27, ఆగస్టు 2016, శనివారం

మల్లియ...
ఈ చల్లని వేళలో
ఈ వెన్నెల హాయిలో
నా కోసమె విరిసెను 
ఈ తెల్లని మల్లియ....
తెలి మబ్బుల తేలి
ఓ మబ్బు తునక
వర్షించెను హిమబిందువై..
పరవశాన మనసు మైమరిచెను //ఈ//
ఏ పూలని దోచెనో
ఓ గాలి తెమ్మెర
మకరందాల సుగందాలతో
నను చెట్టేసెను గిలిగింతల అల్లరిగా...//ఈ//

సొమ్మసిల్లా..
మూసిన కనురెప్పల మాటున
పండువెన్నెల
నీదరహాస చంద్రికలనుండి
ప్రసరిస్తూ.....!!!

25, ఆగస్టు 2016, గురువారం

కదలి పోతున్న
క్షణాల పోగుల రాసులలో..
దాగిన జ్ఞాపకాల నిధివి నీవు..
చూపుల చీనాంబరానికి..
మాటల మాణిక్యాలనతికించి..
ఎదుటివారి హృదయానికి
అలంకరించేవు...
సమన్వయపు సహనము
నీ ఉపిరి..
అందుకే..
ప్రతి వారికీ అనిపిస్తుంది...
నీ సమక్షం..
ఎప్పుడు శాంతి కపోతాల నిలయమని..
అందుకే..
నీ తలపులపెనవేసుకున్న
నా ప్రాణాలు...
లోలోన నీతోనే జీవిస్తూ...
వేచిఉన్నాయి...
నిన్నుచేరే ఘడియకోసం..!
చరిత్రగా నిలిచి....
కష్టాల కడలిలో 
మునకలేస్తూ....
కావడి కొయ్యకు
చేరువౌతున్న వేళ
నీ కన్నుల నుండి
జారిపడిన అనురాగపు
తుషారం...
నన్ను కమ్మేసింది
ఆవేశపు అగ్నిలో....
ఈ... మంచు కౌగిలి
బిగి సడలనీయకు ప్రియా!
జన్మ జన్మలకూ
చేరువకావలనుకునే
స్నేహం మనది
మన ఈ ఙ్ఞాపకాల పుటలు
చరిత్రగా నిలిచి
ఆదర్శం కావాలి మరి...

15, ఆగస్టు 2016, సోమవారం

క్షణము..

నీకై నిలిచిన క్షణము
ఇది ఎన్నడు వాడదు నిజము
కలో...వెలిసి
ఇలలో నిలిచిన క్షణము..
ఆకుల దొన్నెలలో చేరిన
హిమవన్నగమే..
కరిగి బిందువై..
జారిన క్షణము...//నీకై//
విరిసిన పూవున
వాలిన తుమ్మెద
మధువును త్రాగుతు
తూలిన క్షణము.....//నీకై//
ఎండా వాన కలయికలోన
వెలుగు చీకటి
ఏకాంతంలో...
ఏడు రంగుల విల్లై
నేలను తాకిన క్షణము...//నీకై//
********రాధామనోహరం*********
మోహనుని కొసచూపుల కవ్వింతలు..
రాధ ఎదలోని ప్రేమామృతధారలను 'చిలుకు'తూ
ఉన్న రాసాస్వాదనల తెలియాడుచూ ..తాను మౌని అయింది..
మురళీధరుని గాన విన్యాసముల గాంచుచూ ..
మధువనిలోని పూ భాలల మధువులు 'ఒలుకు '
ప్రణయ వీవనల స్పర్శలో సర్వం మరచిన సరిజమయింది..
శిఖిపించసరాగాల విలాసములలో..తేలియాడు సఖి
మది గదిలోదాగిన బావాల పరంపరల ' పలుకు 'ల
తేనెల వానలలో తడిచి ముఖుళించిన అరవిందమైంది..
యముననీటి తరగలపై అలవోకగా నడయాడు పూలనావలో..
సఖుని సందిట బందీఅయిన చెలి ఎరుపెక్కిన చెక్కిళ్ళ ‘ కులుకు ‘
మదన తాపమున మాధవుని కదలనీయక విడివడని జాలమయింది..

7, ఆగస్టు 2016, ఆదివారం

 లక్ష్మివే ..
మహా లక్ష్మివే..
వరలక్ష్మివే...
సుతిమెత్తగా పతి పాదాలనొత్తుచూ..
పరవసించె..ముగ్ధమనోహరివే...//శ్రీ//
పాలసంద్రము అలలపై..తామరలొ జన్మించి
విష్ణుపత్నివై..మగని ఎదను ఏలేటీ కమలాక్షీ
వైకుంఠమే నీ నివాసమైనా..ముల్లోకాల గాచుచూ..
ఏకపత్యముగా పరిపాలించుచుంటివే..అష్టలక్ష్ములవై..
సౌభాగ్యప్రదాయనివై..సౌశీల్యమునిత్తువే..//శ్రి//
ఆచమనముతొనే ఐదొతనమునునిత్తువే...
అర్చనలతొ అనందము చెంది..
అష్టైశ్వర్యాలనూ ...ప్రసాదింతువే..
పుష్పాలంకరణలతో పూజింతుమే తల్లి
పసుపుకుంకుమల తాంబూలము వాయనములిచ్చి..//శ్రీ//


శబరి
పండుటాకునైతినీ...
పలుచనైతిని....
పదములకందని
బావమునై...
రామా...నీకై....
వేచియుంటినీ...!!
ఎన్నో జన్మల
పుణ్యఫలము
ఈ క్షణము
వగరో..పులుపో
రుచిచూసి.. చూసి...
మధురఫలములనే
అందించెదనూ..
కొండల కోనల
తిరిబి తిరిగి
అలసినావని రామా!!
సేదతీరుమీ
"శబరి" కుటీరమున
లక్ష్మణ సమేత!!
శ్రీరామచంద్రా!!