25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ప్రేమని పండించుకోవాలంటే....
ఒకరికొకరు తోడు అవసరం...

పొత్తిళ్ళ లో చేరిన బిడ్డకి
తల్లిపాలతో పాటు లాలింపు అవసరం..

గుండెలకు హద్డుకుంటూ మురిసిపోయే తల్లికి
ఆ బిడ్డ బోసి నవ్వుల మురిపాలు అవసరం..

ఎదుగుతున్న పిల్లలకు
పెద్దల ఆదరణ అవసరం...

పంచుకున్న పాలే కాదుసహోదరులకు .
పెంచుకునే ఆత్మీయతలూ అవసరం..

మనసు మనసుతో మాట్లాడే స్నేహానికి
అర్ధం చేసుకునే గుణం అవసరం...

24, ఏప్రిల్ 2014, గురువారం



చిట్టి పిచ్చుకా !!

చిటారు కొమ్మైనా
 చిటికలో ఎక్కేసే...
చిట్టి పిచ్చుకా...!!
చిత్రంలో దూరిపోయి...
మా కనుల దూరమైపోయావే....!!

వాతావరణ కాలుష్యం నిన్ను
 కబళించి వేసింది...
కాంక్రీటు కబందహస్తాల ఉరి..
నిన్ను ఉపిరాడకుండా చేసింది...!!

ఊరే ..నీ పేరుగా
 చేసుకున్నావే...
జొన్న కంకులబడి
 జోరుగా తింటున్నావే...!!

కిచ కిచల రావాలతో పలికేవు
 నీవు సుప్రభాతాలు ..
శ్రీవారి సన్నిధిలో వినిపించెనే...
అవి సుమధుర గీతాలై!!

18, ఏప్రిల్ 2014, శుక్రవారం

హిజ్రాలు



........................................
బృహన్నల జాతి వారసత్వం...
తరాల అంతరాలలో నలిగి...మిగిలారు ' హిజ్రాలు ' గా
అర్ధనారీశ్వరత్వం వారి శరీరతత్వం అయినపుడు...
వారిని మనం చూసే చూపులలో..ఈ తెడాలెందుకు .!!

ప్రకృతి వైపరిత్యాలలో...ప్రళయాలను సైతం అదిగమిస్తున్నాము
పిండాక్రుతిలో జరిగిన తేడాలలోని లోపమే ...వారి జననం అయినపుడు
పుట్టు గుడ్డి వాళ్లు...కుంటి వాళ్ళు...అని...సానుభూతి ఉంటుంది..
కాని..పుట్టుకతో ...తేడా అని...అవహేళన ...చూపటం న్యాయమా..!!

అమ్మా నాన్నలకే...పుట్టినా అనాధలు గా మిగులుతున్నారు...
అవనికి భారమయిన మనుషులలా....ఆకలి దప్పికల దాహార్తితో..
పురుడయినా..పుణ్య కార్య మయినా...వారి దీవెనలు కావాలంటారు..
వారికి మనుగడ లేకుండా చేస్తూ...మానవతను మరచిపోయి...!!

ఓటు హక్కు నందించి న్యాయస్తానం తన ఉన్నతిని చూపిందీనాడు..
ఇకనుంచి..ఏనాటికీ మనం వారిని మనలో వాళ్ళుగానే మసలుకుందాం
స్న్హేహ హస్తం అందిస్తూ..పరిపూర్ణమైన ఆత్మీయతను పంచుదాం..
అత్మన్యూనతాభావాన్ని అధికమింపజేసి వారి ఉన్నతికి తోడ్పడుదాం !!

9, ఏప్రిల్ 2014, బుధవారం

.
శ్రీ రాముడు...

పుత్రకామేష్టి యాగ ఫలం వలన..రఘుకుల తిలకుడు పునర్వసు నక్షత్రాన జన్మించి ..
ముగ్గురు తల్లుల ముద్దుల తనయుడే కాక ముగ్గురు తమ్ముల అన్నగా
దశరధుని ప్రియ పుత్రునిగా ..దినదిన ప్రవర్ధ మానమవుతూ...సూర్య తేజంతో..
 ఆజానుబాహుడైనాడు ..నీల మేఘ శ్యాముడు ...ఆ రఘరాముడు...

సురాసురులు ..యక్షకిన్నెర మహోరగులకు కదలని శివ ధనుసును
విశ్వామిత్రుని అజ్ఞానుసారం ఆ ధనుస్సును ఒక్కచేతితో పట్టుకొని
ఎక్కుపెట్టినంతనే..పిడుగులాటి శబ్దంతో ...విరిగిపడిపోయింది....
ప్రమోదమైన మనసుతో...నునుసిగ్గుల సీత తన అనురాగాల మాలనలంకరించింది . .

ఆరిఆరని తాటాకుల పందిళ్ళు ..చిగురులు తొడిగిన లేతాకుపచ్చని మామిడి తోరణాలతో
వసంతానికి గుర్తుగా విచ్చుకున్న మల్లెపూల మకరద్వజాలు ...సువాసనల విందు చేస్తూ
కస్తూరి తిలకం పెట్టి  ..మణిబాసికం నుదుటను గట్టిన రామయ్య పెళ్లి కొడుకైతే...
సౌందర్యాలన్నీపోగై పుత్తడి బొమ్మైనట్లున్న జానకి పారాణిపాదాల పెళ్లి కూతురైంది..

పుష్పవర్షం కురుస్తుండగా దేవదుందుబుల మ్రోతతో ప్రాంగణమంతా ప్రతిద్వనించగా ..
మాంగళ్యధారణ ..ముత్యాల తలంబ్రాలతో..వధూవరులు ..కన్నుల పండుగే నాడు ..
వాడ వాడలా...సీతా రాముల కళ్యాణ వేడుకలే ..ఈ నాడు...
వడపప్పు పానకాల ప్రసాదాలతో...వేడుకల సంబరాలు ..

తండ్రిఆనతికై పదునాలుగు సంవత్సరాలు కారడవులకేగి...దుష్ట రాక్షసుల సంహరిస్తూ
సీతాపహరణం చేసిన  రావణుని వధించి..తిరిగి నవమి నాడు పట్టాబిశక్తుడైనాడు రాముడు!!
చైత్ర సుద్ద నవమి..జగత్ కల్యాణానికి ..ధర్మరక్షణకై ..విష్ణు మూర్తే స్వయంగా ..
మానవుడిగా జన్మించి తనయుడిగా ..అన్నగా ..భర్తగా ..మహారాజుగా ..అన్ని పాత్రలకు
తగిన న్యాయం చూపిస్తూ...మనిషిగా జన్మ సార్ధకం చేసుకొన ఆదర్శంగా నిలిచాడు ..శ్రీ రాముడు !!

6, ఏప్రిల్ 2014, ఆదివారం

  • గీతికలు ..


  • ఒకేలా ఆలోచిస్తూ...ఒకే ప్రాణంలా మెలుగుతూ..
    ఒకటిగా సాగిపోతూ...నీకు నేను..నాకు నీవు అయిఉన్నాం

    కొండలయినా....కొనలయినా...
    వాగులు...వంకలు....నదులపై నిలిచిన బ్రిజ్ద్ లయినా..
    ఎప్పటికీ...... ఎదురెదురుగా.... ఉంటాం...

    కోపాలు..తాపాలు..మనమెరుగం..
    ద్వేషాలు...మోసాలు ..మనకి తెలియదు...
    బేదాలు లేని ...వాదనలకు దిగని...
    మన స్న్హేహమనే రైలు బండికి
    ఏ ఆపదా రానియక పదిలంగా కాపాడుకుంటూ..
    ఒకే మనసైనా...రెండు జివితలుగా ...
    ఎప్పటికీ ..ఎదురెదురుగా ఉంటాం.....!!

    సమాంతరంగా సాగుతూ కనిపించే ఈ రైలు పట్టాలు
    అంతం లేని స్న్హేహానికి ...అనురాగ గీతికలు లాగా నిలిచాయి!!