25, ఫిబ్రవరి 2016, గురువారం

అనగా...అనగా...

కాసీ మజిలీ కథలు ...
కాకమ్మ కబుర్లయ్యాయి...
కంప్యుటర్లొ కార్టూనమ్మల 
కాకా వికలకే ..
బాల్యం బానిసయ్యింది
ఆంక్షలు పెట్టే
అమ్మానాన్నల చూపుల తప్పుకొని
బామ్మల కొంగుచాటు చేసుకొని
పప్పు బెల్లాలారగించిన పసితనం
పోటీతత్వాల పాకుడురాళ్ళపై
జారి జీవం కోల్పోతుంది.....
అనగా..అనగా..
అని చెప్పే పెద్దరికం
వ్యర్ధ పదార్ధమై...
పారేసిన విస్తారే అయిపొయింది...!!
చిత్రకారుని కుంచెలోని
అపురూప చిత్రమై
మది పొరల కెలుకుతుంది...!!
ఆత్మగా మిగిలి..

కుసుమిస్తున్న
మందారంలా ఉన్న నన్ను...
కోసి పూల సజ్జలో వేస్తావనుకున్నా....
అనురాగ మందిరంలో
అప్రురూపంగా
దాచుకుంటావనుకున్నా
విప్పని రేఖులను విడదీసి....
పుప్పొడి రేణువుల
పిడికిట నలిపేసావు...
వలపు తీవెల
ఊయలలూగాలని
అశల పొదరిళ్ళ
అల్లి బిల్లి ముగ్గులేసిన నేను...
నీ అహంకారపు అకృత్యానికి
శ్వాసలను అర్పించి
నేల రాలిన విరినై...
ఆత్మగా మిగిలి..
నీ అంతరంగం చదవాలనే
నీ అనుభూతుల చుట్టూ
తిరుగుతున్నా...!!

22, ఫిబ్రవరి 2016, సోమవారం

గోదాదేవి"

అనురాగము..ప్రేమ...భక్తి..కలయికల రూపమే..గోదాదేవి..
కృష్ణనామ శబ్దాన్ని శ్వాసించటమే జీవితమని ఎంచుకొన్న
భూదేవి..తననితాను పసిపాపగా మలచుకొని..
తులసీవనాన పురిటికందుగా.అగుపించి..
.పొత్తిళ్ళతో..విష్ణుచిత్తుని..ఒడి చేరింది...తల్లి భూమాత....
తండ్రిఅయి ఆమెను..గుండెల్లోపెట్టుకు పెంచుకున్నాడాయన..
కోవెలలో జరుగు శ్రీకృష్ణుని అర్చనాభిషేకాలకు...
తోటలోని ప్రతిచెట్టును అడిగి అడిగి మరి..
కోసి తెచ్చుకున్న అన్నివర్ణముల పూలను..
శ్రద్దాభక్తులతో...అతిసుందరమైన మాలలల్లి..
ముకుందునికి అలంకరించాలనుకొని..
"క్రితం జన్మలో సత్యభామను నేనే..
నా విభుడు ఈ మాధవుడే కదూ..!"
అని తలచుకొనుచు...పరవశముతో..స్వామి సన్నిధిలో
ఉన్నాననుకుంటూ..ఆ మాలలను తనే
సింగారించి.. మురుస్తూ..చప్పున తప్పుతెలుసుకొని
ఏమెరుగక ప్రీతిగా స్వామికి సమర్పించేది..గోదాదేవి...
ఆమె ఆంతర్యం గ్రహించి గోవిందుడు..ఆమెచేయందుకొని
కల్యాణమాడి....తనలో ఐక్యం చేసుకున్నాడు..
ముప్పైపాశురాలనిచ్చి స్వామినిచేరు దారి చూపిందీతల్లి..!

18, ఫిబ్రవరి 2016, గురువారం


పరి హారము చేయ
మార్గము చూపుమా...
పరితపించు హృదయాలకి
స్వంతన చేకూర్చుమా...//పాహి//
ఆత్మ స్వరూపా...
అంజలి నీకిదే....
ఆర్తితో పిలుచుచున్నాము
ఆదుకొనుమా....ఆపదల బాపుమా...
లింగాకారా....నిర్మల తేజా....
అభిశేకాలివే...ఆనందించుమయా....
పార్వతీ వల్లభా...పరమేశ్వరా...
పాహి...పాహి...జగధీశ్వరా....
నరేద్రుడను..


నరేద్రుడను నామదేయమయినా....నలుదిశలా వ్యాపించే.. నీ కీర్తి...
తల్లి తండ్రులకే కాదు ...భారత దేశం గర్వించదగిన తనయుడవైనందుకు...
మాతాలను మదించి....మానవత్వమే మహిమాన్వితమని చాటినావు...
వేదనలు...వాదనలు...వ్యక్తి వికాసానికి అడ్డన్నావు...
అమెరికా అమ్మాయిని అమ్మని జేసుకొని...
అమ్మతనంలోని గోప్పతనమెంతో...చాటినావు...
పరమహంస ప్రియశిష్యుడవై...చిరుప్రాయంలోనే...యోగసాధన చేసి
వేదాలసారం వివరించి వివేకానందుడుగా.. ప్రతి హృదయంలో అమరమైనావు!!

17, ఫిబ్రవరి 2016, బుధవారం

గోపాల కృష్ణా.....!!
చెఱసాలలో పుట్టినా ..
చేరినావు గోకులమున
గోవులకాస్తూ గోపాలుడవై...
యశోదమ్మ అల్లారు కన్నయ్యవై...
ఎంతగ వెన్న మెక్కినా...
వెన్నమీద నీకు
మక్కువే కదా కృష్ణా...!!
నీ మక్కువ తీర్చ
కమధేనువులే నిలిచే కదరా కన్నా...!!
అల్లరులు చేస్తూ...
గొడవలే రేపేవు గోపెమ్మెల
చిధ్విలా సముగా
చిరునవ్వులు చిందిస్తూ...
చింతలే తిర్చేవు ...
నీ మాయలేమిటిరా...
చిలిపి కృష్ణా..!!
మనోహరముగా
మురళిని మ్రోగించి
సన్మోహితుల జేసేవురా ..
మురళీకృష్ణా...!!

16, ఫిబ్రవరి 2016, మంగళవారం

వెన్నెలంతా....
ఈ పున్నమిని
ఎదలో దాచుకొని....
ప్రతి రేయి పున్నమే... 
చేసుకుందాము...
వెన్నెలంతా తాగేసిన
మైకంలో..మమేకమై...!!
అనురాగాలతో...
అల్లుకున్న గూటిలో....
అప్పగింతల కౌగిళ్ళలొ...
ఒదిగి ఒదిగి...
ఒక్కరమౌదాము...!!
జన్మకు తీరని
భందమై....!!
మరు ఏడుజన్మల
అనుభందమై....!!

13, ఫిబ్రవరి 2016, శనివారం

నీ కోసం.....
నీ నిశ్వాసే...
నా ఉచ్వాసనుకున్నాను.....
నీ ఊపిరి
నాకందనత దూరంలో నీవు
నా కనుచూపుల
నీడకి కూడా కానరాకుండా...
పారిపోయావు
ఊపిరి అందని నేను
అక్సిజన్ సహాయంతో
జీవిస్తున్నాను
ధమనుల్లోని రక్తాన్ని
శుద్దిచేయడం మరచిపోయింది
నా గుండె...
నీ గుండె
చప్పుడు వినబడటంలేదని
నీ శ్పర్స కోసం
చాచే చేతులు
నీ దరికి చేరాలనుకునే కాళ్ళు
'పెరాలిసిస్ ' వచ్చి
చచ్చుబడిపోయాయి
రెప్పలు మూస్తే
కనుపాపలలో
నిలచిన నీరూపం
కనుమరుగవుతుందని
ఆ కనులు
క్లిప్పులు పెట్టినట్లుగా
రప్పలార్పటం మానేసాయి
ఇవేమీ తెలియని
పిచ్చిడాక్టర్లు
కోమాలో ఉన్నాననుకుని
ఏవేవో పరీక్షలు చేస్తున్నారు
ఒక్కసారి....
"నీకోసం నేనున్నాను"
అని ...
ఓ గాలి తెమ్మరతో
సంకేతం పంపవూ.....
చిటికలో ఎన్ని కోసుల దూరమయినా
"నీకోసం"
పరిగెట్టుని వచ్చేస్తాను....

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఆత్మార్పణ
ఏదో చేయాలనే తపనతో
నీ తలపులను మరిచి
వ్యర్ధమయిన బ్రతుకు 
బ్రతుకు తున్నము ప్రభూ...!
గమ్యం తెలియదు
గడిచిన క్షణానికి విలువ లేదు
మనసు చెప్పే భావాలకి
భాష్యం తెలియదు
హృదయం చేసే రోదన
వినేవారు లేరు
అణుక్షణం అంతర్ మధనంలో
ఆత్మ అల్లాడుతూ ఉంటే
మూసిన రప్పల మాటున
నీ దివ్య మంగళరూపం
సెకనులో అరవయ్యో వంతైనా
నిలబడితే చాలు
పగలు చూడని పారిజాతం
నేల రాలుతుంది
అయినా...
నీ పాదల చేరేందుకు
పనికి వస్తుంది
అంతటి మహద్బాగ్యం
నాకు లేదు కానీ...
నా కగుపించిన ఆ లిప్త పాటు
కాలం చాలు నాకు
నీ చరణారవిందాల
కైమోడ్చుటకు
శ్రీనివాసా.....
శ్రీ వేంకటేశ్వరా.....
అనంతం నీవు.....
నా ఆత్మార్పణ...
అంగీకరించు....
చిట్టి పిచ్చుకా !!
చిటారు కొమ్మైనా
చిటికలో ఎక్కేసే...
చిట్టి పిచ్చుకా...!!
చిత్రంలో దూరిపోయి...
మా కనుల దూరమైపోయావే....!!
వాతావరణ కాలుష్యం నిన్ను
కబళించి వేసింది...
కాంక్రీటు కబందహస్తాల ఉరి..
నిన్ను ఉపిరాడకుండా చేసింది...!!
ఊరే ..నీ పేరుగా
చేసుకున్నావే...
జొన్న కంకులబడి
జోరుగా తింటున్నావే...!!
కిచ కిచల రావాలతో పలికేవు
నీవు సుప్రభాతాలు ..
శ్రీవారి సన్నిధిలో వినిపించెనే...
అవి సుమధుర గీతాలై!!
"ఆసరా"
నేలంతా పరుచుకొని
మొదుగపూలు దినకరునికి
స్వాగతం పలుకుతున్నాయి... 
అతని తొలి కిరణాల వెచ్చదనంతో ఎఱ్ఱబడి...
వీడని హేమంతపు మంచు..
బిందువులుగా మారి
భాస్కరుని వెలుగులో ప్రతిబింబిస్తూ ...
ఇంద్రధనుసును తలపిస్తుంది...
నిర్జీవ నిశ్శబ్దం
ఆత్మీయ ఆలింగనాల
" ఆసరా " కోసం ...
అలమటిస్తూ..
అటు...ఇటు...చూస్తుంది.....!!!
రాజహంసలమే.....
వెన్నెలను మేక్కేసి...
కాంతులను కురిపిస్తూ...
విహరించే..వన్నెల జలతారులం...
మెత్తని అలల
మత్తుగ ఊగుతూ...
మైమరచి మమేకమైన ప్రేమికులం....
స్వచ్చతకి ఆలవాలం మనం
అత్యుత్తమజాతి వారసులం !!
పాలలా..పురేకులలా..
సుతిమెత్తనితనం వరమైన ..
రాజహంసలమే..!!
రాజ్యాలయినా..రాళ్ళ యినా..ఎప్పటికీ..!!

11, ఫిబ్రవరి 2016, గురువారం



మాలో ఒకడివి..
మము గాచే వాడివి..
తల్లి తండ్రుల హృదయము
కలిగి...ప్రేమించు వాడివి..
గురువువై..సన్మార్గమున 
నడిపించు వాడివి...
దైవము నీవై...
కోటి ప్రభలతో...
జీవితమును వెలిగించు వాడివి..
అయినా...
మాలో ఒకడివి..
మము గాచే వాడివి...
సాయి నాధా...
సద్గురు దేవా...
సమస్యలెన్నయినా.....
సమాధానము నీవే కాదా....
సాయి నాధా...
సద్గురు దేవా....!


నీవు....
పారిజాతమివ్వలేదని
అలుకలు బోయి
ఓరకంట కృష్ణుని శాసించే..
సత్యభామవే...!!
మహిషాసురుని వధించ
రుద్రరూపం దాల్చి...
అసామాన శౌర్యంచూపి ..
అగ్ని శిఖలు కనుల కురిపించిన ఆదిశక్తివే.....!!
అసురలనుండి సురను రక్షించ
యోచించిన విష్ణుమూర్తి అంశగా..
ముల్లోకాల సౌందర్యాలను రాసిపోసుకున్న
అపురూప సుందరి జగన్మోహినివే ...!!
ఏ పాత్రలోనైనా...అభినయాన్ని
ఆహార్యంగా మలచుకొని....
అలవోకగా అందెల పాదాల నర్తించే
ఆంద్రావని కూచిపూడి రమణివే...నీవు!!

9, ఫిబ్రవరి 2016, మంగళవారం



మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన - – 126 వ చి త్ర క వి త – పోటీ లో మొదటి స్థానం లో నిలిచిన కవిత:
Sujatha Thimmana *********రామచిలకలు************
ఒకరికోసం ఒకరను శ్వాసకంకితమై...
కులుకులకు కొత్త భాషలు నేర్పే చిలకలు..
పలుకులకు పంచదార గుళికలను పులుముకున్నాయి..
పోటిప్రపంచంలో..పరుగుపందాల మానవులకు..
రేపులోని గీతను తెలియజేయగలవీ చిలకలు..
జంటగా కలిసిఉండే... మాధుర్యాన్నెప్పుడూ... జుర్రుకుంటాయి..
కసరు కాయలతింటూ...ఆదమరచి..
చిగురాకుల జోలలో ఊయలలూగుతాయి ఈ చిలకలు..
సాత్వికతకు చిహ్నమై..లేతాకు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి..
అంబరంలో విహారానికి వెళుతూ...
గుంపులుగా చేరి..కిచకిచల..అల్లరి చేసే...ఈ చిలకలు.
దోరజామపళ్ళను ప్రీతిగా తినేందుకు.. ఇస్టపడతాయి...
తమ ముచ్చటలు తిరుచుకొందుకు...
అమాయకం ఆపాదించుకున్న ఈ చిలకలను..
పంజరంలో బందీగా చేసి.. వేదనకు గురిచేస్తున్నారే....
జన్మతః వచ్చిన అనుకరణ శాపమైనదా..
దైవం పేరును కానుకగా పొంది..రామ చిలకయినా గాని...
రామదాసు పోడుపుళ్ళను తప్పించుకోలేదే..
'చెరప లేనిది నుదిటివ్రాతే ' అది పక్షి అయినాగానీ..
అన్న నిజం తెలుపుతున్నవీ...రామచిలకలు...!!!


ఇక...
ముచ్చట పడి మూడు ముళ్ళు వేసి
మూడు నిద్రలు కాలేదు...
మూల కూర్చుని ఏడ్చేస్థితికి చేర్చావు...
వరకట్నం వద్దంటూనే...
ఐదంకెల నెలజీతం ఏమ్జేస్తున్నావ్..అంటావ్...
జవాబు వినని కసాయితనం నీది...
రక్తాశ్రువుల శరీరమే..నాదైంది...
ఎర్ర బడిన నా కనుల
పెల్లుబికిన ప్రళయాగ్నిలో పడి
మాడి మసవుతావు ఇక ..!!


నా మనోజ్ఞవి...
నండూరి వారి ఎంకివనుకున్నా...
బావాల తోటలో బద్రంగా ఉన్న నిన్ను..
రవివర్మ కుంచెజార్చిన రమణీయమనుకున్నా..
మరల్చనీయని చూపుల సొగసుచూసి..
కాదు..కాదని..తెలుసుకున్నా...నా...
హృదయాన్నిఊహల ఊయలలో ఓలలాడించిన మనోహరివి...
పిడికెడు గడ్డిమోపును మోయలేని పడుచందానివి...
భరతీయతను మూటగట్టుకొన్నఅమృత మూర్తివి..నా మనోజ్ఞవని....!!

8, ఫిబ్రవరి 2016, సోమవారం

ఒంటరినైనా.....
ఇంతై...అంతై..ఎంతో ఎదిగిన
వామన మూర్తే...నా ఆదర్శం...
మూడడుగుల నేలనడిగి...
ముల్లోకాలు ముట్టడించాడు...
భారత మాత బిడ్డని...
భయం తెలియని వీరుణ్ణి..
సూర్యుడి నుంచి తేజస్సును
వరంగా పొందాను...
సహనమైనా...సమరమైనా....
స్థైర్యం కోల్పోని యొధుణ్ణి..
చనుబాలతో పాటు
ఉగ్గు రంగరించి...ఉంగాలే కాదు...
ఉక్కు పిడికిళ్ల నిశ్చలత్వాన్ని
నేర్పిన అమ్మ ఆలింగనాలు
శిధిలాల నడుమ ఒంటరినైనా ....
ఆత్మబలాన్నిచ్చే...
ఆయువు గుళికలు..!!

6, ఫిబ్రవరి 2016, శనివారం

ఓహో పావురమా !!
శకుంతలనై..
మేఘ సందేశం పంపాను....
కంప్యుటర్ లో దూరి...
మెయిల్ రాయబారము చేసాను...
అలకల రధమెక్కిన చెలుని మనసులో...
ఉలుకు..పలుకూ..లేదు...
వెన్నెలను మూటగట్టుకొని...
కన్నుల శాంతి నింపుకొని....
ప్రేమ సందేశం మోసుకెళ్ళావు ....
ఓహో...పావురమా....!!
స్పందించిన వాని
ప్రణయ బావాలను తెలుపుతూ
నీవిచ్చిన బహుమతి...
నా ఎదలో...
శతకోటి ప్రణవ రాగాల వీణలే మ్రోగించెనే.....
ఆనందాల పూదోటలు పూయించెనే..
నా ముద్దు పావురమా...!!!!

5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అమ్మే గా.....

మండే సూర్యునీ...
వెన్నెల నిచ్చే జాబిలినీ
ఒకేరీతిగా ప్రేమిస్తూ..
.దారి చూపే..అమ్మేగా ఆకాశం..
జన్మనిచ్చి అమ్మా!!
నీవెళ్ళిపోయావు
ఏ గనన సీమలలోకో...
నాన్నని వెతుక్కుంటూ..
అనాధగా మిగిలున్నా..
అక్కున చేర్చుకొనేవారు లేక..
ఆర్తిగా అంబరాన్ని చూస్తున్నా...
అమ్మా! ఏదేవుడో కరుణించి...
రెక్కలదానం ఇస్తే ఎంతబాగుండు..
వినువీదులలో..ప్రతీ అంగుళమూ
నికై వెతుక్కుంటూ తిరిగుదును కదా..!!
వేదనతో విలపించే నన్ను...
వర్షపు చినుకులతో
ఓరారుస్తూ...ఊరడిస్తావే...
నిను చేరాలను కోరిక తీరనిదైనా...
నీవే ఆకాశమై..నాకు ఆలంబననిస్తున్నావే..
అమ్మా!..మరి నే అనాధని ఎలా అవుతాను...!!
ఆనందాణువునై ....
శ్వాస తరంగాలతో జీవం నింపుకుంటూ....
రక్తమాంసాల ఆకారన్నిచ్చుకుంటూ....
ఎదిగానమ్మా...ఉమ్మనీటిలో ఈదులాడుతూ...
మరణాన్ని సైతం లెక్కచేయక
జన్మ నిచ్చావమ్మా...!!
ఆడపిల్లనని అందరిలా అలుసు చేయక
అక్కున చేర్చుకుని పెంచావే...
నీ ఆశయాలకాయువుపట్టును నేనై...
విషపు చూపుల తూటాలకు ఎదురు నిలిచి
"ఆత్మాభిమానం " మా అమ్మగారిల్లని నిరూపిస్తానమ్మా !!
నీ కంటి చివర నిలిచినా నీటి చుక్కలో...
ఆనందాణువునై ....
స్నేహం...
నాక్కొంచం పెత్తవూ...నాబర్త్ డేకి నీకు చాక్లేట్ ఇత్తా..."
" ఇత్తవా...ఇద్గొ..తీక్కో...నాబర్త్ డేకి నీకూ ఇత్తా కేకు..."
ఇచ్చి పుచ్చుకొవటంలోని సౌశీల్యం....
అరమరికలు ఎరుగని స్నేహితం..ఎల్లలు లేని పసితనం...
వెలుగు రాగానే..చుక్కలు మాయమయినట్టు...
వయసు పెరగగానే...ఈర్ష్యా అసూయలు దరిచేరి
స్వార్ధ రక్కసి ని ఆహ్యానిస్తాయి...
మనిషిలోని " మని " మత్రమే మిగిలి మానవత్వం సమాదవుతుందెందుకొ?