27, సెప్టెంబర్ 2016, మంగళవారం




*ఈ నాటి మహిళ *****
తల 'రాత' బాగోలేదని...
అత్తగారు 'వాత'లు పెడుతూ ఉంటె...
వంటింట్లో మూలకూర్చొని..
'చేత' గాని దానిలా చూస్తూ ఉండే..
'పాత' తరం ఆడది కాదు
ఈ నాటి మహిళ..
సరస్వతీదేవి అంశలో...
లక్ష్మీదేవి కళలతో...
పరమేశ్వరి శక్తిని సొంతం చేసుకొని..
ఇంటా బయిటా ..అన్యాయాలని ఎదిరిస్తూ..
అభిమానం ఆభరణంగా ధరించిన
అతివ ఈ నాటి మహిళ..
*******ఉయ్యాలో..ఉయ్యాలా..*********
ఉయ్యాలో..ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా...
బంగారు రంగులో ఉయ్యాలా ..పసుపు గౌరమ్మనే చెయ్యాలా..
గూనుగు పూలతో ఉయ్యాలా..అందంగ పేర్చాల ఉయ్యాలా..
బంతులు. చేమంతులు ,ఉయ్యాలా..
మల్లెలు ..  మందారాలు ఉయ్యాలా..
గుట్టగ పెర్చాలె ఉయ్యాలా..
రంగు రంగుల పూల బతుకమ్మ ఉయ్యాలా..
చల్లని తల్లి ఆ యమ్మ ఉయ్యాలా..
కన్నె పిల్లల కలలు తీర్చుతాదే ఉయ్యాలా..
ముత్తైదువుల పసుపు బొట్టవుతాదే ఉయ్యాలా..
వనితలందరూ ఉయ్యాలా...ఒక్కచోట చేరి ఉయ్యాలా..
ఊపాలే ఊపాలే ఉయ్యాలా...చేతులు ఊపాలే ఉయ్యాలా..
చప్పట్లు కొట్టలే ఉయ్యాలా...చుట్టురా తిరగాలే ఉయ్యాలా..
దుర్గమ్మ తల్లిని కొలవాలె ఉయ్యాలా..
మట్టి దీపమే పెట్టాలె ఉయ్యాలా..
పప్పు బెల్లాలు  ఉయ్యాల...
నైవేద్యమే  పెట్టాలి  ఉయ్యాలా...
కర్పూర హారతి ఇవ్వలే  ఉయ్యాలా..
బతుకమ్మ .. బతుకమ్మఅంటూ ఉయ్యాలా..
ఏటిలోన విడువాలే ఉయ్యాలా..
నీటి పైన తేలి ..ఆయమ్మ ఉయ్యాలా...
పోయి మల్లి ఏడాదికొచ్చునే ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..
మళ్ళి రావే తల్లి ఉయ్యాలా...మమ్ము సల్లంగ దీవించు ఉయ్యాలా..
తెలంగాణా తల్లికి ఉయ్యాలా...అడబిడ్డవే నీవు ఉయ్యాలా..
ఉయ్యాలో ఉయ్యాలా...బతుకమ్మా ఉయ్యాలా..
అమ్మలు అక్కలు  వదినెలు  చేల్లెండ్లు ..
బేదాలు మరచి  ఉయ్యాలా...
బతుకమ్మ  ఆడాలే ఉయ్యాలా..
ఉయ్యాలో..ఉయ్యాలా...బతుకమ్మా..ఆడాలా....ఉయ్యాలా...!!
No automatic alt text available.

19, సెప్టెంబర్ 2016, సోమవారం

ఆకాశం.....
దేశాలు ఎన్నో...ఎన్నెన్నో....నదీ నదాలు...సముద్రాలు..ఎన్నో..ఎన్నెన్నో..
కానీ...అనంతమై వ్యాపించి ..విశ్వమంతటికీ ఉన్నది .... ఒకటే...ఆకాశం..
లెక్కలేనన్ని నక్షత్రాలు ..పాలపుంతలె కాదు...పరిభ్రమిస్తున్న గ్రహాలు...
సూర్య చంద్రుల కావాసమై..పగలు ..రేయిల భారం మోస్తూ..నిబ్బరంగా నిలిచేదే ఆకాశం..
త్రిమూర్తుల నిలయాలయిన బ్రహ్మలోకము...వైకుంఠము ..కైలాసమునకు.. .
పోవు మార్గానికి బాసటగా ఉంటూ..దేవతలకు నెలవైనదే..ఆకాశం....
శూన్యంలా కనిపించినా..అనంత కోటి పరమాణువుల సముదాయాలను దాచుకొని..
అద్భుతాలతో అబ్బురపరుస్తూ....ఆశల రెక్కలను రెపరెపలాడించేదే...ఆకాశం...
రాత్రి పగళ్ళ సమన్వయనానికి తానే సమాదానమవుతూ...
వెలుగయినా…… చీకటయినా..ఒకే రీతిలో స్పందించేదే..ఆకాశం...
గిరి శిఖరాగ్రాలను తాకుతున్నట్టుగా కనిపిస్తూ..
దూరంగా నేలమ్మని ముద్దాడుతున్నట్టు భ్రమింపజేసేది ఆకాశం..
అలసట నెరుగక అలలు ..ఎంతగా ఎగసి పడుతున్నా...
అందినట్టే...అకృతినిస్తూ...నేనెప్పుడు అందనని చెపుతుంది ఆకాశం..
కాలాలు..సంవత్సరాలు...తరాలే కాదు...
యుగయుగాల నుంచి సుస్టిరమై నిలిచి ఉంది ఒక్కటే..ఆకాశం...
అమ్మలోని ప్రేమని..నాన్నలోని అనురాగాన్ని సమన్వయపరుచుకొని..
నిస్పృహల చూపుల దృష్టి సారించినపుడు...నేనున్నానంటూ...సాంత్వన తెలిపేదే ఆకాశం..!

1, సెప్టెంబర్ 2016, గురువారం

అనంతానై......
ఆకాశమై వ్యాపించావు...!
మంచుపర్వతాలయినా...
మహా సముద్రాలయినా...
అరణ్యాలయినా
ఎడారులయినా...
పట్టణాలయినా...
పల్లెసీమలయినా...
నిన్ను మార్చుకోని
నిశ్చలానివి నీవు...!
సూర్యుని తాపానికి కరిగిపోవు...!
చంద్రుని వెన్నెలకు
ఘనీభవించవు.....!
మేఘాలకు ఆశ్రయమిచ్చావు
అవి సృష్టించే...
మెరుపుల ...ఊరుముల
విష్పోఠణాలకు సైతం
చెదరని అస్థిత్వం నీది...!
అందుకే ప్రియతమా...!
ఆకాశమైనీవున్నావని...
నీలో..నే అనంతానై
అలుపెరుగ అంకితమై ఉన్నా...!!!