15, మే 2016, ఆదివారం

'చాయ్ ...చాయ్..
'చాయ్ ...చాయ్..
ఇరానీ చాయ్....'
అనరచుకుంటూ..ప్రతి విధిలో ..
కనిపిస్తూ ఉంటారు..
ప్లాస్క్ పట్టుకొని..
మెడ కి పేపర్ గ్లాసుల
మాల తగిలించుకొని..
షాపుల వాళ్ళు ..
బండ్ల వాళ్ళ దగ్గరినుంచి..
బిచ్చగాళ్ళ వరకు...
అందరు...వాళ్ళకి గిరాకులే..
ఉదయం నుంచి...రాత్రి వరకు...
కాలం తెలియక
తిరుగుతూనే ఉంటారు...
కసిరేవారోకరైతే..చాయ్ పై ప్రీతి తో..
పిలిచేవారోకరు...
చెదరని చిరునవ్వు
వారి సంపద అయితే..వచ్చేది మాత్రం
గ్లాసుకు 20 పైసలు మాత్రమే..
అయినా...విసుగెరుగని
విక్రమార్కులు వీరు..
సూర్యుని కంటే...
ముందే..తయారు
చాయ్ గ్లాసుతో...

7, మే 2016, శనివారం

ఏమో...మరి...


వసంతమైతే వచ్చెను గానీ
మావి చిగురుల కోయిల కూయెనె లేదు
మల్లెలు కొల్లలుగా విరిసెను గానీ
పరిమళాల పలకరింపులు లేనే లేవు
వెన్నెల నుండుగా కురిసెను గానీ
చల్లదనపు చక్కిలిగింతలు లేవు
మావి చిగురు వగరుగాఉందనా...
కోయిల గొంతు మూగబోయింది
కలుషిత గాలులతో మిళితమై
మల్లెలు పలకరింపులు మరిచాయేమో...
వేడి నిట్టూర్పుల సెగలకి
వెన్నెల వెన్న అయి కరిగిపోతుందా...
ఇది అంతా ప్రకృతిలోని
మార్పేనా...?
" నేను " అనే అస్థిత్వాన్ని
కోల్పోయిన ' నేను '
అనుభూతించలేకపోతున్నానా....
ఏమో...మరి.....

2, మే 2016, సోమవారం

రెప్పల ముసుగేస్తూ....
మన్నింప లేని నీ మనసుకు...
మమతల హరితాన్ని దారపోసి..
మబ్బుతెరల మాటుకు సాగిపోయా..ప్రియా!
నీ గుండెకు గాయమవుతుందని తెలుసు...
కానీ అది నీవు గురించవనీ తెలుసు...
అందుకే...నీ తిరస్కారవిక్షణాలకు
జవాబు కాలేనితనాన్ని...
నాలోనే దాచుకొని...
మవునంగా మరలి పోయా...ప్రియా!!
శిశిరాన్ని ఆహ్వానించిన నీ తలపులకు...
మోడుగా మిగిలిన నీ జీవితాన్ని
బహుమతిగా ఇచ్చి....
ఒంటరి ప్రయాణంలో...
అలుపు మరిచి సాగిపోతున్న నిన్ను
నీకు కనిపించని కన్నులతో
చూస్తూనే ఉన్నా...
చిప్పిల్లిన రెప్పల ముసుగేస్తూ..ప్రియా...!!.