17, జూన్ 2019, సోమవారం

మన ప్రేమ
ఋణమైనది మన ప్రేమ
గత జన్మలనుండి
నాకు నీవుగా
నీకు నేనుగా
నీతో నాకు
నాతో నీకు
ఒకరితో ఒకరికి ఋణమైనదీ ప్రేమ ...
చరిత్రకు దొరకని
సాక్ష్యాలమై ...
విధాత విరుపులకు
మారిన ఆకృతులమై..
కలవని మార్గాలలో
వేరైన గమ్యాలకు
విసిరివేయ బడితిమి
మృతమైన మనసుతో
చరించే దేహాలతో ..
ఒకరితో ఒకరికి ఋణమైనదీ మన ప్రేమ .. .
నదీ సంద్రపు సంగమమై
చిరుస్పర్శల ఉప్పొంగు కెరటాలమై
ఒకరిలో ఒకరము
ఒదిగిపోయే సమయాన్ని
దాచుకుందాము మరు జన్మకు
తీర్చుకుందాము ఈ ఋణభారాన్ని !
Image may contain: 1 person, ocean, sky, outdoor and waters

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి