19, జులై 2016, మంగళవారం

పరమ పదం...
పరమ పదం..
పరమ పదం..
సాయి పాదాల
సేవనమే అది
సిద్దింపజేయును
పరమపదం..
ద్వారకామాయి
ద్వారాన జీవితం
దొరికినదీ ఇదీ
ఏజన్మ చేసుకున్న
పుణ్యఫలం....
నిత్య హారతుల
నిలయములే
సాయి మందిరములు
ఆ హారతిలో
మహిలోని
మమతానుబందాల
కోలాహలం..అయినా..
మనసంతా సాయీ...సాయీ...
సంస్మరణం...
ఆ..సాయినాధునికిదే...
ఆత్మార్పణం.....


శ్రీమన్నారాయణ....
చరణారవిందాల
ప్రణమిల్లనీ...
నీ చరణారవిందాల
ప్రణమిల్లనీ....
అగరు ..కర్పూర
అర్చనలతో...
నీ చరణారవిందాల
ప్రణమిల్లనీ....
పాలకడలి
అలల నురుగుల
తేలియాడు
శేషతల్పముపై
శ్రీలక్ష్మి నగవుల
సిరులనందుకుంటూ
చిధ్విలాసమున
క్రీగంట చూసే...
పరందామా...!!!
శ్రీమన్నారాయణ.....!!! //నీ//
కోయిలనడిగా..
స్వరాలనిమ్మని
నీ లీలామృతగానముతో
నిను అభిషేకించ
కొమ్మలనూ...రెమ్మలనూ..
తోటలోని ప్రతి తీగనూ..
వెతికి... వెతికి...
నీపూజకై
తెచ్చనెన్నో..సుమాలనూ...
ఎదనే నీకాసనముగాచేసి
ప్రాణప్రతిష్ట చేసినాను
ఆత్మనివేదన
అందుకొనుమా...
పరందామా...!!
శ్రీమన్నారాయణా...!!!

18, జులై 2016, సోమవారం



ఆడది అంటే లయం లయం..ఆ నీడంటేనే భయం భయం.
అరుదైన పద్యాలు!
1.
ఒకతెకు జగములు వణకున్;
అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్;
ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా;
పట్టపగలె చుక్కలు రాలున్
.
భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము.
2.
కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును?
.
భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది.
3.
పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం;
అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః
.
భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది.
4.
ఆడుదానిఁ చూడ నర్థంబుఁ జూడఁగా
బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు
బ్రహ్మయాలి త్రాఁడు బండిరేవునఁ ద్రెంప
విశ్వదాభీరామ వినురవేమ
.
భావము: స్త్రీని చూసినా, ధనాన్ని చూసినా సృష్టికర్త అయిన బ్రహ్మ కు కూడా రిమ్మ తిరిగే కోరిక పుడుతుంది. బ్రహ్మ భార్య అయిన సరస్వతి యొక్క తాళిబొట్టు బండి రేవు వద్ద త్రెంపాలి. అనగా స్త్రీకి, డబ్బుకి లోంగని వాడు లేడని వేమన భావం.
5.
ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ!
.
భావము: భర్త మాటకు అడ్డం వచ్చే గయ్యాళితో కాపురం చేయుటకంటే
అడవిలో జీవించడం మేలు అని కవి భావన.

17, జులై 2016, ఆదివారం

వానా...వానా...వల్లప్పా..
"వానా...వానా...వల్లప్పా..వాకిలి గిరుగు తిమ్మప్పా..."
ఆహా..! ఆ రోజుల్లో...అమాయకత్వపు అస్వాదనలు..
చిట పట చినుకుల్లో....చిందులు వేసే..అల్లరులు..
వళ్ళంతా తడుస్తూ ఉన్నా....ఎగ ఉపిరితో..కేరింతలు..
ఆరుబయట ..ఆమని అందాలతో పోటీ పడుతూ...
నీరెండ నిగనిగల సోయగాలతో కలగలిసిన చిరుజల్లులు..
అయిదేళ్ళ ప్రాయంలోకి వెళ్ళిన మనసును వెనక్కి పిలిచి...
"అమ్మలు.." ఏంటా తడవటాలు..చలి ,జ్వరం వస్తుంది...
లోనికొచ్చేయి...' అనే అజమాయిషిలు..
ఇంద్రదనుసు రంగుల్ని..ఏకం చేస్తూ...పసివాళ్ళ భాల్యాన్ని..
బంగారు పంజరంలో బందిస్తూ...
అతి జాగ్రత్తలు చెప్పే..అమ్మని కదూ..మరి..!

14, జులై 2016, గురువారం


గాలి...

సకల చరాచర సృష్టిలో...
జీవం ఉన్న ప్రతి ప్రాణి..
ఉపయోగించుకునే పదార్ధం గాలి...
చూద్దాం..అంటే కనిపించదు...
పట్టుకుందాం అంటే..దొరకదు...
అవధులు లేని అంతర్లీనమైనదే.....గాలి..
సందు దొరికితే చొచ్చుకొని పోతూ..
తనవంతు పని తాను చేసుకొనిపోతూ
బందింప నలవికాని నిరాకారే...గాలి..
ఆగ్రహం వస్తే...ప్రళయాలే సృష్టిస్తుంది..
అనుగ్రం అయితే...చల్లని పిల్ల తెమ్మెరై..
అణువు... అణువు ..సృసిస్తుంది....గాలి...
స్వచ్చతని మింగేస్తూ..కాలుష్యపు కోరలు...
విషం గ్రక్కుతుంటే..
జీవనస్రవంతి గతితప్పక మునుపే..
పర్యావరణం పరిరక్షించుకుంటూ..
అనంత ధాతువులు కలిగిన గాలిని ..
ప్రాణ ప్రదాతగా మార్చుకోవాలి..
పంచభూతాలలో..ప్రధమస్థానమైన వాయువును 
ఆయువుగా మలచుకోవాలి..!!.

11, జులై 2016, సోమవారం

ఆ చందమామ ...
అందాల కన్నా...
అపరంజి నాన్నా....
ఆడుకొని ఆడుకొని 
అలసినావని...
ఆ చందమామ..
పాలు బువ్వ
తచ్చి ఇచ్చేరా..
తోడుగ నీతో నేనుంటా
అంటూ..వెన్నెలంత
విరగబుస్తూ..
వచ్చి ..వచ్చి
మురిపించేరా..
ముద్దుల మామతో
ముచ్చట్లు చెపుతూ..
మారము మాని..
మామ్మ నని విసిగించక
మమ్ము తినరా బుజ్జితండ్రి..

10, జులై 2016, ఆదివారం

******జననీ*************
అర్ధరాత్రి ఆకాశంలోనికి ..ఎగ బాకింది..
"బోలో స్వతంత్ర భారత్ కీ జై.." అన్న నినాదం..
చీకటిని చిల్చు కుంటూ దూసుకెళ్ళే తారాజువ్వై...
జంబూద్వీపమై ..ప్రాచిన సంపదని కాపాడుతూ..
వేదాల సారాలను తనలో ఇముడించుకొని..
సంస్కృతీ సంప్రదాయాలదేవాలయమై నిలిచింది...
తూటాలతో వచ్చి తెల్లదొరలు దేశాన్ని ఆక్రమించి
అరాచకత్వాల ప్రజలను పీడిస్తుంటే.....తమను మరచి
సౌఖ్వం విడిచిన ఎందరో మహానుబావుల త్యాగ ఫలమిది ..
ఆకును సైతం కదలనీయని అహింసాయుతంతో..
సుష్కిస్తున్న శరీరాన్నికూడా లెక్కచేయని సత్యాగ్రహంతో..
గాంధీజీ మాట పై నిలిచి తెచ్చుకున్న స్వాతంత్రమిది..
అక్షరాల గింజలేసి..కార్యదీక్షతో పండిచుకొన్న
ప్రగతి పంటను...భావి భవితకు కానుక చేస్తూ..
పసి హృదయాలలో.. దేశభక్తిని నింపుదాం..
కన్నతల్లి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది..
జన్మభూమి నిచ్చిన భారతమాత..
ఉపిరి ఉన్నంత వరకూ ఊతమిచ్చి..
శ్వాస విడిచిన కాయాన్ని తనలో కలుపుకొంటుంది..
ఆ తల్లిని కాపాడుతూ....మాననీయతతో జీవిద్దాం..!
నీకూ... తెలుసు...
ఒంటరినని తేలిక చేసే... లోకానికేం తెలుసు
నీ తలపుల ఒరవడిలో... ఒదిగి నే సెదతీరుతున్నానని..
నాకోసమే...ఎగసి ఎగసి పడుతూ..
కదిలి వస్తున్న ఆ కెరటాలకి తెలుసు...
అంతులేని సంపదనే కాదు..
అగాధాలను సైతం తనలో దాచుకున్న సాగరుడికి తెలుసు..
అనంతమైన ఆకాశాన్ని ఇముడ్చుకొని
నురగై తేలుతున్న నీటికి తెలుసు..
తీరంలోకి కొట్టుకువచ్చి...
ఇసుకలో కూరుకుపోయిన ఈ ఆల్చిప్పలకి తెలుసు..
ఎదమధనంలో ఏమరపాటున కూడా నిను మరువదు మనసు
నీవిల లేకున్నా...సముద్రుడి సాక్షిగా ..అది..నీకూ.. తెలుసు...!
LikeShow more reactions
Comment
ఏకత్వం
శివ తత్వం, విష్ణు తత్వం ఏకమై...
ఏకత్వ స్తాణువై..పూజలందుకొను మాసం.. కార్తీకం..
విశేష ఫల ప్రదమైన ..పవిత్రమైన..
ఉపాసన కాలమయిన దక్షిణాయానంలో వచ్చే మాసం.. కార్తీకం..
నెల వంక అయిన చంద్రుడు ..కృత్తికా నక్షత్రంతో కూడిన రోజే.
నెలారంబమని..ఆ పేరుమీదే...నిలిచిన మాసం...కార్తీకం..
ఈశ్వర స్వరూపమే దీపం...ఆ ఈశ్వర దర్శన బాగ్యంకొరకే..
ఉదయం...సాయంసంద్యలలోనూ.. దీపం పెట్టుకొను మాసం ..కార్తీకం..
ప్రతి దేవాలయంలోను..అర్చనారాధనలతో ..ధ్వజస్తంబంపైన ..
ఆకాశదీపం వెలుగులు రువ్వుతూ కనిపించే మాసం..కార్తీకం..
ఆశ్వీయుజమాసంలో ..చంద్రుని వెన్నెలను త్రాగిన నదీజలాలు..
ఔషధీయిక్తమై ..నదీ స్నానానికి ప్రాశస్త్యమిచ్చే మాసం..కార్తీకం.
విష్ణు తల్పమైన ఆదిశేషుని ..శివుని .కంఠాభరణం..నాగుని ..
పూజిస్తూ....పాలుపోయు నాగుల చవితి వచ్చు మాసం.. కార్తీకం..
ఒకటిగా కలిసి...బెదాలను విడిచి ..వనబోజనార్దమై..
పరమాత్మ స్వరూపమైన చెట్ల నీడలకేగు మాసం.. కార్తీకం..
ఆలయాల్లో..యమద్వారమును తలపించు .. జ్వాలా తోరణం
శైవ..విష్ణు లోకాల దారిని చూపించు మాసం..కార్తీకం..
సగటు మనిషి....
మరపు ముసుగేసుకుని...
మొహంలో మర్యాద నవ్వుని
పులిమేసుకొని....
ఎద గదుల్లోకి తోసేసిన
ఙ్ఞాపకాల దొంతరలు
కుళ్ళి కంపు కొడుతున్నా...
" నేను " ను మరిచిపోయి
పరుగులు పెట్టే జీవితానికి
బందీ అయిపోయి...
సగటు మనిషి
ఓ విగట జీవి గా
జీవిస్తున్నాననుకుంటూ...
బ్రతుకు సమరంలో..
ప్రతీ క్షణం
పోరాడుతూనే ఉన్నాడు....

5, జులై 2016, మంగళవారం

రహదారి..!
ముళ్ళు...అడ్డంకులు లేని ...
అతి సులువుగా గమ్యం చేరవేయడానికి
అనువుగా ..గంభీరమైన వచ్చస్సు తో..
తోణికిసలాడుతూ కనిపించేదే రహదారి..!
ప్రయాణించే వాడు...రాజా...
నిరుపెద వాడా...అనే బేదాలు లేవు...
కులం...జాతి ..మత విభేదాలు తెలియవు..
ఎవరైనా ...ఒకటే...బాట...అదే రహదారి...!
కొండలని ...కోనలని చిల్చుకొని...
వాగులు..వంకలను దాటుకొని...
నదులపై...వంతెనగా మలచుకొని ...
ఒకటే..ధ్యేయంతో నిలబడి ఉండేదే..రహదారి..!

2, జులై 2016, శనివారం

చెలుని గురించి ఆలోచనలలో......
పల్లవి : రేయి నిదురోయినా...
చిరుగాలి సవ్వడులు మానిన
నా మనసుకు నిను తలచుటయె
ధ్యానము లే....ధ్యానములే....
చరణం : విరజాజి పూవులకేందుకో...
ఈ ఆరాటం ..
పందిరినిండా విరగ బూసి
మరుల సెగలు రేపుతున్నాయి.. . //రేయి//
చరణం : నీ కనులతో కలబడిన
నా కనులలో కలలు
నిజమైన పొదరింట
పండించే సిరి వెన్నెలలు ... //రేయి//
చరణం : పసిడి కాంతుల మిసిమి వన్నెలు
ఏ తుమ్మెద తాకని మకరందపుదొన్నెలు
అందిస్తా నీకే..తనివి తీరా..
అనురాగాపు లాలనల జోలలలో... //రేయి//
పూల వనం....
గుడిలో వెలిగే దీపం పవిత్రతని సంతరించుకుంటూ...
భగవంతుని తన వెలుగులో చూపిస్తూ....
ఆ స్వామి కృపని మనపై ప్రసరించేలా చేస్తుంది..
నిర్జీవమైన శరీరాన్ని..వదిలి వెళ్ళిన ఆత్మను
దైవత్వంలో కలుపుతూ..తలవద్ద వెలుగే దీపం..
మనసులలోని దుఃఖపు ఛాయలకు ప్రతిరూపమవుతుంది..
శుభఫలితాల ప్రయోజనం కోసం ..గ్రహాలను శాంతింపజేయ ..
ఆజ్యం వేస్తూ ..అగ్ని దేవుని పూజించే ప్రక్రియే..హోమం...
పంచభూతాలలో అగ్ని ప్రదమ స్థానంగా నిలిచి
ఏడడుగుల అనుభందానికి సాక్షిగా ఉంటూ...ఆశిస్సులనందిస్తుంది..
మంటలు... మంటలు...ప్రతి మనుజుడిలోను లోలోన చెలరేగే మంటలు..
ఆకలి మంటలు ..క్రోదపు మంటలు...స్వార్ధపు మంటలు..
చివరకు చితిలోను..చెలరేగే మంటలు...
ప్రకోపిస్తే..దాహించివేస్తాయి...సమస్తాన్ని....సర్వస్వాన్ని..
సహనంతో ..సమన్వయంతో..శాంతపరుచుకుంటే..
జీవితం అవుతుంది....మంటలు లేని వెన్నెల పూలవనం...!!