27, జనవరి 2014, సోమవారం

గణతంత్ర దినోత్సవము

భారతీయుల ఆత్మస్తైర్యానికి ప్రతీకగా ..
అమర వీరుల త్యాగ నిరతిని చాటుతూ...
గగనసీమలో రెప రెప లాడుతుంది మూడు రంగుల పతాకం

అహింసనే ఆయుధంగా చేసుకొని..
1947 లో సత్యాగ్రహం ...సహనంతో సాదించిన స్వాతంత్రం
1950 లో అధికారికంగా ప్రకటితమై....
ప్రజలందరికీ వరమై నిలిచింది.....

కుల మత జాతి బెదాలను మరచి 
ప్రాంతీయ తేడాలను విడిచి ....దేశమంతా ఒకటిగా ..
"జనగణ మన " అంటూ ఠాగూర్ గీతం 
హృదయాలను మేల్కొలిపే అమర దీపమై... ...

సైనికుల క్రమ విన్యాసాలతో....
బాలబాలికల నృత్య సంగీతాలతో...
అభివృద్ధి ....సమైక్య సంస్కృతుల ప్రదర్సనలతో..
డిల్లీ రాజ్ భవన్ మార్గమంతా...సందడే..
దూర దర్శన్ లో చూస్తున్న మనకి కన్నుల పండుగే..

జై హింద్ నినాదాల సంబరమే కాదు ...
ప్రతి వ్యక్తీ ఒక శక్తి అయి ..దేశాభ్యున్నతికి పాటు పడతానని 
ఎవరికీ వారు ప్రతిజ్ఞ చేసుకోవాలి..ఈ గణతంత్ర దినోత్సవమున..
ఆనందాణువునై ....

శ్వాస తరంగాలతో జీవం నింపుకుంటూ....
రక్తమాంసాల ఆకారన్నిచ్చుకుంటూ....
ఎదిగానమ్మా...ఉమ్మనీటిలో ఈదులాడుతూ...
మరణాన్ని సైతం లెక్కచేయక 
జన్మ నిచ్చావమ్మా...!!

ఆడపిల్లనని అందరిలా అలుసు చేయక 
అక్కున చేర్చుకుని పెంచావే...

నీ ఆశయాలకాయువుపట్టును నేనై...
విషపు చూపుల తూటాలకు ఎదురు నిలిచి 
"ఆత్మాభిమానం " మా అమ్మగారిల్లని నిరూపిస్తానమ్మా !!
నీ కంటి చివర నిలిచినా నీటి చుక్కలో...
ఆనందాణువునై ....

తల్లీ !! గంగమ్మ...!!


అమ్మలకే...అమ్మ!!...గంగమ్మ తల్లీ!!
మా పాపాల కడుకుటకు...భాగిరధుని కోరిక మన్నించి 
ఆకాశాన్ని తెంపుకుని దిగివంచినావమ్మా..!!
శివుని సిగపాయల బందించినాగాని...ఒక పాయ గా విడిపించుకొని...
ఉరికురికి వచ్చినావే....హిమగిరుల జారుతూ...

కొండల నడుమ..కులుకుతూ...కొనల పలకరిస్తూ..
పాడి...పంటలకు అయువునిస్తూ....
అరమరికలు ఎరుగక ..గులకరాళ్ళ పై..
గలగలల రాగాలతో...రమ్యంగా పాడుకుంటూ...
అలుపెరుగక నీవు సాగిపోతున్నవే..తల్లీ ...గంగమ్మ!!

విశ్వేస్వరుని అనునిత్యము అభిసేకిస్తూ...
అన్నపూర్ణమ్మ అంశని అందిపుచ్చుకొని...
కాలాలకతీతంగా...నీ నీట మునకేసిన చాలు 
సమస్త దోష నివారణ గావిస్తున్నావే...
పిత్రుదేవతలకి సైతం పుణ్య ఫలం అందిస్తున్నావే...తల్లీ..గంగమ్మ !!

భీష్ముడు నీ బిడ్డడేమో నాడు...కానీ...
భరతావనికే...మణిహరమైనావు నేడు...తల్లీ గంగమ్మ...!!

స్వాగతమమ్మా.....!!

స్వాగతమమ్మా...స్వాగతం...
అఖిలాండేశ్వరి..చాముండేశ్వవి 
ఆపద్భాందవి....అమ్మా భవానీ..!!

వేయి నామముల వెలిగే తల్లీ..!!
వేదనల తీర్చ ఒక చూపు 
ప్రసరించు నీ కరుణ కనులతో..

మనో మందిరమున
నీ పూజార్చనలు చేయ 
ఎద పలకమునే ఆశనము చేసి 
ఆత్మ కలశము లో నిను 
ఆవాహనము చేసినాము 
మూసిన కనుల తోటలో 
విరిసిన భక్తి పూలతో
అలంకారాలు చేసి 
ప్రతీ శ్వాసనొక 
మంత్ర పుష్పముగా మలచి 
వ్రతము చేయుచుంటిమి.. 
అనుక్షణం ఈ ధ్యానంతో..నే 
జీవితమై...!!
స్వాగతమమ్మా..!! స్వాగతం..!!

కాత్యాయినీ...కమలనయనీ..
కారుణ్యమయీ...కనదుర్గాభవానీ..!! 

నవరత్రులకే నవసూత్రముగా 
మా మదిలో నిలచీ 
ఇలలొ వెలిసిన 
మంగళ ప్రదాయినీ...!! 

సత్ సంతానమునే అందించే బాలవేనమ్మా..!!
మొదటి రోజున నీ అలంకారమే
"శ్రీ బాలా త్రిపుర సుందరివే...!!" 

చతుర్వేద పారాయణ 
ఫలితమునిచ్చు
జగదంబవే..రెండవరోజు అలంకారమే 
"శ్రీ గాయత్రీ మాతవే..!!" 

అష్ట లక్ష్మిల సమిష్టిరూపమే 
సంపదలనిచ్చే తల్లిగా 
అలంకారమే మూడవరోజు 
"శ్రీ మహాలక్ష్మివే..!!" 

అక్షయ పాత్రను దరించిన తల్లి
చరాచర సృష్టి పోషక దాయిని 
అలంకారమే...నాలుగవరోజు
"శ్రీ అన్నపూర్ణాదేవివే..!!" 

పంచాక్షరీ మహామంత్ర 
అదిష్టాన దేవతవే కామేశ్వరీ..
అలంకారమే అయిదవ రోజూ...
"శ్రీ లలితా త్రిపుర సుందరీవే..!!"

చదువుల తల్లీ..
బ్రహ్మ చైతన్య స్వరూపిణి..
అలకంకారమే...ఆరవరోజు 
"శ్రీ సరస్వతీ మాతవే..!!"

మహా శక్తి వై..
దుర్గముడిని సంహరించి 
జనులననుగ్రహించిన మాతా 
అలంకారమే ఏడవ రోజు
"శ్రీ దుర్గా దేవివే..!!"

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 
చేసి దర్మ విజయము సాదించిన
సింహ వాహిని..మహా శక్తి 
అలంకారమే ఎనిమిదవరోజు
"శ్రీ మహిషాసుర మర్ధినివే..!!"

అమ్మలగన్న అమ్మా..!!
సకలసిద్ది ప్రదాతా..జగన్మాతా
పరమేశ్వరుని సగబాగానివి
అలంకారమే....తొమ్మిదవరోజు
"శ్రీ రాజరాజేశ్వరివే..!!"

దరిశనములొసగుతూ...
దేవీ నవరాత్రుల వేడుకలే..
మాకిచ్చినావమ్మా...!!
మంగళమమ్మా... జయ మంగళం... 
శంకరీ...పరమేశ్వరీ..
పరంధాయినీ...పాపహరిణీ...!! 
నమోస్తుతే...నమోస్తుతే..!!

 (9 photos)
యమున తరగల నురగలపై
సుతిమెత్త గా తేలుతూ
వస్తున్నమాదవుని వేణు గానం
విన్నరాదమ్మ హృదయం 
నీలి మబ్బు ను చూసిన నెమలై
పురి విప్పి ఆడింది ఆనంద నాట్యం 
ప్రతి శ్వాస కృష్ణ నామమే
ప్రతి తలపు మాదవ లిఖితమె....
రాద జీవీతమై....
పదహారువేల బామల ముద్దు గోపలుడైనా
ఎప్పుడు రాదా మనొహరుడే
యుగాలు మారినా మారని చరితమే....
రాదా కృష్ణుల ప్రణయ కావ్యం..
ఆరాదనల అనురాగాలకు ఆదర్శం ...
ప్రేమైక్య జీవనానికి నిదర్శనం....
మధురం ..మనొహరమ్...రాదా మాదవియం...

ప్రియా...!!

వెన్నెల మెట్టు మెట్టు జారి
వేకువ లో ఇగిరిపోయింది....

వేదనతో హృదయం నీ 
తలపుల మూటని జ్ఞాపకాల 
సందూకంలో దాస్తుంది..

వెక్కిరించే ఒంటరితనం 
వద్దన్నా వినకుండా
తనకు తానే చితి పేర్చుకుంటుంది...

నీ ఆగమనం అనివార్యమని తెలిసినా
పిచ్చిమనసు మరల మరల 
నెమరేసుకుంటుంది... 

శ్వాసల తరంగాలు 
ఉరికే కన్నీటికి ఆనకట్ట వేస్తూ...
ఉపిరాడానివ్వకున్నాయి...

చిట్ట చివరి ఆర్తి 
మనో పలకం పై లిఖించి
మేఘాల సందేశం పంపుతున్నా...
ప్రియా...!!
సమ్మిళిత స్వరూపం ....

కల్మషం లేని నీ పిలుపు లోనే ఉంది 
అమృతం ఒలకబొసె తనం 
ఆ ప్రతీ చుక్క నీ తనివి తీర సేవిస్తూ 
అమరమయ్యి నిలిచాను 
స్నేహ సాగర తీరంలో....

నీ అనురాగాల ఆలింగనం ఎప్పుడు 
అభయ హస్తమే...అయి నపుడు 
కాల యముడు తన పాశన్ని విసిరినా 
స్నేహతత్వం బోదించి 
అజరామరం చేస్తాను ...

పేగు పంచిన అమ్మ....
బ్రతుకు నిచ్చిన నాన్న 
కనరాని లోకాలకు తరలిపొయినా 
కాల సర్పం కాటెస్తుందట .... 
కానీ ఆ సర్పమే నాకు కానుకగా నిన్ను
ప్రసాదించింది....స్నెహాన్వితమై .....
తల్లి ... తండ్రి .. గురువు .. దైవం 
సమ్మిళిత స్వరూపమై.....
అమ్మ ఎప్పుడు అడగదు....


అమ్మని మించి దైవామున్నదా .....!
అని పాడుకోవడం తప్ప 
అమ్మ కి ఏమి ఇస్తున్నాం 
అన్న ఆలోచన 
కలిగిందా... ఒక్క సారైనా...!

అమ్మ ఎప్పుడు అడగదు ....

కన్న కడుపుకు వేల కట్టి
ఇమ్మని.....

రక్తాన్ని చనుబాలు గా 
మార్చి నీ కడుపు నింపినందుకు....

తన ఒడిని ఉయాల చేసి నిను 
లాలించి నందుకు

చందమామనే నీ లోగిలిలో 
ఆట లాడిస్తూ ...నీ
నవ్వుల్లో వెన్నెల్లు
తాను పంచు కున్నందుకు

బొజ్జ నిండినా...
ఇంకా ఇంకా గోరు ముద్ద 
అంటూ నీ పెదవంచున 
ప్రేమని పూసినందుకు

తడ బడే నీ అడుగులు 
చూసి తాను మురిసి
తాను ఊతమై నిను 
నిలబెట్టి నందుకు 

అక్షారానికి అక్షరం తానై
నీ చేత దిద్డిస్తూ
నీ అభివృద్ధికి 
తాను పునాది రాళ్లు 
గా మారి నందుకు 

ఆకాశం లో కెగురుతూ
అమ్మ కంట నిలిచిన 
చెమ్మ ని గమనించని 
నిన్ను ఏ నాడు నిందించనందుకు

రెండు నిమిషాలు నీ 
పలకరింపు కై 
తన జవ సత్వాలని 
కూడ దీసుకొని 
ఎదురు చూస్తునందుకు 

చివరి శ్వాస లొ
మూతలు పడుతున్న
కను రెప్పల అంచున
నీ మసక రూపం కోసం
పరితపిస్తూ ...
కలవరింతలలో ...
"కన్నా! తిన్నావా!"
అంటూ తల్లడిల్లు తున్నందుకు

అమ్మ ఎప్పుడు అడగదు....
నిర్జీవమవుతున్నా...


దూరమవుతున్న నీ 
అడుగుల చప్పుడు
నా ఎద పగులులకు
కారణమవుతుంది...

మసక బారుతూ 
మాయమవుతున్న నీ రూపం
మనో మందిరమిక
శిధిల శకలాలేనని చెపుతుంది

ఙ్ఞాపకాన్ని ఘనీభవింపజేసి
నీవెళ్ళిపోయావు ....
నాలో నేను లేక 
నిర్జీవమవుతున్నానిక....!!
నా శ్వాసని నీతో పంపించేసి....

తీర్పు...


నీ కనులు చెప్పిన ఊసులకు 
నా రెప్పలు సాక్ష్యం ..

నీ ఎద చేసిన బాసలకు 
నా మనసు సాక్ష్యం....

నీ పెదవులు పలికిన మాటలను
లిఖించుకున్న నా హృదయమే సాక్ష్యం.

నీ కదలి పోయిన అడుగులకు 
చితికిన నా బ్రతుకే సాక్ష్యం ...

నీ అంతరాత్మ న్యాయస్థానంలో...
అపరాదివి నీవు.... 

సాక్ష్యాలను కూడదీసుకొని 
వాదిస్తా...న్యాయవాదినై...

న్యాయమూర్తైన ప్రేమ గారి 
తీర్పు ఎటువైపు ఉంటుందో..మరి..
నాన్న !!

అమ్మ పాలు త్రాగి 
ఆకలి తీర్చుకున్నా..
నాన్న అనురాగాల లాలనలలో...
అన్నీ మరచి జీవించా......

చట్టి తల్లినైన నన్ను గాల్లొకెగరేస్తూ...
నా కిల కిల నవ్వుల్లో
తన వయసును మరచి 
నా అల్లరిలో పాలు పంచుకున్న నాన్న!

అడుగు..అడుగు కూ 
తన అరచేయి ఉంచి
తడబడు అడుగులను 
తప్పటడుగులు కానివ్వని నాన్న!

అ ఆ లు దిద్దిస్తూ......
నాకు తోలి గురువై 
అహర్నిశలు నా ఉన్నతిని కాంక్షిస్తూ
ఆత్మా స్తైర్యం నింపిన నాన్న!

ఎదిగిన నన్ను చూసి 
ఆడపిల్లనని గుర్తెరిగి 
తప్పక అప్పగింతలు చేసి 
కనుపాపల వెనుక ...
కంటి చెలమను దాచి ..
పంటి బిగువును ..
మీసాల పక్కకు నెట్టి
ఆలింగనంతో అభయ హస్తమిస్తూ 
వీడ్కోలు చెప్పిన నాన్న!

నా కంటి పొరల వెనుకే గానీ...
కనుల ముందుకు రాలేని 
లోకాలకు సాగిపోయే...నాన్న!

నేనాడపిల్లనే...చివరికి...
చితి పెట్టను కూడా..
పనికిరాకపోతినే....
నాన్నా....!!!

(సరిగ్గా...ఏడు సంవత్సారా ల క్రితం ఇదే రోజున నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు...అశ్రుతర్పిత నయనాలతో...)...

బలపాల రాతలే…
మద్యతరగతి మహిళ జీవితం

స్పందలను రాస్తూ…
చెరిపేస్తూ…
ఊహలను ఉమ్మెత్తలో కలిపేస్తూ…
తాళిని దాటనివ్వని తలపులకు
తాళం వేస్తూ…
మెట్టెల కాళ్ళతో మెట్టినింటి బరువును మోస్తూ…
మగని అహంకారపు కొరడాలని భరిస్తూ….
కన్నవారి కనుదోయిని
కరగనివ్వకూడదని తలపోస్తూ…

మహిలో మణిపూసైనా… మట్టిరవ్వగానే బ్రమిస్తూ….
వయసుడికి వార్ధక్యం చేరినా…
‘ఓ మహిళ ‘ గా ఎదగలేని తను
వాక్యాలకందని అక్షరాన్నని తనని తను తెలియజేస్తూన్న…
మద్యతరగతి మహిళ జీవితం…
బలపాల రాతలే….

- సుజాత తిమ్మన

- See more at: http://vihanga.com/?p=10213#sthash.E9WUdHUB.dpuf
ఎందుకమ్మ.....!!

తల్లీ గోదారి....
నీకెందుకమ్మ
నేనంటే ఇంత ప్రేమ....
కృష్ణమ్మతో కలిసి
పరాడుతూ....
సముద్రం లో కలవకుండా...
నా హృదయ సంద్రం
చేరా వెందు కమ్మా...

మీ చేరిక తో....
వేదనల అగ్నిపర్వతం
బద్దలై....
సునామీ సృష్టిస్తుందే...
ఉబుకుతూ మీరు
హృదయకవాటాలను
చేదించుకొని....
కనుల దారులను
ముంచేస్తూ.....
వెచ్చగా...చెంపలను
చెలమలను 
చేస్తుంటి రే.... 

మీ ఆప్యాయతాలింగనంలో
నే నావిరై పోనా.....!

స్పటికమ్ లాంటి
స్వచ్చ మైన మీరు
ఉప్పు నీటి 
పరమైనారని....
మరింత కన్నీరు
కార్చనా......!!!

పాపం.....!!!

మనుషులను విడిచిన మానవత్వం
ఎగురుకుంటూ ఎగురుకుంటూ....
వినువీది ని చేరి
మేగాలను తాకి .....
గర్షణ కలిగించింది...
ఆ ఘర్షణల వరవడి లో....
రాలుతున్న చినుకులు 
తుఫాను గా మారి 
జన జీవనాన్ని 
అతలాకుతలం చేస్తున్నాయి....

వెలుగుతో పాటు
మండే ఎండను పంచే 
సూర్యుడు సైతం 
మిన్నకున్నాడు 
ఈ భీభత్సవాన్ని చూస్తూ....

పండిన పంటలు 
వరదల్లో కొట్టుకు పోతున్నాయి 

ఏపుగా ఎదిగిన పైరు
నీట మునిగి నిర్జీవమౌతుంది....

కన్నీటి సునామీలు
కర్షకుల కళ్ళల్లో....

గుండెపోట్ల దాడీలు 
ముంగిళ్ళకి చేరువలో....

షావుకార్లు లేని
సరుకుల బజారుల్లో
కాలుతున్న కరీదె...
ప్రతీ వస్తువు...
సామాన్యుడు తాకడానికి 
బయపడే జ్వాలాముఖే...

దానికి తోడు 
కాలుతున్న కడుపు 
మర్మం తెలియక 
డొక్కల నెగరవేస్తూ...
చప్పుడు చేస్తుండే....
పేద వాడి బ్రతుకు ...

తమ తప్పు లేకుండా 
రాజకీయ రాబందులు 
ఆ డొక్కల చీల్చి చెండాడుతూండే...

ప్రకృతి మాత్రం 
ఏంచేస్తుంది.....
పాపం.....!!

శివ సాన్నిద్యము చేర 
లింగాభిషేకము చేయ
గంగ నీరు తేవ...
పోతుంటే...
గట్టు దాటనైతినే ...

విషయ మెరుగని 
మనసు విఖల మై 
విరక్తి చెంద ...
హృదయమున కురికొచ్చింది...
పరుగు పరుగు న 
పావన గంగమ్మ తల్లి ...
కంటి దారుల 
దుమికేనయ్యా..శివయ్యా...
నీ కభిషేకము చేయ ...

ఒక మంత్రం పుష్పం...


ఒక మంత్రం పుష్పం....
నీకు సమర్పించ 
విశ్వమంత గాలించా...
సుక్ష్మ రూపినై....

ఎద పొద లోనే పూసింది...
నీ ధ్యాన సుగంధాల రేకులతో...
ఎరుగక నేను...
వెతికి వెతికి...వేసారితిని...

నే..అలసి.. సోలసినా గానీ...
వాడనీయక ఈ సుమాన్ని..
నీ పాదాల చేర్చాలనీ..
తపనతో..నీ ఎదుటనే నిలిచితినీ....
శ్రీ వెంకటేశ్వరా....శ్రీ శ్రీనివాసా....