18, మే 2014, ఆదివారం

నేటి విద్యార్ధి...

.............................................
'అ' అమ్మ...'ఆ' ఆవు...
కావు..కావు...అవి...వట్టి కాకి గోలలు...
అంటూ...చెవులు మూసుకునే..
నేటి విద్యార్ధి...

'బడి' అంటే...ఏంటి...?
ఓ.......యు మీన్..స్కూల్..!
బర్రెలుకట్టేసే చోటనుకున్నాననే ...
నేటి విద్యార్ధి...

'గురువు' కు నమస్కారం  పెట్టె...
సంస్కారం పోయి...
'మాం' కి మస్కా కొట్టే...
నేటి విధ్యార్ది..

'మాతృభాష ' లోని మాతృకను మృతిచేసి
కాన్సెప్ట్ కవ్వింతలకు..కలల సౌధం గుచ్చేసి
మసిబారిన ముసుగుబస్తాల
బరువును మోసే..నేటి విద్యార్ధి...

3, మే 2014, శనివారం

శ్రామికుడు ...


....................................................................................
దేశానికి వెన్నెముక కర్శకుడైతే....ఆ వెన్నును పట్టుకొని ఉండే ' మనిషి '
అనే యంత్రాన్ని అన్నివిదాలా కాపాడేందుకు  కష్టం చేసే  వాడే ...కార్మికుడు....
రక్తాన్ని చెమటగా స్రవించి ..నిరంతరం విశ్రాంతి ఎరుగక
పని ఒక్కటే...పరమాత్మ స్వరూపంగా భావించే బడుగు జీవితడు ...

శ్రమను దోచుకునే యాజమాన్యాలకు ఎదురు నిలవలేని ఆసక్తుడయినా
ఆకలి కేకల కడుపులకు జవాబు చెప్ప యునియన్లని ఏర్పరుచుకున్నాడు...
భిగించిన పిడికిలితో....నాయకుని నినదిస్తూ....తమ హక్కులకై..
పోరాటం సాగిస్తూనే ఉంటున్నాడు...అయినా తరగని సమస్యలు...వీడని చిక్కులు..

ప్రతి మనిషి ఓ శ్రామికుడే...అన్న నిజం తెలుసుకోలేక మనిషి మృగమవుతున్నాడు..
ప్రజాస్వామ్య వ్యవస్తలో...రాజకీయపు స్వార్ధంలో నలిగి మలిగిపోతున్నాడు...
కుల..మత..వర్గ..బేదాలు తెలియని పనికి...తన శ్రమను అంకితమివ్వాలని ఉన్నా..
వాటి స్థానే....కరుడు కట్టిన కక్షలకు బలిపశువు అవుతున్నాడు...

కడుపు చీల్చిన కన్నతల్లి రొమ్ము గుద్ది పాలు త్రాగినవాడు...
అడుగులు వేసినప్పటి నుంచి ఆ అమ్మ శ్రమని కర్పూరంలా హరించినవాడు..
ఆమె  అడుగులు వేయలేని స్థితి లో...వీది గుమ్మం పాల్జేసే ..వాడు...
' మే ' డే ల పేరిట శ్రామిక దినం చేసుకునేనుందుకు అర్హుడు కానేకాడు...

' నేను సైతం ' అన్న శ్రీ శ్రీ గారి కలంలోని కవితలా ...ప్రతి వ్యక్తీ...
ఓ శ్రామిక శక్తి అయిన నాడు...ప్రపంచ శాంతి సమక్యమై దేదీప్యమవుతుంది..!!