17, జూన్ 2019, సోమవారం

"మనసు భ్రమరం "
సీతాకోక చిలుకై కవి మనసు
పరి పరి విధాల పరిభ్రమిస్తూ ఉంటుంది
ప్రకృతి వికృతి అన్న సమస్య లేదు
ఎండా వానా అన్న బాధ లేదు
అలసట ఎరుగక ఎక్కడికైనా
తనంత తానె వెళ్లిపోతుంది
కంటి రెప్పల్లో దాగున్నట్టే ఉంటూ
వెతికి వెతికి ఒడిసిపట్టుకున్న భావాలను
పదిలంగా గుండెకు చేరవేసి
కలంలో నింపుతుంది ...
ప్రేమ తత్వాల ప్రణయాలను
రాగద్వేషాల ఆరోహ అవరోహణలను
కుల మతవిభేదాలను
ఆకలి కేకల ఆక్రందనలను
రాజకీయ ప్రణామాలను
దేశవిదేశ సంస్కృతులను
ఒక్కటేమిటి ...
ఎక్కడెక్కడో దూరి మరీ
పట్టుకొస్తుంది భావసంపదలను
కలం ఎప్పుడు నిమిత్తమాత్రురాలే
మనసు భ్రమరం తెచ్చిన సంపదను
అందంగా కాగితంపై అలంకరించటము
తన భాద్యతగా భావిస్తూ అల్లుకుపోతుంది
.అద్భుతమైన కావ్యాలను సృష్టిస్తూ ..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి