17, జూన్ 2019, సోమవారం

నిధినిక్షేపాలు
రంగునీళ్లు జల్లుకునే రాయబారాలే
పసితనపు పరవళ్లు
కల్మషమెరుగని స్నేహాల చిందులే
పాలనవ్వుల పలకరింతలు
నింగినేల ఒక్కటను సంబరాలే
అంబరాన్నంటిన ఆనందాలు
ఆటవస్తువులయిన అరిటాకులతో
వర్షపుచినుకుల కేరింతలే
బంధించిన బాల్యంలో
అపురూపంగా దాచుకున్న నిధినిక్షేపాలు !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి