8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కోపం...తాపం..
మనువు నుంచి మొదలు 
మనిషి రూపము మాకిచ్చినావు ..
ఆ రూపులోనే నిన్ను ....
దేవునిగా కొలుస్తున్నాము..
కృష్ణ పక్షం...శుక్ల పక్షం అంటూ..
తరుగుతూ..పెరుగుతూ..ఉండే
నెలవంకని సిగన చుట్టి మెరిపిస్తున్నావు..
సుఖ దుఃఖాల నిలయం జీవితం
అని తెలియజెపుతూ..
సృష్టి ..స్తితి ..లయ కారకుడయిన
భానుని అగ్ని శిలలు నీలో నుంచి
జనించినవే కదా ఈశ్వరా..
ఆ తాపం తగ్గించు కొందుకే..
గంగమ్మని తలపై నుంచుకొంటివి...
ప్రేమ తత్వం తెలుపుటకే..
నీకై తనువు చాలించిన సతి..
పార్వతిగా తిరిగి నీకు ఆలి అయింది..
నీలో సగం తనకిచ్చి నీవు..
అర్ధనారీశ్వరుడవి అయినావు...మహా దేవా..
ఐక్యమయిన ఆత్మల సంబంధం
ఆలుమగల అనుబంధం ..
అలకలయినా...అలింగనాలయినా..
మూతి విరుపులు ..
మగని క్రిగంటి చూపుల మెరుపుల కొరకే..
ఈ తత్వం తెలియదా నీకు శంకరా....
(కొస మెరుపు ...)
మరెందుకయా...
ఆవకాయ వడ్డించ లేదనా ..అమ్మ మీద కోపం..!!
ఏ సి రిపేరు చేయించ లేదనా తల్లీ...ఈ తాపం..!
మంగళ కరములు
శ్వేత వర్ణంలో మెరిసిపోతూ..
తల్లి సరస్వతీదేవి....
వేలికదలికలలో పలికించే..
వీణానాధ సమన్వయంలో..
తెప్పరిల్లుతూ తండ్రి బ్రహ్మ దేవుడు..
అత్యంత శ్రద్దతో..మలచిన శిల్పమా..
ఏమని వర్ణించను..
ఉదయ కాంతులతో పోటీ పడుతూ..
నీ మేని ఛాయ ..బంగారు రంగులో మెరుస్తూ..
అరవిందమయిన ముఖంలో..
తామర రేఖుల వంటి కనుల తళుకులు ..
పూసింది సంపెంగ నాసికై...రవ్వల ముక్కు పుడకతో..
తుమ్మెదరెక్కలవలె ..కురులు సిగను బందీ అయి..
కలువలను కరముల మోయలేక సఖి..
ఎదలోని భావాల దోసిలిలో ..
అరమోడ్పు ఆరాధనల అర్చనలు..
మేలుకొలుపుల వెంకట రమణునికివే..
ఉషోదయపు హారతులు...
శ్రీనివాసుని చరణ కమలములే..మంగళకరములు.
మృతమై..!!
సహించ లేనిది
ఈ ఎడబాటు...
భరించ లేనిది.. 
నీ తలపులను
మరచిన గ్రహపాటు...
కలతలన్నీ కలిసి...
వేదనలను ప్రేమించి...
ఎద గూటిలో చేరి..
కాపురమున్నాయి ..
పదిలంగా....
మర్మమెరుగని మనసు..
మౌనించి...శ్వాస విడిచి..
సమాధి స్టితినొందె......
మసక బారిన చూపులతో..
కనులు వాలిపోయె.....
బ్రతుకు భారమై...
ఈ కాయం ఛరించే...మృతమై.
నా కొక్కదానికే తెలుసు..!
వేకువలో విచ్చిన కిరణం ..
కమ్మిన మబ్బులలో ....
దాగుతుందా...
తన ప్రసరణను అపుతుందా...
వీక్షించే కనులలో..
వేయని రెప్పల మాటున ..
నీకై శ్వాసించె నా ఆత్మ చప్పుడు
నా కొక్కదానికే తెలుసు..
జీవిత సమరంలో ...
గెలుపు గురుతులు కానరాక..
ఓటమితో చెలిమి చేయలేక..
నీ మదిలో జరిగే సంగర్షణల జ్వాలలో ...
ముసురుతున్న నల్లటి పొగ సెగలో..
సైతం నా తోడు కోసం పరితపించే..
నీ మనస్తత్వం...
నా కొక్కదానికే తెలుసు...!
ఎరుపెక్కిన నీ కన్నులు ...
లోలోన కోరుకుంటున్నాయని..
నా ప్రేమస్పర్శల ఆలంబనని....
కసురుకుంటున్నా....నీ మాటల వెనుక...
నన్ను పోగొట్టుకుంటానేమో ...
అన్న బయం దాగున్నదని ...
నా కొక్కదానికే తెలుసు..!
‘నాతిచరామి ‘ అన్న నీ మత్రోచ్చారణకర్ధం...
మనము ఒకటిగా ఐక్యమవటమే...
.మన్నింపులు ...కంటి చెమరింపులు
మనలను పెనవేయు బందాలే...
సమాజస్థితిగతులలతో పోరాటం చేస్తూ..
జీవించే బలాన్ని తెచ్చుకుని..
మన గమ్యం మనమే అన్న సత్యం
మన ద్యేయమై...
సంసారవీణను శృతి చేసుకుంటూ..
మృదు మధుర గీతాల ఆలాపనల ..
రాగఝరిలో ఓలలాడుతూ...నీలోనేనుంటానని...
నాకోక్కదనికే తెలుసు...!!
**************
ప్రశ్నార్ధకమే...!!
క్షణాల కంచెలని
కత్తిరించు కుంటూ.....
వెనక్కి విసిరేస్తూ..
పోతుంది కాలం..
రాసులుగా మారుతున్న
క్షణాల గుట్టలను ..
ఆకలితో మింగుతుంది...
గతం ఆవురావురు మంటూ..
ముందుకు వేసిన అడుగుతో..
వెనక్కి చూస్తే..
మార్చలేని నిన్న..వేదనతో..
భారమైన గుండెని ..
మోయలేక...ఆశ చావని మనిషి..
నేటిలో జీవించలేక....
రేపును చూస్తే..అదీ...ప్రశ్నార్ధకమే...!!!!
పుష్పకవిమానమే...మరి...!
ముల్లోకాల్లోనూ అతి ధనవంతుడయిన కుబేరుని
మనో భావాల సమాహారమే...పుష్పకవిమానం ..
స్వర్గాన్ని జయించిన రావణుని చేతులలో చిక్కి..
భువికి ఏతెంచి...లంకానగరానికి శోభగా నిలిచింది పుష్పక విమానం.
.
వాయువేగాన్ని మించిన మనోవేగం కలదై
సీతాపహరణలో ముఖ్య పాత్ర పోషించి..
మూగగా విలపించింది... పుష్పక విమానం..
రావణసంహార అనంతరం...సీతాలక్ష్మణ ఆంజనేయులే కాక..
విభీషణ సుగ్రీవ ..మొదలగు .. అతిరధ మహాయోధుకను.. తనలో..
పొదువుకుని.. మరొకరికి చోటు చూపిస్తున్న అక్షయం .. పుష్పక విమానం..
అన్నగారి రాక ఘడియ ఆలస్యం అయినదని....
ప్రాణ త్యాగానికి సిద్దపడ్డ భరతుని ఆనందసాగరాన తేలింపజేస్తూ..
తళతళమెరుపులతో..మింటి నుంచి మేఘంలా వాలింది పుష్పకవిమానం...
భక్తిరస ఆస్వాదనలో ఇహం మరచి..పరమాత్మను తమలో
దాచుకున్న భక్తాగ్రేసరులకు ముక్తినొసగుతూ...
సుశరీరాన్ని మోసుకెళ్ళే మహిమాన్వి ..పుష్పక విమానం..
ఇతిహాసాన్ని చదువుకుంటూ... ఇవి ఇహంలో లేవు అనుకున్నా...
ప్రతి మనిషి మనసు కూడా పుష్పకవిమానమే..
పుట్టిననాటి నుండి.. సమస్యల వలయాలు ..
వేదనలు...రోదనలు.. కలతలు కన్నీళ్ళు..
ఆరాధనలు, ఆవేదనలు... ఆనందాలు ..అతిశయాలు...
జవాబు దొరకని ప్రశ్నలు.. జీవం మరచిన జీవితాలు ....
స్వార్ధంతో పక్కవాడిని పడగొట్టాలనే తాపత్రయాలు...
ఎన్ని ఎన్నిటి నైనా..అలవోకగా మోసే మనసు పుష్పకవిమానమే.మరి..!!
***************** *************
మాట్లాడే బొమ్మ.
మట్టిని తెచ్చావు..
నీటిని వేసి కలిపావు...
కాళ్ళ కింద వేసి తోక్కావు...
వేళ్ళ సందుల్లోంచి బయటికి వచ్చేలా..పిసికావు..
నీ ఉహలకి ప్రాణం పోసుకుంటూ...
మలిచావు అందమైన బొమ్మగా..
కొలిమిలో వేసి కాల్చావు...
మళ్ళి...చల్లార్చావు...
నీ మనసు దీరా చూసుకుంటూ..
రంగులను వేసి..మురిసిపోయవు..
మెరుపు బట్టలేసావు..పూసల దండలతో
ముస్తాబు చేసావు..
నీ ఇష్టాన్ని కళ్ళ ల్లోంచి కురిపిస్తూ..
తడిమి తడిమి చూస్తావు..
ఇన్ని చేశి నీవు...షో కేసులో ఉంచుతావు..
అలంకారానికి అందంగా ...
ఏళ్ళకి ఏళ్ళు గిదిచిపోతూ ఉంటాయి..
మారనిది బొమ్మ స్థానం మాత్రమే..
ప్రాణం లేదు..పలుకలేదు అనుకున్నా..
ఒక్కో సారి వాటికళ్ళల్లోకి చూస్తూ ఉంటె..
ఎన్నో ప్రశ్నలు వేస్తాయి..
మనలో చెలరేగిన ప్రశ్నలకి జవాబులూ చెపుతాయి...
అందుకే...బొమ్మకి ప్రాణం లేదు అనుకోవద్దు మరి..!!
******** **********
ఎన్నటికి కరగని కల

రతీదేవిని తలపించే ఆమెను చూసిన వేళ
మదిలో మన్మధ హేల..
రమణి వయ్యారాల సిరులను 
దోచుకోవాలనుకునే...మరుల గోల..
రమ్యమయిన తలపులలో
విహరింపజేయు విరహాగ్ని లీల..
రక్షణ కోల్పోతుందని యవ్వనం..
అలజడులపడు టేల...
రత్నాలు..మణిపూసల హారాల సింగారాలు
దాగినవి ఆమె చిరునవ్వుల ..
రవి కిరణాల వలె స్పృశించు
చూపులతూపులు కన్నుల..
రజిత మయమే ...
ముఖారవిందపు వెన్నెల ..
రక్కసి అయి కాలం .గడవకున్నది..
క్షణం యుగమై...ఏల...
రజనీకరుని కరుణయున్నను...
ఆమె హృది కరుగకున్నదేల..
రంగులమయమయిన వలపుల కలయికలతో
జీవితం అవుతుంది ఎన్నటికి కరగని కల..!.
ఊగరా..ఊయల...
అమ్మ ఒడి ఊయల చేసి..
ఊగరా...ఊగరా...ఊయల..
నీలాల కన్నుల్లో 
నిండు చందమామ ..
నీదవును రా...
లాలి లాలి జో...రామ లాలి జో ..
కొంగు చాటున చేరి..
అమ్మ రొమ్ముతో కుస్తీలు పడుతూ..
బొజ్జ నింపుకొన్న బుజ్జి తండ్రి..
అరచేతిలో అమ్మ తాళిని బిగించి...
ఆదమరచి నిద్రించినావా చిన్ని తండ్రి..
నిదురలో గొంతు దిగని పాలు...
నీ పెదవుల దాటి బుగ్గలపై జారెనురా..చిట్టి తండ్రి..
లాలీ లాలి జో...రామా లాలి జో...
రాముడని అనుకోనా...
ధర్మమే చెప్పనా...
కృష్ణుడని అనుకోనా...
అల్లరులే సహించనా..
వాదాలకు తావివ్వని
వేదాలు నేర్పించనా...
అన్న....
అయోమయమెపుడు ఈ అమ్మది..
నీ ప్రేమ చాలు..
నీ ముద్దు చాలు..
అనురాగాల నీ స్పర్శ చాలు..
అచ్చంగా ...
నీవుంటే చాలు..చాలు..
అన్న భావమే..నీ కనుల కురిసేది...
ఉంగాలతో..... నీవు చెప్పేది..
ఇదే... భాగ్యమనుకుంటా...
ఇదే..స్వర్గమనుకుంటా..
నీకై జీవిస్తా..
నా నాన్నే నీవైనావని తలచి..
నీ అలనలో అన్నీ మరిచి..
నీకై శ్వాసిస్తా..
మృత్యువే నను చేరితే..
ఒక్క వరమే అడుగుతా..
“తిరిగి... నీవే నా నాన్న అవ్వాలని..”!!
ఆవాసం..
ఆకాశమే వంగి హాయ్ ...అన్నది...
ప్రతి చినుకు పలకరింపుల
ప్రేమ కురిపిస్తున్నది...
పరువాలు తడిచి పాడమన్నవి..
ప్రణయ రాగాల మరులు
విరబూస్తూ....తేలమన్నవి...
ఏకమైన హృదయాలలో
వీణా... నాధాలేవో..మ్రోగుతున్నవి...
ఫలించిన అనురాగాలలో
విరహాలన్నీ...
విరంచిలయి చెలరేగుతున్నవి..
కావ్యమైన మనకధ
కౌగిలిలొ.... కరిగి..
నిజమైన కలలకు ఆవాసమైనది..!!
రోజా పూవు..
విరిసిన గులాబీని చూస్తూ..
మనమనుకుంటాం...
ఎంత అందంగా ..
మనల్నిచూసి
నవ్వుతూ..ఉందని....
నిజానికి అది..
గజగజ వణుకుతుంది..
ఎక్కడ తనని కోస్తారో..
కోసిన వాళ్ళు ఊరికే ఉండరు కదా..
జవరాలి సిగన ఉంచి మురుస్తారో..
పూజలో స్వామికి సమర్పించి
బ్రతుకుకు అర్ధం చెపుతారో..
గాజుకూజాలో అలంకార ప్రియంగా వాడుతారో..
బుట్టలలో మరిన్ని గులాబీలతో జతచేసి..
అంగడి సరుకుగా అమ్ముతారో..
నిర్జీవ శరీరంపై ఉంచి..నివాళులిస్తారో..
రెక్కలు తుంచి యంత్రాలలో వేసి..
తైలం తీసి ..పిప్పి చేస్తారో..
అనుకుంటూ..ఎన్నో..ఎన్నెన్నో..
భయాలు..
ఆకు ఆకు చాటు చేస్తూ..
పొడుచుకొచ్చే ముళ్ళని కంచెగా చేసి..
కాపాడాలనే తపనతో...తన తల్లి
తన ఉనికిని కూడా గుర్తించ నియ్యకుండా..
అమ్మ స్పర్సనుంచి వేరు చేస్తారనే భయాలు..
పులిని చూసిన లేడివలె భీతితో....
ప్చ్..
పరిగెత్తలేదుగా..మరి..
మనకి ఆనందాన్ని ఇవ్వటం కోసం..
పూసిన ప్రతి పూవు...ఎప్పుడూ ..
బలి అవుతూనే ఉంటుంది ...
అర్పణలో దాగిన ఆనందాన్ని వెతుక్కుంటూ..
పలు రేకుల రోజాపూవు...
కనుల బాసల కలిమియే నీవు..!!


నిను చేరిన మనసు

బాహ్య పొరలను చీల్చు కుంటూ..
నీ చూపు..ఎదను తాకిన వేళ
స్పందనలను మరచి ...
పులకింతలకు దాసోహమంటుంది..
.
మనసు విచక్షణకు వీడ్కోలు చెప్పి..
నీ చుట్టూ పరిబ్రమిస్తుంది...
నీ అవసరాలకు అవాసమవ్వాలనే 
వయసు వలపు సెగలు చిమ్ముతుంది..
నాలోని నన్ను గుర్తించలేని 
అలసత్వంలోని నీ ప్రవర్తన..
హృదయానికి రంద్రం చేసి...
రుధిర ధారల స్రవింప జేస్తుంది..
కళ్ళెం వెయ్యాలని చూసినా..
ఆగని కాలపు గుఱ్ఱపు...
భారమైన డెక్కల చప్పుడు 
శ్వాసించనివ్వని ఆలోచనల కంచెలో చిక్కుకుంటుంది ..
పరి పరి విదాల పరిగెడుతూ..
లో లోని ఆరాటాన్ని..
నీతో చెప్పుకోలేనితనం...
నాలో నన్నే...విగత జీవిని చేస్తుంది.....!!

7, సెప్టెంబర్ 2017, గురువారం


కిందకి జారబడిన ముత్యాల బుట్టలు గుసగుసల అల్లరులు చేస్తూ..
ఊగిసలాడు తున్నాయి..మెల్లగా ..మత్తుగా..
కళ్యాణ తిలకంతో పోటీపడుతూ...
ఎర్ర రంగు పాపడ బిళ్ళ నుదురును
ముద్దాడుతూ..మురిపిస్తుంది..
బిగువైన పరువాలకి తోడు..బరువైనవా ..
అనిపిస్తున్నాయి బంగారు గొలుసులు..
లేనట్టుండే నడుమును చుట్టేసిన వడ్డాణం..
ఒళ్ళంతా తడుముతూ..పసుపు రంగు కంచి పట్టు చీర...
కావాలని కుట్టించుకున్న మల్లెపూల జడ..అక్కడక్కడ గులాబీలు..
నిలువెత్తు నిండుగా ముస్తాబయిన తనని తాను...
ఓరకంట నిలువుటద్దంలో చూసుకుంటూ.. “ఇన్నాళ్ళూ దాచిన కన్నెతనం..
కానుక చేస్తూ...ఇక పై వారు నేనవుతా..వారిలో నే జీవిస్తా...’
మనసుతో మాట చెప్పుకుంటూ..దోసిట్లోకి కొబ్బరి బోండాం అందుకొని..
వెంట వచ్చే ముత్తైదువులతోపాటు..మెల్లని అడుగులు వేస్తుంది..నవ వధువు..!!
వెన్నెల సోనా...
జాబిల్లి లాలి..
వెన్నెల సోనా...
వేకువ ఎరుగని 
నిద్దరమ్మ నీది..
పొద్దే తెలియని
పొదరిల్లు నాది..
ఊయలయ్యే ఆకాశం..
ఊపుతుంది గాలి మనకోసం..
తారలతో సైయ్యాటలు...
రాలే నక్షత్రాలతో పోటీలు..
కొమ్మ కొమ్మన పూసిన
మంకెన పూవుల ఆశిస్సులు...
నూరేళ్ళ బ్రతుకుకవి ..
నిండైన సోపానాలు...!!
రెప్పల ముసుగేస్తూ....
మన్నింప లేని నీ మనసుకు...
మమతల హరితాన్ని దారపోసి..
మబ్బుతెరల మాటుకు సాగిపోయా..ప్రియా!
నీ గుండెకు గాయమవుతుందని తెలుసు...
కానీ అది నీవు గుర్తించవనీ తెలుసు...
అందుకే...నీ తిరస్కారవిక్షణాలకు
జవాబు కాలేనితనాన్ని...
నాలోనే దాచుకొని...
మవునంగా మరలి పోయా...ప్రియా!!
శిశిరాన్ని ఆహ్వానించిన నీ తలపులకు...
మోడుగా మిగిలిన నీ జీవితాన్ని
బహుమతిగా ఇచ్చి....
ఒంటరి ప్రయాణంలో...
అలుపు మరిచి సాగిపోతున్న నిన్ను
నీకు కనిపించని కన్నులతో
చూస్తూనే ఉన్నా...
చిప్పిల్లిన రెప్పల ముసుగేస్తూ..ప్రియా...!!.
నిజం ..కోట..****
సుస్థిర సామ్రజ్య స్థాపనకు రక్షగా
మహారాజుల దర్పానికి చిహ్నంగా
చరిత్రను చాటి చెపుతూ...
వందల సంవత్సరాలు గడుస్తున్నా..
శిధిలావస్థలోనూ చిత్రంగా నిలబడిననిజం .. కోట...
రాణివాసపు సిరులను..
దేవేరుల అంతరంగ అందాలను..
పదిలంగా దాచుకుంటూ..
వారి వారి అభిరుచులననుసరించి..
కళామతల్లులకు నీరజనాలర్పించి నిలిచిననిజం,,కోట..
శత్రుసైన్యాలను దరిచేర నివ్వకుండా..
చుట్టూ కందకం ఉండేదట నిండు నీళ్ళతో..
అయినా తాళ్ళతో కట్టిన ఉడుములను
కోటగోడ చివరి అంచులకు విసిరేవారట పట్టుకుని ఎక్కటానికి..
అమ్మమ్మ చెప్పే కథలకు నిదర్శనమైన నిజం ...కోట...
ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు..
ప్రతి రాజప్రాకారం..అద్భుతమైన కళలకు ఆలవాలం..
ప్రాంతాలవారిగా..చిత్ర విచిత్రమలుపులతో..
ఆనాటి చతురస్ర చైతన్యాన్ని చూస్తూ..
ఔరా ! అనిపించే అపురూప సందర్శన సంబరమైన నిజం ..కోట..
మట్టి రాళ్ళతో నిర్మితమైనా..కంచుకోటగా నిలిచి....
ఎత్తైన ప్రాకారాలు..బురుజులతో...
ప్రాచిన సంప్రదాయాల శోభితమై..
ప్రజలను రాజు పరిపాలిస్తే..
ఆ రాజునే పరిరక్షించడానికి కాపలాగా నిలిచిన నిజం ..కోట..
ప్రతి మనిషి తనకు తానే రక్షణకోటగా నిలిచి ...
ఆత్మస్థైర్యం ఆయుధంతో నిరాశ నిస్పృహలనబడే
శత్రులను చీల్చి చండాడి...మొక్కవోని ధీక్షతో..
అందిన అవకాశాన్నిఅందుకుంటూ..అనుకున్నగమ్యం చేరితే.
తనలోని రాజ్యానికి తానే మహారాజు కదా మరి..!!
పసితనం....
ముఖమంతా నవ్వులతో ...
విచ్చిన ఎఱ్ఱని రేకుల తో..
చిరుగాలి తాకిడికి కుడా...
పరవశించి తలలూపుతూ..
పలకరిస్తాయి...గులాబీలు
విప్పారిన నయనాలతో..
భేద బావాలెరుగని
స్వార్ధ రహిత పలకరింపులతో...
ఎల్లప్పుడూ ఉదయ కాంతులు
చిందిస్తుంది కల్మషం తెలియని పసితనం..
అందమయిన ఆ గులభీలను
చూడగానే...తెంపేస్తాము..
రాలే రేకులను కుడా లెక్కచేయక ..
అది మానవ నైజం...
పసి పాపాలని కుడా చూడక
ఆ నవ్వులను నలిపేసే..
కామందుడు..
ఏ న్యాయం ..ఏ శిక్ష వేసినా..
జీవితం చిగురించునా...
తెలుసుకోర నరుడా..!
పామరుడవైనా...నీవు...
మనిషివే...విజ్ఞత కలిగి మసలుకో...
పాప పుణ్యాల వత్యాసం తెలుసుకొని
నీ బ్రతుకే కాదు...ఎదుటివారినీ బ్రతికించు..!!


అమ్మవే..నమ్మా!!.
ప్రశాంత వదనంతో..
కళ్ళతో వెన్నెలలు..
మొలక నవ్వులతో..
మల్లెలను వెదజల్లే అమ్మ
గోడ మీద పటంలో నుంచి 
నా వైపు చూస్తూ...
" ఎరా బంగారు...
నేనంటే నీకంత అలుసా...
నా ఫోటోకి బొట్టు పెట్టవు..
దండ వెయ్యవు...కనీసం..
ఏడాదికి ఒక్కసారి...అయినా..
నాకు భోజనం పెట్టవు..."
అంటూ...కోపంగా చూస్తూ ఉంది..
"అయ్యో! 
పిచ్చి అమ్మ..నీవు
దేహాన్ని వదిలి వెళ్లావు గానీ..
అనుబంధాలని వదలలేదు కదా..
నీలోని ఓ కణాన్నే నేను..
నీ ఊపిరితో పెరిగాను..
నీ ఊసులతో ఎదిగాను...
నీ పలుకలలో ఓ పదాన్నే నేను కదమ్మా!
లోకం అంటుంది నీవు చనిపోయావని..
కానీ...నాలో...లోలో..ఎప్పుడూ..
సజీవంగానే ఉంటావమ్మా...
తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఎలా
నన్ను నిర్దేశించావో..అలానే..
ఇప్పుడు కూడా నేను వేసే ప్రతి అడుగులోనూ..
నీవు నేర్పిన పాఠం అరచేయిగా మారి 
నా జీవితగమనాన్ని సుగమనం చేస్తుందమ్మా..!
అందుకే ..నమ్మా...
నీ పటానికి బొట్టు పెట్టను.. దండ వెయ్యను...
ఎదలోను..ఎదుట కూడా నీవు నాకెప్పుడు..
అ..ఆ..లు నేర్పుతున్న అమ్మవే..నమ్మా!!.


ప్రతీ క్షణమొక మెట్టుగా ఎక్కుతున్నా.... 
అయినా ప్రాయాస లేదు సాయి నీ ధ్యానంలో...
నీ నామ స్మరణే నా ఊపిరి "సాయి" 
ప్రతి నిత్యం నీ చరితం పారాయణమేనోయి
గగనతలంలో నిలచిన అంతర్యామివి
ప్రతి సూక్ష్మం కూడా నీ దృష్టిని విడిపోనీయనివి
నీ సన్నిధి చేరుటకై ఆరాటం 
నే చేస్తున్నా నీ కిదే నా ఆత్మార్పణం !
సాయి నాధా....
సద్గురు రూపా...సాయినాధా....
ఇలను నిలచిన
మహోన్నతుడవు నీవు కాదా.... 
నీ పరమయిన పరందామమును
నిన్నాస్రయించిన భక్తులకు
పంచితివి కాదా...//సద్గురు//
మనసున తలచిన మర్మమునెరిగి
నిజము చేసి నిశ్చలతనిత్తువు
మాయ కాదు...మహిమ కాదు....
మనుగడయే సిసలు నీకని తెలుపుదువు //సద్గురు//
దేవ దేవతల సమ్మిళిత శక్తివి నీవు
అయినా...సాధువై జీవించినావు
జన్మ జన్మకు కర్మఫలము
నీవెంటే నుండునని తెలిపినావు //సద్గురు//
వాడవాడల నీమందిరాలు..
దినముకు నాలుగు మారులు
నీహారతి పాటలు...
ఎంత పెరుగుతున్నా పాపం
నసింప జేయును
నీ పలుకులలోని సద్బావం...//సద్గురు//

గగనంలో విహరిస్తూ
చేసుకున్న బాసలవి
కాలం కరుగుతున్నా...
దూరమనే మజ్జిగ చిలికి
అనురాగపు వెన్నని
మేనంతా పులుముకొని
ఒకరిలో ఒకరమై జారుతూ
సేద తీరుతున్నాము .....
మేఘ సందేసాలు ...
హంస రాయబారాలు
మనకెందుకు .....
మనసు మూలల్లో
మరపుకు తావి లేని
చోట మమేకమై
జ్ఞాపకాలకందని
వర్దమానంలో
ప్రేమ చిగురులు
తింటూ కోకిలలమై
గాన మాధుర్యాలలో
ఓలలాడుదాము
ప్రియా.....!!!!!
సాయి నామమీయునొయి...
పరమ పావన ఫలములు.. ..
సాయి స్పర్స లోసగునోయి..
పాప పరిహార తపములు...
సాయి సాయి...సాయీ...
సర్వము సాయి...
సాయి జగతులోనే..
జీవములోయి...
జన్మ జన్మల పుణ్యమే నోయి..
సాయి సన్నిధి నీకు దొరికినదోయి..
ఆలపించవోయి..సాయి గానం...
ఆలకించవోయి ...సాయి సంస్మరణం...
బేదాలు తొలగును...మదిలో...
వాదాలవీడి...సమర్పించవోయి..
నీదను సమస్తం...సాయి పాదాలా !!
సాయి...సాయి..సాయీ...
సాయి..సాయి...సాయీ...
సమర్ధ సద్గురు సచితానంద సయినాద్ మహారాజ్ కి....జై....!!
ఎడారి...
నీ జతలో అడుగులు
వేస్తున్నప్పుడు ఆనందాల
పూదోటలే ఎప్పుడూ...
దారి మరల్చుకొని నీవు
కనిపించని దూరం వెళ్ళిపోయావు ...
ఎడారి అయిన ఈ జీవితం
ఇసుక తిన్నెలు తప్ప
గుక్కెడు నీళ్ళు దొరకక
తపించే...హృదయం...
సూన్యమయిన మనసుకు
మరపు మలాము పూయాలన్నా..
జ్ఞాపకం రెక్కలరెపరెపలలో
ఎప్పుడూ ఉరుముల మెరుపులే..
అయినా..
.శాస్వతమనుకున్న భందం మాత్రం
ఇసుక తుఫానులో చిక్కుకున్న ఎండుటాకే...!!
అర్పణ ...

నీ కనులకు చిక్కిన 
నా చూపులకు ..
కలలన్నీ చిక్కు ముడులై..
కలవర పెడుతున్నాయి..
విడదీసే ప్రయత్నంలో జరుగుతూ..
మనసు జారి...
నీ హృదయ మాళిగ గదిలో పడిపోయింది..
ఆరేసుకుంటున్న కురులతో...
ఆస్వాధనల లేఖలు వ్రాసి పంపుతున్నా...
అగస్యుని ఆశ్రమ నిద్రలకు తిలోదకాలనిచ్చి..
ఒక్కసారి నిన్ను తెలుసుకో ప్రియతమా...!!
హృదయ కవాటాలలోని నా మనసును
జాగ్రత్త చేస్తూ...బదులుగా నీ మనసునివ్వు..
శ్వాస శ్వాసకు నీ పేరే జపిస్తూ...
ప్రతి క్షణం అర్చనల పూజిస్తూ...
నేననే అస్థిత్వం ఆసాంతం నైవేద్యం చేస్తూ..
ఊపిరి ఉన్నంతవరకూ....
అర్పణలోనే జీవిస్తా..ప్రియతమా...!!!




అక్షరాల కెప్పుడు ఆరాటమే 
పదాల పెదవుల్లో నలగాలని ....
వాక్యాల స్థావరం లో స్థిరమవ్వాలని ....
పాటల పల్లకి ఎక్కి ఊరేగాలని ...
కావ్యాలలో కవన ఝరి కావాలని ...
ప్రబంధాలకి ప్రాణమిచ్చి చరిత్ర గా మిగలాలని ...

చీరకట్టు..

భారతీయ సంస్కృతికి వరప్రసాదంగా లభించిన చీర...
అతివల అందాలను తనలో దాచుకుని దాగుడుమూతలాడించేదే చీరకట్టు..
అమ్మాయి అనగానే లక్ష్మీ రూపం కనులముందు ఉంటె..
ఆ దేవతామూర్తులకు అలంకారభూషితమయినది ...చీరకట్టు...
దేశానికి నలుదిక్కుల ఉన్న ప్రాంతాలవారిగా...
వారి వారి అభిరుచికి తగినట్టుగా సింగారాల నెలవైనది చీరకట్టు..
పసిదానికి పసందైనది అయితే....పడుచుదానికి సొగసైనది అయి..
ముగ్ధకు మనోహర రూపమిస్తూ...ముదిత ఆహార్య లాస్యమైనది చీరకట్టు..
చేనేత కార్మికుల అద్భుత కళా సృష్టి ...నేత చీరలయితే..
వేసవిలో ఉపశమనంగా ఉంటూ..మెత్తగా ఒంటినంటి పెట్టుకునేదే..చీరకట్టు..
సాంప్రదాయానికి తగినట్టుగా....పలు రకాల చీరలయితే....
పండుగలలో ఇంతులను పూబంతులుగా మలచేదే చీరకట్టు...
ప్రాంతీయతను ప్రతిబింబింపజేస్తున్నా...పలకరింపులకు స్పందనలై..
కుల మతాలకతీతంగా .....అరమరికలు దూరం చేసేదే చీరకట్టు..
ఆధునికత ఎంతగా ప్రభావితం చేసినా..యువతులకు ...
అమ్మాయితనానికి అర్ధమై ..యువకుల గుండెలకు గాయంచేసేదే చీరకట్టు..
సీతమ్మను సైతం చింతలో పడవేసి..పట్టాభిషేకసమయంలో....
‘ఏం చీర కట్టుకోను స్వామి?..’ అని అడిగింపజేసినదట ఈ చీరకట్టు..
యుగాలు మారినా...శతాభ్దాలు గడిచినా...విదేశీయులకు సైతం
అబ్బురమనిపిస్తూ...చేతులెత్తి నమస్కరింపజేసుకునేదే..చీరకట్టు..!!!
********* **************

ఏసువి నీవు..
పరమేశువి నీవు..
ఫకీరు నీవు...
ప్రకృతిలోని ప్రతి అణువు నీవే...నీవే....
సాయి...ఓం సాయి...
జగతికి జీవం..పోస్తూ..
పర లోకపు సారం తెలుపుతూ..
అజ్ఞానపు చీకటిని తరిమి కొడుతూ..
జ్ఞాన జ్యోతిని మదిన వెలింగిచే..
సద్గురువువు నీవే..నీవే...
సాయి....ఓం సాయి...
మతములకు దొరకని
మహిమవు నీవు..
మహిలో మానవతనే
నిలిపిన మహనీయుడవు నీవు
అయినా,,,నిర్మలమైన రూపంతో..
మసీదు నివాసిగా నిలిచినావు..
నిను తలచేవారి ఎదలో కొలువైనావు...
సాయి...ఓం సాయి...

5, సెప్టెంబర్ 2017, మంగళవారం




వినాయకా..!!

"ఓ బొజ్జ గణపయ్య ...నీ బంటునేనయ్య " అని తలపుల నిలుపుకొని..
బంకమట్టితో..మనసున మెదులు నీ రూపమును తీర్చిదిద్దునునయ్యా వినాయకా .. !
మారేడు జిల్లేడు మొదలగు పరి పరి విదములగు పత్రితో..నీకాసనము వేసి..
గన్నేరు...నందివర్దనం...చేమంతులు...ముద్దబంతులే కాదు...
ఎదలో పూసిన భక్తికుసుమాల..నీకలంకారము చేసి...
ప్రాణ పటిష్ట గావించి...అష్టోత్తర అర్చనలతో...నిను పూజింతునయ్యా వినాయకా..!.
మోదుకలు...ఉండ్రాళ్ళు...గారెలు ..బూరెలు...పరమాన్నాలతో పాటు..
అటుకులు ..కొబ్బరి పలుకులు..బెల్లం కలిపి..నీకు నివేదన చేసేదనయ్యా..
శమంతకమణి కథ చదివి...అక్షతలు తలపై వేసుకొని ..
చంద్రుని చూసిన నిందను బాపుకొనెదనయ్యా వినాయకా.....!
తొలిపూజలు అందుకొంటూ ...విజ్ఞములను తొలగించే గణనాధుడవు...
మరుగుజ్జు రూపమయినా..... బహుసుందరాంగుడవు..
వాడవాడలా కొలువు తీరి...నవరాత్రుల శోభతో భాసిల్లెదవు.
నిమజ్జనము చెంది.. నీటిలో కలిసినా..లోకాల రక్షించువాడవుగదయ్యా.. వినాయకా ..!
.
పర్యావరణ పరిరక్షణగావించుటకు ...సహజసిద్ది గణేషుడను ..
ప్రతి ఇంట నిలపుకొని ..చవితిలోన చల్లగ అర్చించెదరు గదయ్యా ..వినాయకా..!




వచ్చినాడమ్మా..

వెన్నదొంగ..
ఎదలోనె దాగి..
దోబూచు కనులతో..
అటు..ఇటు..చూస్తూ..
పెదవులతో సున్నా చుట్టి..
బూరెలంటి బుగ్గలని ఎర్రగా చేసి..
అడుగుకు..అడుగు కలుపుతూ..
వంచిన బుజాల కుదుపుతూ..
నీలి వర్ణమైనా..
నిగనిగల మెరుపులతో..
మిల..మిలల తళుకులతో..
అలా...అలా...మెల్లగా...
చేరి..వచ్చినాడమ్మా....
ఎనక చేరి రెండు కళ్ళుమూసి..
వెన్నంటిన నోటితో...
ఒక్క ముద్దే ఇచ్చినాడమ్మా...
నా చిన్ని కృష్ణుడు..!