ఎందరికో శ్రీవారు
అందరికీ మావారు
ఏడుకొండల పైన వెలసినారు
వారు సింగారమే కోరుకుంటారు
ఏ పూలని అడిగినా
పలికేది ఒకటే మాట
అది శ్రీవారి సేవలో చేరి
తరించాలనే కోరికొకటే
తరించాలనే కోరికొకటే......//ఎందరికో//
ఏ చోట గాంచినా అగుపించే
రూపమొక్కటే
చిరునగవుల శ్రీనివాసుని
రూపమొక్కటే ...... //ఎందరికో//
ఏ పూట వీచినా
గాలి తరంగాలలో
వినిపించే గోవిందా
నామమొక్కటే ......//ఎందరికో //
నామాల వారికివే
నమస్సుమాంజలులు
ముక్కోటి దేవతల కదిపతికి
నా హృదయమిచు హారతులు .......