24, డిసెంబర్ 2015, గురువారం

ఇంటింటా సంక్రాంతి ....

పైట చెంగు జారుతున్నా...
లెక్కచేయని కలికి తనం 
పరికిణి ఎగదోపిన జాణతనం
రంగరించి ..
విల్లులా వంచిన నడుముభారమవుతున్నా ....
వేళ్ళ సందులనుంచి ముగ్గు లతలు ..పూవులై ..
వాకిట్లో నిలుస్తుంటే ..
చూసే కనులకు సంక్రాంతి ... సంబరమే..

ధనుర్మాసపు చలి
లేత భానుని కిరణాల కాచుకుంటూ ..
మృదువుగా స్పర్సిస్తుంది ..
మావిడాకులపైనుండి ఊయలలూగుతూ...

గుమ్మడి పూలు సిగలో తురుముకొని
నవదాన్యాల నడుమ ..
పసుపు కుంకుమల పవిత్రతతో..
రేగిపండ్లు..చెరుకుముక్కల నైవేద్యాలతో..
ప్రతీ ముంగిలిలో ముత్తైదువులై నిలిచాయి గొబ్బెమ్మలు ... 
అన్నపూర్ణలని తలపిస్తూ...
ఇంటింటా సంక్రాంతి ఇదేనని తెలుపుతూ.....

.తల్లీ గంగమ్మ...!!



అమ్మలకే...అమ్మ!!...గంగమ్మ తల్లీ!!
మా పాపాల కడుకుటకు...భాగిరధుని కోరిక మన్నించి 
ఆకాశాన్ని తెంపుకుని దిగివంచినావమ్మా..!!
శివుని సిగపాయల బందించినాగాని...ఒక పాయ గా విడిపించుకొని...
ఉరికురికి వచ్చినావే....హిమగిరుల జారుతూ...

కొండల నడుమ..కులుకుతూ...కొనల పలకరిస్తూ..
పాడి...పంటలకు అయువునిస్తూ....
అరమరికలు ఎరుగక ..గులకరాళ్ళ పై..
గలగలల రాగాలతో...రమ్యంగా పాడుకుంటూ...
అలుపెరుగక నీవు సాగిపోతున్నవే..తల్లీ ...గంగమ్మ!!

విశ్వేస్వరుని అనునిత్యము అభిసేకిస్తూ...
అన్నపూర్ణమ్మ అంశని అందిపుచ్చుకొని...
కాలాలకతీతంగా...నీ నీట మునకేసిన చాలు 
సమస్త దోష నివారణ గావిస్తున్నావే...
పిత్రుదేవతలకి సైతం పుణ్య ఫలం అందిస్తున్నావే...తల్లీ..గంగమ్మ !!

భీష్ముడు నీ బిడ్డడేమో నాడు...కానీ...
భరతావనికే...మణిహరమైనావు నేడు...తల్లీ గంగమ్మ...!!
  • ఒక రాత్రి...


  • పూర్ణ చంద్రుని సైతం రాహువు కబలించక మానలేదు...
    అయినా...ఉన్న సంగంలో నుండే...వెన్నెల కురిపిస్తూ...
    యమునలో తన తళుకులను మెరిపిస్తున్నాడు....మన నెలరేడు...
    చీకటిని చిల్చాలనే....తారల తహతహలు....
    తలలూపే..తాటి చెట్ల తో చేరి...చేసే గాలుల అల్లరులు...
    నిశ్శబ్దపు శభ్దం బయాన్ని కలిగించినా....
    ఒడినందించే...ప్రకృతి ఎప్పుడూ...
    పలకరింపుల పరవశాన్నిస్తుంది...మరి...

  • పిల్ల గాలులను మోసు కెళుతూ మెల్లగా సాగే గోదారమ్మ
    ఒడిలో స్వేచ్చగా తిరిగే..చేపలని బందించాలనే...తాపత్రయం...జాలరులకు
    కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టె పసిడి తల్లి చల్లగా చూడాలనుకుంటూ...

    ఏరు దాటాలనే...పడవ ప్రయాణికుని ఆరాటం....
    గమ్యంలో జీవన సారాన్ని వెతుక్కునేందుకు....

    పుణికి పుచ్చుకున్న అమాయకత్వం...
    ఆటలే...తమ ద్యేయం అనుకునే పసితనం..
    నీటిలో మునకలేస్తూ....ఈదాలనే కుతుహులంతో...!



 జీవితం ...



వైకుంఠమా....కైలశమా...స్వర్గ లోకమా...
ఏ లోకం చేరాలని నీ అవాంతర ప్రయాణం....

వేదనలు చేరాయని రోదిస్తూ..నిరోదించటం మరిచావే...
కష్టాల కొలిమి కలకాలం ఉండదు కదా...!!
చల్లారి బూడిదై..మసవుతుంది తెలుసుకో....

అమ్మ తన ఆయువు ఫణంగా పెట్టి మరీ నిన్ను కన్నది...
నాన్న తన ప్రాణం పోసి నిను పెంచెనే...
తల్లి తండ్రులను శోకసముద్రంలోకి త్రోసి..
నీ ఆత్మను నీవే.. గాలిలోకెగరేయలనుకుంటూ ఉంటే...
లిప్త పాటు క్షణం...తెలిరిచిన రెప్పలు  మూసుకొని... 
హృదయంలోకి నిన్ను నీవు చూసుకొని మరీ నిర్ణయించుకో...
నీవు...నీ చుట్టూ..ప్రపంచంలో ప్రతీ కదలిక అవగతమవుతుంది...

జన్మ జన్మల పుణ్యఫలమే...మానవ జన్మ కదా..!!
మహాత్ములు కూడా...మనుషులే కదా !!
వారి ఆదర్శాన్ని జీవంగా మలచుకొంటె...మహిమాన్వితమయిన జీవితం ..నీదే ఇక...!!

!!నమోనమః!!



రాత్రి పగళ్ళ రాట్నం తిప్పుతూ...
ఏడు గుఱ్ఱాల రధమెక్కి
 నిరంతరం సాగిపోయే..భాస్కరా...!!నమోనమః!!

చీకటివెనుక ...వెలుగుకు...
ప్రాణంపోసే పరాత్పరుడవు...
నీ గమనాలని  ఉద్దేశింఛి  ..
.నడిచే.... జీవితాలు ..

ముల్లోకాలకు మూలాదారం నీవే.......
సకల చరాచర సృష్టి కి ఆదిత్యుడివి నీవే...

కాలాలకు కారణం నీ కదలికలే..
ఆరోగ్య ప్రదాయకాలు నీ తొలి కిరణాలే....
హారతులు....!!


చీకటిని చీల్చుకొని వెలిగే తోలి పొద్దు కిరణమే...
మా జీవితాల ఆకలి ఆక్రందనల తీర్చే ఆశాకిరణం..

ప్రతీరోజు బ్రతుకు బాటపై వేసే తొలిఅడుగు తడబడేదే...
మలిపొద్దువరకూ పొయ్యిమీద ఉడికే 
నూకలకై రూకలు సంపాదించగలనా అనే ఆరాటాలతో....

వెదురుతో వేదన పంచుకుంటూ...పిల్ల దారులగుండా పయనాలు 
సూర్యునితో సమంగా సాగించే జీవన యానాలు....
భగవంతునికి అర్పించే శ్రమదానాలే....ఎల్లవేళలా తామిచ్చే హారతులు....!!