17, జూన్ 2019, సోమవారం

కదూ కృష్ణా ....
పెనవేసుకున్న మన అనుబంధాలను
చూస్తూ మురిపెంతో ముద్దులాడ వచ్చాయి
శ్వేత వర్ణంలో తళతళలాడుతూ రాజహంసలు
చూడు కృష్ణా !
పున్నమి వెన్నెలని త్రాగుతున్న యమున
తరగలపై నుండి మెల్లగ వీచే గాలి తెమ్మెరలు
అపురూపంగా అల్లుకుపోతూమనలను ..
అనురాగాలకు పునాదులవుతున్నాయి ...
చూడు కృష్ణా !
ప్రేమ తత్వానికి ప్రతీకలమై
స్నేహ సౌరభానికి అంటిన పుప్పొడులమై
నిత్యం సత్యమైన రాధా కృష్ణులమై
అమరమైనాము కదూ కృష్ణా !
************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి