17, జూన్ 2019, సోమవారం

ఒక అమ్మే కదా ...!
"అ"తో మొదలయ్యేది...అనంతమైనది ..
అమృతతుల్యమయినది ...అక్షయమయినది ....
ఒక అమ్మే కదా ...!
బొమ్మలు చెయ్యటం వరకే పరిమితమైన
బ్రహ్మనుంచి వరంపొందినదేమో ..
తనలోని రక్తంతో ఆకృతినిచ్చి
శ్వాసలతో ప్రాణాన్ని పోసి ..
మరణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చేది
ఒక అమ్మే కదా....!
ప్రకృతిలోని ప్రతి ప్రాణి తనలోనుంచి
మరో జీవిపుట్టుకకు కారణమైన అమ్మతనం కూడా
ఒక అమ్మే కదా ...!
బిడ్డల ఆకలి దప్పికలు తీరుస్తూ ..
వారి ఉన్నతిని కోరుతూ ..
ఆహరహరము వారి శ్రేయస్సుకై
తన ఉనికిని మరచి తపించేది
ఒక అమ్మే కదా ...!
అవసాన దశలో పిల్లలు అలుసు చేస్తున్నా..
"తన ఆయువుని వారికిచ్చి నన్ను తీసుకుపో స్వామి "
అని కోరుకుంటూ ..చిప్పిల్లిన గాజుకళ్ళదీ
ఒక అమ్మే కదా...!
************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి