పక్షై

నీకు దూరం అయినా నేనున్నాను
ఈ రోజు!
రెక్కలు విరిగిన పక్షి నై
రక్తసిక్తమయిన దేహంతో

ఏనాటికయినా.... వస్తుందా
మరి ఆ రోజు!
మన ఇద్దరి కలయికతో
ఆగిపోయె కాలంలో....

ఆ ఒక్క క్షణం కోసం
వేచియున్నా నా రెప్పల మాటున
నీ చిత్రాన్ని చిత్రించుకొని...
 
మౌన భాషతో
నీ హృదయంపై
కనుల కలంతో వ్రాస్తున్నా....
చూపుల శుభలేఖా....
ఇదే నా మొదటి
ప్రేమలేఖా...

నేను కుశలమేనన్నా...
నీవూ...
కుశలమే ననుకుంటున్నా...

ఎదలోతుల దాగిన
ఎనలేని ప్రేమను
తెలుపలేక....
దాచుకోనూ లేకా...
సతమవుతూ ఉన్నా....
ప్రియా...ప్రియా...ప్రియా....

నీ దూరంలో
ఈ కాలం ఆగిందా...
అనిపిస్తూ ఉంది
నిను విడువని నా తలపు
మరి...మరి...
ఉడికిస్తూ ఉంది
ప్రియా..ప్రియా..ప్రియా...

విరహం విమానమెక్కి
చప్పున వచ్చేస్తావా....
మమతల మబ్బులనే
మచ్చిక చేసుకొని
వలపుల వానలు కురిపిస్తావా...
ఆ జల్లులో తడిసి మనం
తేనెల విందులు చెద్దాము
మరి ఉంటా మరి....
ప్రియా...ప్రియా...ప్రియా...
 
నీ విచ్చిన
స్నేహమనే ప్రాణవాయువుని
పీల్చుకుంటూ....
ఎగిరిపొతున్నానెక్కడికో...

వినువీదుల్లో....
విహరిస్తూ....
ఇంద్ర ధనుసుపై జారుతూ...
మబ్బుల రెక్కలతో
సైయ్యాట లాడుతూ...
మెరుపుల ఊయలలూగుతూ....
చిట పట చినుకులలో
తడుస్తూ....
ఉక్కిరి బిక్కిరవుతున్నా
ఊహించని ఈ...
ఆనందాల హేలలలో....

మండి పడుతున్న సూర్యుడు
సైతం మిన్న కున్నాడు
నీ ప్రాణవాయువుతో
జీవిస్తున్న నన్ను
కరిగించ లేక....

కొండలలోనుంచీ
కోనలు దాటీ...
ప్రళయాన్ని సృష్టించడానికన్నట్టు
హోరున వీస్తున్న గాలి సైతం
కిమ్మనకుంది
నన్ను కదిలించ లేక....

నీ చెలిమికున్న బలం
ఎంతని చెప్పను .....
నేస్తం!


19, మార్చి 2014, బుధవారం

హోళీ....


హోళీ.. హోళీల రంగ హోళీచమ్మకేళిల హోళీ.....జానపదాలు...జాలువారుతుండ
ఇంద్రధనుసు రంగులన్నీ ఇంటింట తెలియాడుచు ఆనందాలు నింపుతుండే...
జాతి మత బేదాలు మరచి ..స్నేహ హస్తం చాచుతూ.......
మానవ సంబంధాలను పెంచుతూ...సమసమాజమిదని చాటుతుండే..


కాముని దహనం చేసి...పున్నమి వెలుగుల పునీతులవుతూ...
పాల్గుణమాసం ఇదే....ఇక వీడ్కోలు...ఈ వత్సరానికని చెపుతూఉండే...
చైత్ర మాసపు శోభలకు స్వాగతం పలుకుతూ...రంగవల్లుల రంగులే...
చిన్న..పెద్దా..తారతమ్యాలను విడచి అల్లరిలో హద్దులు చెరిపేస్తూ ఉండే..

అలనాడు యమునాతటిపై..నల్లనివాడు ఆదమరచి మురళి మ్రోగించు చుండ
గడుసు గోపెమ్మలు అనేక వర్ణాలతో..గోపాలుని ముంచేసి పకపకమనుచుండే...
ఆ రాసకేళి ఘటణ వినుటకేంతో రసరమ్యభరితము..ఆ తన్మయత్వం తపోబలమై
మదిని మోహపరవశమొనరించ ఆ మాధవుని లీలలలో హృదయం తెలిపోతుండే..

పండుగ ఎప్పుడు జరగాలి సంతోషాల సరదాల జాతరలా...
విభేదాలకు తావివ్వని ...అంతరాలను చేదించి ...ఆప్యాయతలను
పెంచుకుంటూ.....అపార్ధాలకు సెలవు చెపుతూ..సన్నిహితత్వం...
సోదరబావం..మన స్వబావమని చాటుకుందాము...ఈ హోళీ మనదే ఇక..!!
రాధా కృష్ణుడవై ....

శేష శయనుడవై సేదతీరూ...శ్రీలక్ష్మి సేవలందుకుంటున్న విష్నుమూర్తీవే.. ...
దేవకి గర్బాన అష్టమినాడు జన్మించి ...వసుదేవునెంట యదుకులానికి వలసపోయి
యశోధమ్మ చిన్ని కృష్ణుడవై.....అల్లారు ముద్దు కన్నయ్యవయినావే.. !!

మట్టి తింటున్నావని బ్రమసిన ఆ తల్లికి ముల్లోకాలను...చిన్నినోట చూపి
అండపిండ బ్రహ్మాండాలలో నీవే ఉన్నావని చాటుతూ....వెన్నను దొంగలించి
నిదురించె గోపెమ్మెల పెదవులకు పూసి...వారి తగవులకు కారణమైనావే..!!
ఇదేమిచోద్యమ్మన్నా! కోపించిన యశోద నిను రొటికి బందించ...
బారెడు చెట్లను కూల్చి... గంధర్వుల శాపవిమోచన గావించి
గోవులగాస్స్తూ....మురళి చేతబట్టిన గోపన్నవయినావే..!!
శిఖను పించము దరించిన శిఖిపించమౌళి..
జలకాలాడు కన్నెల చేరెలెత్తుకెళ్ళి..
జవాబుగా వారి జీవితాలకానందమునొసగిన హృదయచోరుడివైనావే..!!
మేనమామయిన కంశుని వధించి తల్లితండ్రుల చెరవిడిపించి
బృందావని చేరి యమున తరగల పాదాలిడి పావనమొనరించి
రాధచెలిమిని పంచుకొంటూ..ఆరాధనలభాగమై రాధాకృష్ణుడవైనావే..!!
అతనికెందుకు....

అమ్మ కడుపున అందరిలా పుట్టినా...
ఆడపిల్లనని అణగద్రోక్కేసారు..
అడుగడుగునా...అవమానాలు.....
కదపలేని అడుగుల అసక్తతలు

ప్రతీ పురుషుడు అతివ లేకుండా
అతను ఉండడు..అయినా...
"నీవాడదానివి...అంటాడు.."
పంచ భూతాలకు లేని ఈ
బేదం..అతనికెందుకు...?
ఈ అమానుష కట్టుబాట్లను
చేదించి....ఆత్మ స్థైర్యం ఆయుధంగా
చేతబూని...అడుగేస్తున్నా..
అమ్మాయి.. అవనికి ముద్దుబిడ్డ
అని చాటాలని......
పూల పరిమళాలను ..
శ్వాసలుగాచేసుకొని....!!
అపూర్వం నీ చరితం.....
...
ఝాన్సీరాణి అంశలో పుట్టిన ...భరతావని మహిళారాజమా
అహరహం ఆత్మస్తైర్యం... అమరత్వమైన మణి సోభితమా...
ఆకాశమే వంగి నీకు వందనమే చెప్పెనమ్మా......
పుడమి తల్లి నిను చూసి గర్వంతో పొంగెనమ్మా....
ఇంట గెలిచి రచ్చ గెలవాలను సామెత నిజం చేయ
మొక్కవోని దీక్ష తో...... అడుగు ముందుకేసేవు..
నీ ఆలోచనలలో...చేరనిదేమున్నది...
నీ ప్రతిభతో దీటుగా... నిలబడు దైర్యం ఎవరికున్నది...
ప్రతి రంగంలోను ...ప్రథమ స్థానం నిదేనైనపుడు...
తలెత్తి చూస్తూ...సలామందురందరూ...
ఆలిగా వేలు పట్టుకొని నడిచినా..
అమ్మగా వేలు పట్టుకొని నడిపించినా..
స్వార్ధ రక్కసుల కోరలు పీక ...
కదనరంగంలో కదం తోక్కుతున్నఅతివా!
నీవే అది మూలం...అపూర్వం నీ చరితం...!!
ఎందుకో..ఎందుకో..ఎందుకో..మరి...!!


నిన్ను చూసిన క్షణంలో
నా కనులలో
మెరిసిన తళుకులు...
హృదయంపై పరావర్తనం చెంది
స్పందలకు కారణాలయ్యాయి....
ఎందుకో...ఎందుకో..ఎందుకో మరి..!!


నీ చూపుల రాతలు
చెక్కిలిపై గీతలై
గులాబీలు పూయిస్తూ
పులకింతల సందళ్ళతో
బరువైనరెప్పలకు కారణాలయ్యాయి ...
ఎందుకో..ఎందుకో..ఎందుకో మరి...!!

నీ పెదవుల పలుకులు
నాఎదపై శిలాక్షరాలై
మధురోహల ఒలలాడిస్తూ
జ్ఞాపకాలపందిరి గుంజకి జారబడి
కాలి బొటనవేలితో
వేసే ముగ్గులకి కారణాలయ్యాయి..
ఎందుకో...ఎందుకో...ఎందుకో..మరి...!!
అతివ" - "ఆదిశక్తి"


యుగయుగాల చరితం తిరగేసినా...
అతివ ఎప్పుడూ ఆది శక్తి అవతారమే

సతిగా అత్మాహుతి చేసుకున్నా
తన అభిమానాన్ని కాపాడుకుంది
పార్వతిగా పరమేశ్వరుడిని చేరి
సగబాగమై తాను నిలిచింది
అమృతమయి అన్నపూర్ణగా వెలిసి
ఆకలి దప్పుల తీరుస్తుంది
కౌశల్యలోని కన్న ప్రేమ రామునిదైతే
యశోదమ్మలోని పెంచిన ప్రేమ కృష్ణయ్యదై
వారినెల్ల వెళలా కాపాడింది
ఒకఝాన్సీగా ..సమరాన దూకి
తెల్లవాళ్ళను తరిమి కొట్టింది
రుద్రమగా ఖడ్గం చేత బట్టి
ఎదుటివారిని గడగడలాడించింది
మధురమైనవి వెంగమాంబ గీతాలైతే...
మందహాస భరితం మొల్ల రామాయణం
'నైటింగేల్ ' అనిపించుకుంది
పసితనంలోనే కవితనువ్రాసి సరోజినీదేవి
మహిళాభ్యుదయానికి తన జీవితాంతంవరకూ
పాటుపడింది దుర్గాబాయ్ దేశ్ముఖ్
అనంతాల్లో కెగిరి అహా! అనిపించుకుంది
విశ్వంలో కలిసిపోయి అమరమైంది కల్పనాచావ్ల
అమ్మ గా మమతామృతాన్ని పంచుతూ
మగని కనుసన్నల అనురాగమునందిస్తూ
ఆశయాలభివృద్దిపధంలో
ఎందరికో...మర్గదర్శకమై
నిత్యం...అనునిత్యం...
పరిశ్రమిస్తూ...ఉన్నా...
ఇంటా..బయిటా...
చెరగని.... చిరునవ్వు
చెదరని... మనస్థైర్యం
ఒక్క మహిళకే సొంతం...!!!
అందుకే...."అతివ - ఆదిశక్తి"
మన మహాత్ముడు..

కొల్లాయి గుడ్డ కట్టి...కర్ర చేత బట్టి ...నూలు వడికి...
మురికివాడల శుబ్రం చేసి...చేసే పనులకు...కట్టే బట్టకు
కులం ...మతం లేదని...మానవత్వం ...సమానత్వం ...
మనిషికి అవగతం కావాలని...చేసి చూపించిన మహనీయుడు...


రవి అస్తమించని బ్రటిష్ సామ్రాజ్యం మాదని విర్రవీగు తెల్లదొరల
సత్యాగ్రహం...అహింసలను అయుధాలతో...గడగడ లాడించాడు...
గుండె దైర్యముతో గుండునెదిరించి ....దేశప్రజల దాస్యవిముక్తి గావించాడు
భరత మాత ముద్దు బిడ్డై....జాతి పితగా నిలిచిన మహాత్ముడు..

బోడిగుండులోని మేధత్వము....బోసి నవ్వులోని అమాయకత్వము
కంటి చూపుల కరుణ తో...కనిపించే దైవమే.. ..మన గాంధీ తాత!!
మామ !!


ఏమరతోఏటికేలితే....
ఎదురొచ్చి మామ
బుగ్గ మీద చిటికేసే..
...
ఎరుపెక్కిన బుగ్గతో
మూతి బిగువు జతచేస్తే..
పకా పకా నవ్విండు మామ
ఆ నవ్వుల పువ్వులన్ని
ఏరుకొని మాల కడుతుంటే..
మాయమై..పొయిండు మామ
రెప్పలార్పు కళ్ళేమో
కొలనులే అయ్యాయి...
దిక్కులన్ని దుగులుగా
చూస్తున్నాయి...
అలల మీద చేపలన్నీ
అటు ఇటు పరిగెడుతూ...
చిలిపి చూపుల
గాలమే ఏస్తుంటే..
ఎకసెక్కాలకు
కాలమిది కాదని...
కాళ్ళతో తపా తపా కొట్టాను..
నీళ్ళన్నీ ఎగిరి పడి
ఒళ్లంతా తడిపేసే..
ఒరుసుకొని గుడ్డలన్నీ
అందాలన్నీ ...ఆరబోసే..
బంతిపూవు తీసుకొని..మామ ...
బేగి బేగి నొచ్చేసి...
జడన తురిమి మామ...
ముద్దిచ్చి ముచ్చట చేసే...మామా...!!
ఈ క్షణం ఇలా...


ఒక్క క్షణం...ఒకే ఒక్క క్షణం
అమ్మ చెప్పిన మాట విని ఉంటె...
ఈ క్షణంలో ఇలా ఉండకపోదును కదా!!
...
అశల సౌధాలను అవలీలగా నిర్మించుకుంటూ
సాగుతున్న నేను...నీ చూపుల
సంకెళ్ళ లో బందినే,,, అయ్యాను
నీ మాటల మర్మంలోని మధువును త్రాగి
మైకంలో నన్ను నేను మరిచాను...
మత్తు వదిలించుకొని చూసుకుంటే.....
అన్నీ కోల్పోయి మిగిలున్నాను..చరించే శవాన్నై....
ఈ చీకటి నన్ను కాల్చేసినా
బాగుండును...
ఈ నిశబ్ధం నన్ను మింగేసినా
బాగుండును...
ఈ ఒంటరితనం నన్ను కబళించినా
బాగుండును...
"ఉరకలేసే యవ్వనం
విష నాగై కాటేస్తుంది...జాగ్రత్త తల్లీ ..!!"
అని అమ్మ చెప్పిన మాట
ఒక్క క్షణం..ఒకే ఒక్క క్షణం
అలోచించి ఉంటె....
ఈ క్షణం ఇలా....!!
తొలి ప్రేమ ...


తొలి ప్రేమ పిలిచింది
మారాకు వేసిన
మది తలుపు తీసింది..
...
హృదయం వణికింది
తనువు తడబడినా ..
మౌనమె గెలిచింది
యవ్వన నిధులన్నీ
ఏమర పాటుకు లోనై
ఉక్కిరిబిక్కిరి చేసాయి
ఎద గదిలో దాగిన
ఊహల బాసలు
రెక్కలు విప్పి ఎగిరాయి
కలల రాకుమారుడే
ఆశల గుఱ్ఱంపై
వచ్చాడమ్మా...
చప్పున చేజిక్కించుకొని
నను ఎదో లోకాల తీసుకెళ్ళాడమ్మా..!!
కళ్ళు తెరిచే సరికి
దుప్పటి ముసుగులో...
నిద్ర లేవక నేనమ్మా!!
అయ్యో...!! ఇది కలా....!!
మదర్ తెరిసా....

మనసు వెన్నలా ఉన్న ఏ అమ్మాయి అయినా అమ్మే..
అని నిరూపించిన అమృత మూర్తి ' మదర్ తెరిసా'
...
అల్బేనియా లో పుట్టినా ...భరతమాత ఒడి చేరి
అనాధలకు...అభాగ్యులకు...తన ఒడిని పంచిన ప్రేమమయి
అంటారని తనం అన్నది అవనికి దూరం అంటూ...
చిపిరి పట్టి రోడ్లు ఊడ్చి నట్లే...మత బెదాలను తరమికొట్టిన
మహనీయ మహిళా మణి ...తరగని మమకారాల గని
పద్మశ్రీ...భారతరత్న అన్న బిరుదులే కాదు ..ప్రపంచ ప్రక్యాత
నోబెల్ బహుమతి కూడా పొందినా...నిరాడంబర జీవితమే
తన ఆశయ సిద్దికి అనుకూలమని..ఎంచుకొనిన మాననీయి..మదర్ తెరిసా!!
గ్రీష్మం....


శిశిరం లో మోడుగా మారిన కొమ్మలన్నీ....వసంతుని ఆగమనంతో
చిగురులు తొడిగి....ప్రకృతి కన్యకు....పచ్చని చీర కట్టాయి...
మావి చిగురులు మేసిన కోయిలలు గొంతు సవరించుకొని ...
కుహు...కుహు..ల రావాలతో....కమ్మని గానామృతాన్ని పంచుతున్నాయి..

కరిగిన హిమంలోని చల్లదనం ...వచ్చే గ్రీష్మంలోని వెచ్చదనం
కలబోసుకొని నులివెచ్చని పొత్తిళ్ళను గుర్తుచేస్తున్నాయి....
రేరాజు కురిపించే వెన్నెలను పోటీ చేస్తూ...
తీగేలనిండా...విరగబూసిన మల్లెలు పరిమళాలతో మత్తెక్కిస్తున్నాయి..
చైత్ర వైశాఖ మాసాలలో ...మామిడి కాయల తోరణాలగుత్తులు ..
జేష్ఠ ఆషాడ మాసాల గ్రీష్మ ఋతువుకు స్వాగతం పలుకుతూ...
పచ్చని పుచ్చకాయలు ఎర్రని గుజ్జుతో...చల్లగా సేద తీరుస్తానంటూ..
వీది వీదిన చెరుకు బండ్లు ...తీయని అమృత రసాన్ని అందిస్తూ....
బాబోయ్...ఎం ఎండ!!అనుకుంటూనే..ఐస్క్రీం తింటూ ఆనందించే కాలమిదే..
"రోహిణి కార్తి లో రోళ్ళు పగులుతాయట..." నానుడిని గుర్తు చేసుకుంటూ...
రోడ్డు మీద ఆమ్లెట్ వేసే ఆంకర్ని ని టివిలోచూస్తూ.."నిజమే..!" అనుకుంటాం..
బడుల సెలవులు....పిల్లల అల్లరులు....ముచ్చటలే..పని వత్తిళ్ళయినా..
పదినెలల కాలం ఎదురుచూపులతీరం....బంగినపల్లి మామిడిపండ్ల రుచులే...
వచ్చే వర్షఋతువుకై..భానుడు తనప్రభావంతో సముద్రజలాలను ఆవిరిచేస్తూ!!
తులసి....


విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమై..ప్రతి పూజలోను నిలచే.. తులసి...
ఆరుబయట తానున్నా...అందరిని ఆదుకునే ఆరోగ్యప్రదాయని తులసి.
చిట్టి మొక్కయినా....చిట్కాల వైద్యంలో అగ్ర స్తానం పొందినది తులసి. ....
తిర్తంలో పత్రమై చేరినా...మాలలో దళమై నిలిచినా ఆ పేరే..తులసి..

మరణ శయ్యపై..నారాయణ మత్రంతో...కలిసిపోవును తులసి..
అతివలకు ఆరాధ్య దైవమై నిలిచి ...అమ్మగా అనుక్షణ౦ కాపాడే తులసి..
ప్రదక్షిణాలకు పరిపక్వత నిచ్చి ....సిరి సంపదల వరమొసగు తులసి....
రకాలలో..అనేకం...కృష...లక్ష్మి...అడవి...అయినా...ఒకే గుణమున్న తులసి..
సత్య భామ గర్వమణచ...ప్రేమ..భక్తిని తెలుపుటకు రుక్మిణి చేరిన తులసి..
త్రాసులో కృష్ణునితో..తూగి..అరాదనను తెలుపుకున్నపరమపావని తులసి..!!
సీతాకోక చిలుక ...


పలకరించే పెదవులకు...
ఇన్ని కలవరింత లెందుకు...
ఎదురుచుపుల నయనాల ...
నిలిచిన చెమ్మ తుడి చెందుకా ...

రెక్కలోచ్చిన ఊహలు..
రంగుల సీతాకోక చిలుకలైతే...
ప్రతి బావం పుప్పొడై..
విందు చేయదా..చుంబనాలతో
వాలు జడలో....


తీగపై విరిసిన మల్లెలన్ని....ఒక్క చోటచేరి గుస గుసలాడే...
మరువం ...కనకంబరాలతో జత కలిసి...వాలు జడలో...
...
ముస్తాబయిన ముగ్ధరాలి అందాలకి దాసోహం అంటూ...
పరిమళాలను విందు చేస్తూ... ఒద్దికగా ఒదిగాయి ...వాలు జడలో...
సత్య భామ కోపాన్ని సైతం తన విసురులో దాచుకుంటూ.....
కృష్ణయ్య చెలిమిని తెలియజేసే వయ్యారాలున్నాయి వాలుజడలో...
శాస్త్రీయ నాట్యాలలో....తీరయిన కదలికలకు ...
అపరమితమైన ప్రధాన్యతలు కలిగున్నాయి ....వాలుజడలో...
సాంప్రదాయ తెలుగింటి అమ్మాయి అందాలను ...
ఆ సాంతం పెంచేసే......పూలపుప్పొడి రాగాలుకలవు ...వాలుజడలో...
ఆశల హరివిల్లును దోసిన పట్టుకొన్న ...పెళ్లికూతురి పులకింతలు ...
కన్నేతనంనునుసిగ్గులతో పెనవేసిన సింగారాలున్నాయి....వాలుజడలో...
తొలిసూలు...కడుపున పాపడు...కళ్ళతో తన్నుతుంటే....
కాబోయేఅమ్మ పొందే అపురూపమయిన సీమంతాలున్నాయి...వాలుజడలో...!!

6, మార్చి 2014, గురువారం

మా తాత ....( మది పొరల్లో)

మా తాత గడ్డం పట్టుకొని
 ఉంగాలు చెప్పానట
 ఒడిలో కుర్చుని ఊసులాడుతూ
 మీసాల మెలికల్లో
 మమతని పోగేసుకున్నానట...
అమ్మ చెప్పిన....
అరుదైన ఙ్ఞాపకం......(మది పొరల్లో)

ప్రతీ రోజూ పదిపైసలతో కొన్న
 తియ్యబూందీ పొట్లం లోని బూందీని
 ఒక్కటొక్కటే తింటూ...
అరుగుమీద ఆనందాన్ని అనుభవించిన.. నా
 ఆత్మీయ ఙ్ఞాపకం.......(మది పొరల్లో)

పరికిణీలేసుకున్నా
 పక్కనే పడుకొని మాతాత
 చెప్పే కథల్లాంటి కవనాలని వింటూ...
అకళింపు చేసుకున్న ...నా
 అనురాగపు ఙ్ఞాపకం.....(మది పొరల్లో)

సాయి బాబా తెలియదు కానీ...
మాతాత ప్రతి నిత్యం చెప్పే..మాటలే
 ఆ బాబాగారి సూక్తులు...(సహనం..శ్రద్ద)
అనుక్షణం అనుసరిస్తున్నా..నా
 అనుభవమైన ఙ్ఞాపకం...(మది పొరల్లో)

అప్పగింతలు చెప్పి
 దూరమవుతున్నానన్న భాధని
 తట్టుకోలేని మా తాత
 మంచానికొరిగి...
నెల తిరక్కుండానే....
నానమ్మని వెతుక్కుంటూ....
వినీల గగనంలోనికి
 ఆత్మగా ఎగిరిపోయి...
ముమ్మ్మైమూడు సంవత్సరాలయినా
 సృతిపధంలో మాతాత
 చిరంజీవైన..నా
 అనుభందపు ఙ్ఞాపకం....(మది పొరల్లో)

 (మా తాతగారి కి అశృనివాళులతో.....)  



మాధవా....


పిల్లన గ్రోవిని ఊదగా...
మాధవా....
తమని తాము
మరచినారు గోపికలు

 చిలికే కవ్వము నొదిలేసి కొందరు
 అత్తమామల సేవను విడిచి ఇంకొందరు
 మగని కౌగిలి విడిపించుకొని మరికొందరు
 పరవశమొంది తమని తాము
 మరచినారు గోపికలు
 మాధవా.....

యమున తరగల నురగలో
 పదాలు కదుపుతూ
 పొన్న చెట్టు నీడలో
 సేదతీరుతుంటివే....
కానీ....
ప్రతీ భామ కౌగిలిలో చేరి
 సైయాట లాడుచుంటివి
 పదహారువేల గోపికలతో....
ఈ రాసక్రీడల సుందర ద్రుశ్యము
 మదిని గాంచిన నేను
 ధన్యత నొదితి
 మాధవా.....





రాధనై....

మురళీగానము
 విని నేను మురిసాను
 రాధనై...కృష్ణా...
బృందావనిలో
యమునా తటిపై
 రాధనై.....
యుగాలు గడిచినా
 మాయని గాధనై...
నీ రాధనై.....

చిరుగాలి తాకిడికి
 చుగురాకుల సడికి
 నీ స్ఖపించము
 కదిలిన కదలికలనుకున్నా...
అనుకొనిఉన్నా....
జనంలెన్నో ఎత్తినానో
 ఈ జన్మలో నేనున్నానీకై
 రాధనై...
యుగాలు గడిచినా మాయని
 గాధనై...నీ రాధనై...

నీ ఆరాదనలో ఐక్యము
 కానేరెనా....
నీ పిలుపునకూ నే...
నోచుకోనేరనా....
నీ విరహ గీతికలో...
నేనెపుడూ...విరుపునేనా....

కనులలో కనుపాపల జ్యోతులు
 వెలిగించుకొని ....
దారికాచి వేచినాను
 నీకై....రాధనై...
యుగాలు గడిచినా...
మాయని గాధనై...
నీ రాధనై...




బావాల తోటలో....

బావాల తోటలోకడుగుపెట్టా..
అక్షరాల పూలు కోయాలని
 అందమైన మాలనల్లి
 నా స్వామినలంకరించాలనీ...
ఎంత ప్రయత్నం చేసినా....
ఒక్క పూవూ అందటం లేదు....

అన్నమయ్య నడిగా...
ఆ కొమ్మనందివ్వమని
 శ్రీనివాసుని కీర్తనల
 ఆరాధనలో ...చేరి
 నావైపు...చూడనేలేదు..

అన్నా!! గోపన్నా!!
ఎపుడూ రాముని నిందించటమేనా...?
ఒక్క "రామ " పుష్పాన్ని
 నాకివ్వొచ్చు కదా...!!
ముందే....ఎద కోవెలలో
 నిలిచిన నా " ఈశ్వరుడు " (నా ఆత్మ)
ముక్కోపి....
ఆలశ్యానికి....
అలలకలు పోయి
 నన్ను వదిలి...
నీ చెంతకొచ్చేస్తాడు ' మరి '

అనాధనై (నిర్జీవమై) నేనల్లాడుతూ...
నీగాధలో...బాగమవుతా...!!!

అనాధవు కావని....

నరకంలో సైతం...
చేసిన తప్పుకే ...
శిక్షఉంటుందట......
మరి నేనేం తప్పు చేసానో...!

అమ్మ కుప్పతోట్టిలో
పడేసింది....!!
" నాన్న " అంటే..
ఏమిటో..కుడా తెలియదు...

ఎక్కడో..ఎవరో..పరేసినది
తింటూ...
గాలికి తిరిగేనాకు
ఈ గాలి బుడగలే..
తోడయ్యాయి...

అమాయకంగా ఆడుకుంటూ
అల్లరిచేసే పిల్లలకు
ఎగసిపడుతూ ...
సమాదానమిచ్చే అలలు
నాకు మాత్రం
జీవిత పాఠాన్ని నేర్పుతున్నాయి..
నిరంతరం శ్రమించటమే లక్ష్యంగా
సాగిపొమ్మని...
ప్రకృతమ్మ ఒడి ఉండగా
నీవు అనాధవు కావని...!!
అతివ !!!

అన్నపూర్ణ అంశలో జన్మించి
ఆపద సమయంలో తన.. పర.. మరిచి
అభయహస్తమిచ్చు అతివ.....

భానుని తీజస్సును తన నుదిటిన ధరించి
కడ్ఘమైనా...కలమైనా..
అలవోకగా కదిలించే అతివ...

సీతా ..సావిత్రుల మారు రూపమై..
సహనం ఇంటిపేరుగా..
తనదైన అత్మవిశ్వాసం చాటుకునే అతివ ..

శాంతి సౌఖ్యాలను తన దోసిలిలో పట్టుకొని
చిరునవ్వుల నెలవులను
పోగేస్తూ.. నందనవనం చేయు అతివ

వీర నారి అయి అమరమైనా...
చరిత్రలో నిలిచి..
యువతరానికి మార్గదర్శకమై..
అజరామరమౌ వనిత ..
తానెన్నటికీ "సబల" నేనని
నిరూపిస్తుంది..

మగవాడి మాయ మాటలే..
'అబల ' అను పదం ...
తీర్పు...

నీ కనులు చెప్పిన ఊసులకు
నా రెప్పలు సాక్ష్యం ..
...
నీ ఎద చేసిన బాసలకు
నా మనసు సాక్ష్యం....

నీ పెదవులు పలికిన మాటలను
లిఖించుకున్న నా హృదయమే సాక్ష్యం.

నీ కదలి పోయిన అడుగులకు
చితికిన నా బ్రతుకే సాక్ష్యం ...

నీ అంతరాత్మ న్యాయస్థానంలో...
అపరాదివి నీవు....

సాక్ష్యాలను కూడదీసుకొని
వాదిస్తా...న్యాయవాదినై...

న్యాయమూర్తైన ప్రేమ గారి
తీర్పు ఎటువైపు ఉంటుందో..మరి..
ప్రియా!!

నీకు తెలుసా ప్రియా...!
జాబిలి లో వెన్నెల
తరుగుతూ తరుగుతూ...
అమావాస్య నాడు
శూన్య మవుతుంది

మళ్లీ పెరుగుతూ పెరుగుతూ
పున్నమి నాడు నిండుగా కురుస్తుంది...

ప్రకృతి లోని కాలాలు
కూడా మారుతూ ఉంటాయి
ప్రతి నాలుగు నెలలకొ కసారి...

ఉదయించిన సూర్యుడు
సైతం రాత్రి వేళ
కనుమరుగవుతాడు...

కానీ ప్రియా!!
తొలిసారి నీ చూపులలో
చిక్కుకొని ...
స్పందించిన నా హృదయం
అందించిన ప్రేమ...
అప్పుడు ...ఇప్పుడు...ఎప్పుడు
ఒక్కలనే విరబూస్తూ
పరుమళాలను వెదజల్లూతుంది....

నీకై తపిస్తూ....
విరహిస్తూ....
కూడా....నీ తలపుల
వాకిట్లో జీవిస్తుంది....
ఒక్కసారే....

తెల్లగా విచ్చుకున్న మల్లెలు
ప్రియమారగా పలకరించినా....
జవాబు చెప్పాలానిపించదు...
ఒక్కోసారి....

చల్లగా వేచే పిల్ల గాలుల
తాకిడికి ముంగురులు
ముఖం పై పిచ్చి గంతులేస్తున్నా
సరిచేసుకోవాలనిపించదు
ఒక్కోసారి.....

ఏటి తరగల్లొ మునకలేస్తున్న
పదాల కదలికలకు
మువ్వలు చేస్తున్న సవ్వడులు
శ్రావ్యంగా వినిపిస్తూ ఉన్నా...
శ్థబ్ధత నొదల నంటుంది మనసు
ఒక్కోసారి.....

"ఒక్కోసారి" అన్నీ
ఒక్కసారే....నన్ను
చుట్టు ముట్టి
శూన్యపు చట్రంలో
బిగించేశాయి...

ఎందుకో తెలుసా నేస్తం!!

నా తలపు
నీ ముగింట చేరటంలేదని

నా పిలుపు
నీ ఊహల దారిలో
నడవడం లేదని....

జీవం నింపలేకపోతున్న
శ్వాస...తరంగం
చివరగానైనా ....నిన్ను
తాకలేక పోతుందని....
శ్రీ రంగనాధా...

పలుకులను లోలోన
దాచుకొని..
పవ్వళించితివా.....
రంగనాధా...!!
శ్రీ రంగనాధా..!!
ఇహములోన నను
ఇక్కట్లకు గురిచేసి
వేదనతో నే వేడుకుంటున్నా...
వినిపించుకొని కూడా... //పలుకులను//

వింజామరల మెల్లగ
వీచేగా..భూదేవి..
సుతిమెత్తగ పాదాలు
వత్తెగా.. శ్రీదేవి..
సపర్యల సల్లాపములలో
సాంతముగా..అన్నీ మరచీ....//పలుకులను//

ప్రేమారాదనల మాలలతో...
నిను సేవించీ..పూజించీ..
నిన్నే భర్తగ పొందెనుగా..
గోదాదేవి...
ఆ తల్లి లాలుల ఊయలలో..
సాంతముగా అన్ని మరచీ......//పలుకులను//
నిట్టూర్పు...

నిజం నిద్రావస్తలో చేరి
ఆత్మ స్మశానంలో
సజీవ సమాదైంది .......

అప్పుడప్పుడు
శ్వాస పిలుస్తూ
హృదయ వేదనతో
పొటి పడుతూ ..
నిట్టూర్పు రూపంలో
వెలుపలికి వస్తుంది ...

బయిటి ప్రపంచాన్ని చూస్తూ..
బయంతో వణుకుతూ..
సమాధి స్థానమే
తనకు శ్రేయస్కరమని
బ్రమించి " నిట్టుర్పు" కు
ఆయువు నిస్తూ...
తాను విగతమవుతుంది ...
గమ్యం

గెలుపు ఓటమిల
సమీకరణలలో చిక్కి
కావద్దోయి నీకు నీవే ...
మరో సమస్య వై....

కాలమెక్కిన
గుఱ్ఱానికెపుడు కళ్ళాలుండవు
గడచిన ప్రతీ క్షణం
గతమవుతుంది
వెనక్కి తిరిగి చూసుకుంటే
వేదనే మిగులుతుంది

ఆలోచనల పెనుగాలులలో
ఆటు పోట్ల ఆవిరైపోకు
ఆత్మ స్తైర్యంతో
సాగిపో....
అల్లదిగో...నీ ముందే ఉంది
నీవు చేరాలనుకునే గమ్యం
 


వ్యర్ధ పదార్ధాలను పారేసినట్టు ...
మీ అవసరం మాకిక లేదని
వ్రుద్దశ్రామాల్లో వదిలేసే...
ప్రబుద్దులయిన కొడుకులకు
శ్రవణుని చరితం ఆదర్శ నీయం కావాలి....
...
కడుపున పుట్టినవారి కోసం కలే కడుపులను సైతం
లెక్కచేయని మమకారం తల్లితండ్రులది

పనికిరాని ప్రతీ పదార్థం నుండి
పునరుత్పత్తి చేస్తూ 
కొత్త వస్తువులను తయారు చేసినట్టే 
ముడుతలు పడిన శరీరాలలో 
దాగిన అనుభవాల సారాన్ని 
గ్రహిస్తూ వారి బాటలో 
బ్రతుకు సాగిస్తే...
భావి తరానికి ఆదర్శమై 
కొత్త దానానికి పిలుపులనిచ్చే 
మావిడాకుల తోరణాలుగా 
మంగళకరం చేసుకోవచ్చు జీవితం.
*****

సుజాత తిమ్మన 
హైదరాబాదు. 

వారి అవసరాలను గుర్తెరుగుతూ
 కంట నీరు తెప్పీయకుంటే చాలు
ఆ శ్రవణుడే...మీ రూపంలో జన్మించాడనుకుంటారు..ఆనందాతిసయంతో
రాధా మాధవీయం....

అనురాగాల సరాగాల ఆరాధనాంజలులు
రాధామాధవుల రసజగతికి మణిహారాలు
యుగాలు గడిచినా ఆ ప్రేమ కుసుమపు ...
ప్రణయ సుగంధాలు సోకిన ప్రతి హృదయం
అతీతమైన..... అలౌక్యైమైన ఆనందాల పరమౌను
వారి చరితం నిత్య నూతనమే.....
ఆ మురళీగానమెప్పుడూ మధుర మనోహర మంజుల భాషణమే
ఆలమందలు దరిచేరిన కన్నయ్య కైలవ్య శోభితమే ..!!!
రైతన్న.....!!

రాజ్యాలేలే మహారాజైనా...నీకు గులమే కదా రైతన్నా...!!
నీవే లేకుంటే...ఈ మానవ జాతి ఏమగునన్నా....!!
...
నెల తల్లి పుత్రుడవు...అమ్మని ఆప్యాయంగా చూసుకుంటావు...
ఆ తల్లి అందించే ఆహారాన్నే..అందరికి పంచుతావు...

అహర్నిశలు శ్రమ పడుతావు...అలుపెరుగక జీవిస్తావు...
ఆపదలను అక్కున చేర్చుకొని ...అండగా నిలబడతావు

జోడెట్లతో హలాన్ని పట్టుకుని...నీవాకలిని మరచి..
మండుటెండను లెక్కచేయక దుక్కిదున్ని పచ్చని పంటల పరవశముతావు!!
నండూరి వారి ఎంకివనుకున్నా...
బావల తోటలో బద్రంగా ఉన్న నిన్ను..
రవివర్మ కుంచెజార్చిన రమణీయమనుకున్నా..
మరల్చనీయని చూపుల సొగసుచూసి..
...
కాదు..కాదని..తెలుసుకున్నా...నా...
హృదయాన్నిఊహల ఊయలలో ఓలలాడించిన మనోహరివి...
పిడికెడు గడ్డిమోపును మోయలేని పడుచందానివి...
భరతీయతను మూటగట్టుకొన్నఅమృత మూర్తివి..నా మనోజ్ఞవని....!!
వైకుంఠమా...
.కైలాసమా...
స్వర్గ లోకమా...
ఏ లోకం చేరాలని
నీ అవాంతర ప్రయాణం.......

వేదనలు చేరాయని రోదిస్తూ..
నిరోదించటం మరిచావే...
కష్టాల కొలిమి
కలకాలం ఉండదు కదా...!!
చల్లారి బూడిదై..
మసవుతుంది తెలుసుకో....

అమ్మ తన ఆయువు
ఫణంగా పెట్టి మరీ నిన్ను కన్నది...
నాన్న తన ప్రాణం పోసి నిను పెంచెనే...
తల్లి తండ్రులను శోకసముద్రంలోకి త్రోసి..
నీ ఆత్మను నీవే..
గాలిలోకెగరేయలనుకుంటూ ఉంటే...
లిప్త పాటు క్షణం...
తెలిరిచిన రెప్పలు మూసుకొని...
హృదయంలోకి నిన్ను నీవు
చూసుకొని మరీ నిర్ణయించుకో...
నీవు...నీ చుట్టూ..
ప్రపంచంలో ప్రతీ కదలిక అవగతమవుతుంది...

జన్మ జన్మల పుణ్యఫలమే...
మానవ జన్మ కదా..!!
మహాత్ములు కూడా...
మనుషులే కదా !!
వారి ఆదర్శాన్ని
జీవంగా మలచుకొంటె...
మహిమాన్వితమయిన జీవితం ..
నీదే ఇక...!!
చిట్టి పిచ్చుకా !!

చిటారు కొమ్మైనా
చిటికలో ఎక్కేసే...
చిట్టి పిచ్చుకా...!!...
చిత్రంలో దూరిపోయి...
మా కనుల దూరమైపోయవే....!!

వాతావరణ కాలుష్యం నిన్ను
కబళించి వేసింది...
కాంక్రీటు కబందహస్తాల ఉరి..
నిన్ను ఉపిరాడకుండా చేసింది...!!

ఊరే ..నీ పేరుగా
చేసుకున్నావే...
జొన్న కంకులబడి
జోరుగా తింటున్నావే...!!

కిచ కిచల రావాలతో పలికేవు
నీవు సుప్రభాతాలు ..
శ్రీవారి సన్నిధిలో వినిపించెనే...
అవి సుమధుర గీతాలై!!
"ఆసరా"

నేలంతా పరుచుకొని
మొదుగపూలు దినకరునికి
స్వాగతం పలుకుతున్నాయి... ...
అతని తొలి కిరణాల వెచ్చదనంతో ఎఱ్ఱబడి...

వీడని హేమంతపు మంచు..
బిందువులుగా మారి
భాస్కరుని వెలుగులో ప్రతిబింబిస్తూ ...
ఇంద్రధనుసును తలపిస్తుంది...

నిర్జీవ నిశ్శబ్దం
ఆత్మీయ ఆలింగనాల
" ఆసరా " కోసం ...
అలమటిస్తూ..
అటు...ఇటు...చూస్తుంది.....!!!
నీవు...!!

పారిజాతమివ్వలేదని అలుకలు బోయి
ఓరకంట కృష్ణుని శాసించే...సత్యభామవే...!!
...
మహిషాసురుని వధించ
రుద్రరూపం దాల్చి...
అసామాన శౌర్యంచూపి ..
అగ్ని శిఖలు కనుల కురిపించిన ఆదిశక్తివే.....!!

అసురలనుండి సురను రక్షించ
యోచించిన విష్ణుమూర్తి అంశగా..
ముల్లోకాల సౌందర్యాలను రాసిపోసుకున్న
అపురూప సుందరి జగన్మోహినివే ...!!

ఏ పాత్రలోనైనా...అభినయాన్ని
ఆహార్యంగా మలచుకొని....
అలవోకగా అందెల పాదాల నర్తించే
ఆంద్రావని కూచిపూడి రమణివే...నీవు!!
లక్ష్మి నరసింహ...!!

ఓం నమో నారాయణాయ...!!ప్రహల్లాదుని నామ జపంతో...
ప్రీతి నొందిన మహానుభావా...నరనారాయణ రూపివై
దుష్ట శిక్షణ గావించుటకు...వెంచేసినావయ్యా...నమో..నరసింహ...!!...

ఏడి దేవుడన్న హిరణ్యాక్షునకు స్తంభమును పెగుల్చుకొని...
అతని చెరపట్టినావే...బ్రహ్మ వరమును వ్యర్ధము చేయక...
గడప పై కూర్చుండి చీల్చి చెండాడినావే...పసివాని గాచి....!!

యాదగిరిన నరసింహుడవై ...సింహచాలమున అప్పన్నవై..
మంగళ గిరిన పానకాల స్వామి వై....భక్తుల బ్రోచేవు....
అడుగడుగునా..దండాలు పెట్టించుకుంటూ...ఆపదల తిర్చేవు...
చెంచులక్ష్మి చెంత సేద తీరిన ....లక్ష్మి నరసింహా...నమో..నమో..నమః!!

5, మార్చి 2014, బుధవారం

పదిలంగా దాచుకున్నా...

వాతావరణ కాలుష్యానికి
హరితాన్ని కోల్పోయినా...
లోలోన దాగిన జీవం
ఆయువునిస్తూ..ఉన్నా.....
చిరుగాలికి సైతం వణుకుతూ...

పరిస్థితుల ప్రభావానికి
జీవితం సమాధి అయినా...
నీలోని ప్రేమ మనసు పొరల్లో...
మెలిపెడుతున్నా ..మళ్ళి
తానే సాంత్వన పొందుతూ...

బావాలని భందించాలని...
తాపత్రయం...
ఎదగది ని పత్రంగా మలిచి...
పదిలంగా దాచుకున్నా...
పరి పరి విధముల ...!!
బుద్దుడై....

ఆశ నిరాశలు...సుఖ దుఃఖాల జీవిత ఫలమేమి..అని హరహారము...
ఆలోచనల మధింపు లో...అన్యమనస్కుడై సంచరించే సిద్దార్దునకు....
ఎదురొచ్చిన శవ ఊరేగింపు సమాదానం కాగా....మనసు చలించి..రాజ్యదికారాలను....అనుభందాలను ..వదులుకొని....సన్యసించే.......
భోధి వృక్షము నీడ...నిచ్చి ...జ్ఞాన సంపాదనకు మార్గము బోదించే..

దశావతారాలలో తొమ్మిదవ అవతారమై...భాసిల్లినాడు
అహింస..సత్యము....ధర్మము ....వట్టి మాటలు కావని..
మాననీయ విలువలను కాపాడుకొనుటకు రహదారులని..
ప్రతి మనిషి....వాటికి కట్టుబడి ...మెలగాలని...అడుగడునునా ..
ఆత్మ దర్శనం చేయిస్తూ....బుద్దుడై...విశ్వ శాంతికి కారకుడైయ్యాడు!!
భవితను ...

భరతావనిలో భాగ్యమంతా..మన తెలుగు వారి సొంతం....
శ్రీనాధుని భాగవతమ్....అన్నమయ్య కీర్తనలు...
కృష్ణదేవరాయ అష్టదిగ్గజాలు...రామదాసుని రమ్య ఆలాపనలు.......
అంధ్రప్రదేశ్ అమ్మ ప్రసవించిన మణి మాణిక్యాలు...

భాషలో యాసల మార్పులు...అవి తెలుగు లోని సొగసులు...
బావాలు పలికించే ....మారని అర్ధాలు....
మల్లెల సౌరభాలు....మావిళ్ళ ఆస్వాధనలు ....
అనుభూతించటంలోనే ఉన్నాయి ఎనలేని మాధుర్యాలు....

అమ్మకోసం ఆరాట పడుతూ....ఆంద్రా తెలంగాణీయులు...
సోదరభావంతో ..పంచుకున్నా... అమ్మ నేర్పిన సంస్కృతి ఒక్కటే...
అమ్మ పెట్టె....ఆవకాయ ...రాగి సంకటి....ఒకటే...
దూరాలు పెరిగినా ...దగ్గరతనాల అనుభందాలు ఒకటే....

జ్ఞాన సరస్వతి పాదాలు కడిగిన గోదావరమ్మ...
రామ ధ్యానంలో శ్థబ్ధమయినా.....పాపికొండల దాటి
అంతర్వేదిలోని సంద్రంలో...కలసినట్లు.....
ప్రకృతినే...కాదు....పరిస్థితిని సామరస్యంతో కాపాడుకుందాం....!!

జై...సీమాంద్ర ....జై ...తెలంగాణా....నినాదాలు...
వివాదాలు కాకుండా...బేదాలు లేని భవితను పేర్చుకుందాము....!!

3, మార్చి 2014, సోమవారం

పండుటాకు....

పండుటాకునని...
పనికి రాని దాన్నని...
విసిరి పారేసారు.......

ఇన్నాళ్ళు నా
పత్రహరితం తాగుతూ.
కొత్త చిగురులు తొడిగిన
కొమ్మ ...
నన్ను తనకు తానుగా..
రాల్చేసింది....

జీవం లేదని మాకు
అనుకుంటే..పొరపాటే...
ఒక సారి ముట్టుకొని చూడు..
పెళ పెళ మంటాము....
గుండెలు పగిలే ఘోషలె
వినిపిస్తాయి...

నిస్తేజమయినా...మాకు
జీవితానుభవం నేర్పిన పాఠాలు
భవితకు తెలియజేయాలనే...
తపనలతో...కంటి చెలమల తో
ఎదురు చూస్తూ ఉంటాం
వృద్దాశ్రమాలనయినా...!!
గులాబీలు ....

చెక్కిట పూసిన ఎఱ్ఱగులాబీలు
అవి నీ చూపులకు కందిన విరిబోణులే కాదా!!
...
ఎదవనంలొ చేరిన తెల్లగులాబీలు
నీ స్నేహ మధురిమల సౌరభాలేకాదా...!!

మదిపొరలలొ...దాగిన మంచుగులాబీలు
నీ మమతలు పేర్చిన ప్రెమపూలసజ్జలేకాదా...!!

చిగురాకుల దాగిన విరిసీవిరియని గులాబీలు
నీతలపుల మైమరచిన.. అరమోడ్పుకన్నుల సోయగాలేకాదా..!!
అనగా...అనగా...

కాసీ మజిలీ కథలు ...
కాకమ్మ కబుర్లయ్యాయి...
కంప్యుటర్లొ కార్టూనమ్మల ...
కాకా వికలకే ..
బాల్యం బానిసయ్యింది

ఆంక్షలు పెట్టే
అమ్మానాన్నల చూపుల తప్పుకొని
బామ్మల కొంగుచాటు చేసుకొని
పప్పు బెల్లాలారగించిన పసితనం
పోటీతత్వాల పాకుడురాళ్ళపై
జారి జీవం కోల్పోతుంది.....

అనగా..అనగా..
అని చెప్పే పెద్దరికం
వ్యర్ధ పదార్ధమై...
పారేసిన విస్తారే అయిపొయింది...!!
చిత్రకారుని కుంచెలోని
అపురూప చిత్రమై
మది పొరల కెలుకుతుంది...!!
ఆత్మగా మిగిలి....

కుసుమిస్తున్న
మందారంలా ఉన్న నన్ను...
కోసి పూల సజ్జలో వేస్తావనుకున్నా.......

అనురాగ మందిరంలో
అప్రురూపంగా
దాచుకుంటావనుకున్నా

విప్పని రేఖులను విడదీసి....
పుప్పొడి రేణువుల
పిడికిట నలిపేసావు...

వలపు తీవెల
ఊయలలూగాలని
అశల పొదరిళ్ళ
అల్లి బిల్లి ముగ్గులేసిన నేను...
నీ అహంకారపు అకృత్యానికి
శ్వాసలను అర్పించి
నేల రాలిన విరినై...
ఆత్మగా మిగిలి..
నీ అంతరంగం చదవాలనే
నీ అనుభూతుల చుట్టూ
తిరుగుతున్నా...!!
మన ప్రభుత్వం...

అహింసని ఆయుధంగా
చేసుకొని స్వరాజ్యాన్ని
తీసుకొచ్చారు బాపూజీ....!!...

హింసనే..ఉపయోగించి...
ఓట్లు వేయించుకొంటున్నారు...
మన బడా నాయకులు....!!

ప్రజాస్వామ్యం...
ప్రజల కందని భాగ్యమైంది...
స్వార్ధ రక్కసి కోరలలో..
చిక్కుని..కొనఊపిరితో కొట్టుకుంటుంది...

ఉచిత భోజనం, ఉచిత విద్య,
ఉచిత కరెంటు పథకాలు
ఉన్నోడి గోధాముల గోనెసంచుల్లో
డబ్బై...మూలుగుతున్నాయి...

ప్రాంతీయ తత్వం ప్రచండమై...
నీది నీకె..నాది నాకే...
నానుడి నిలబడింది...

సమాధానాల సమూహం (అసెంబ్లీ)
మాయమై...
రంకేలేసే...
రాబందులకు (రాజకీయనాయకులు) నెలవైంది....

ఐకమత్యం చెదిరి...
నిందల రాజకీయం
పైశాచిక నృత్యం చేస్తుంది..పార్లమెంటు పరితాపంతో....
మౌన భాష్పాలు రాలుస్తుంది....

మూడు వన్నెల
రెపరెపలమూగరోదనలో....
అశోకచక్రం
రంగు వెలిసిపోయింది...
న్యాయం
నాలుగు సింహలకాహారమయింది...!!
ఇదే..మన ప్రభుత్వం..మరి!!ి!!
మహాత్ములు ...

మార్గ దర్శకులు ఎక్కడో లేరు..మహాత్ములు ఎవరో కాదు...
ప్రతి లోగిలిలో...పండుటాకులై..పరమాత్మస్వరూపూలుగా కనిపిస్తూనే ఉంటారు
ముక్కు మూసుకు మూలక్కూర్చో...తాతా..అని అలుసు చేసే మనవళ్ళకి......
తెలియదు...వారి ఆరోగ్య రహస్యం....వారి ఆత్మ సందర్శనం

గాజుకళ్ళ లో...గగనాలనంటిన ఆదర్శాలు
ముడుతల చర్మాలలో...మర్మాలనెరుగని మమతానురాగాలు
వారి మాటల వేదాలను... ఆవాసం చేసుకొని...
పరిస్థితుల ప్రళయాలను ఎదుర్కునే స్థైర్యానికి బాట వేద్దాము...!!
అర్ధానారీశ్వరం......

ఆలనలో.....ఆమె...
పాలనలో....అతను
అర్ధనారీశ్వరరూపములో......
అర్ధం...పరమార్ధం...

మంచు కొండ లయినా...
మమతల మందిరాలే...
విభూదిరేఖలయినా...
అలంకారసోభితలే...

ఒక కన్ను
కవ్వింత అయితే..
మరొక కన్ను...
పులకింతే...

శివతత్వంలోనే..
బేదాలకు తావు లేదు.....
భార్యా భర్తల నడుమ
నేనే అను అహం లేదు...

శివుని శక్తి పార్వతి...
పార్వతి అనురక్తి శివుడు...
స్త్రీ పురుషులు
ప్రకృతి నిలయాలు..

మానవత్వంలో...
ఈ ఏకత్వమే రావాలి...
భావి భారతంలో...
ఆడది అబల కాదు
అని నిరూపణ జరగాలి...
పాశవికం నశించి...
పరిపూర్ణత్వం కావాలి...
అర్ధనారీశ్వరంలోని
అర్ధాన్ని అపురూప
నిలయం చేయాలి...
అప్పుడే...నిజమయిన
శివ పూజ ...
అప్పుడే..ఆదిశక్తికి
ఆర్ద ప్రణామాలు ....!!