17, జూన్ 2019, సోమవారం

మావా ...
సంజెకాడ వస్తానని మావా
ఎటుపోయినాడో
ఎంతకీ రాడాయె
ఏళ్ళు గడిచినవే గాని
ఏడనున్నాడో మావా
ఎంతకీ రాడాయె . .
నిజమైన ప్రేమా
నిండుచంద్రుడయి
నింగిన వేళ్ళాడే
నిప్పులు చెరిగే గుండెలో
మావమాటలే కుప్పలుగా కదలాడే
దాగలేని వేదనతో
కనులే బరువాయే ..
చలి చీమలు ఒంటిని బాకుచు
తెరలు తెరలుగా వణికించె
చుట్టూ చేరే అమ్మలక్కలు
మాటల సూదుల కుళ్ళబొడుస్తుండే
బదులు చెప్పలేని బతుకయినది
.అర్ధరాతిరి చీకటే ..
వీడలేని తోడయినది ...!
s

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి