17, జూన్ 2019, సోమవారం

"ముక్కెరై పోవా "
ఎంకి చూపుల్లో సూరీడు
నుదుట తిలకమై నిలిచాడు
మావ కన్నుల్లో మెరిసాడు
కాంక్ష కిరణాలే కురిపించాడు
ఎదలోని బాసలన్నీ ఎల్లువలయ్యి
కొప్పులోన బంతిపూలల్లే మురిసే
చెక్కిళ్ళ చేరిన చిరుసిగ్గులన్నీ
మాటలే తెలుపలేని పెదవులపై విరిసే
శ్వాసలొక్కటైన వేళ సరిగమలే కావా
సింగారాలతోడు ఎంకి బావదే కాదా ..
నూనూగు మీసాల ఓ నాయుడు బావా
ముద్దెట్టుకుంటున్న ఎంకి ముక్కెరయిపోవా ..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి