26, ఫిబ్రవరి 2018, సోమవారం

భారతం...
పల్లవి..
జనని ఇది..
జన్మభూమి ఇది
బ్రతుకుకు అర్ధం తెలిపే..
కర్మభూమి ఇది..
ఇదే..భారత దేశం.
ఇదే..మన భారత దేశం..
చరణం1.
మంచు పర్వతాలే...
సువర్ణ కిరిటమైతే..
గల గల పారే నదులే...
మేలి ముసుగులా చీనాంబరాలు ...
పచ్చని పైరులు..పలరించు ప్రకృతి.
అమ్మ....ఆభరణాలు..
ఉప్పొంగుతున్న అలలతో...
రక్షణ కవచమయినాయి ...
మూడు వైపులా సముద్రాలు...
వెన్నెల మమతలు కురిపించే తల్లి..
మన భారత మాత...
అమ్మా ! వందనం..అమ్మా ! వందనం....//జనని ఇది..//
చరణం2.
అమ్మ ..మమ్మీ ...అమ్మి..
ఏదైనా ..పెదాలు కలిపే..పదమోకటే..
ప్రేమను పంచేది..ఆ మమతొకటే..
లేదు మతాల తేడాలు...
లేవు కులాల భేదాలు..
రానే రావు భాషా భావ తారతమ్యాలు..
కాష్మీరం నుండి..కన్యాకుమారి వరకూ
మనమంతా..ఒక్కటే ....
అన్నదమ్ములం...అక్కా చెల్లెళ్ళం...
భవితవ్యాన్ని పరిమళింపజేసేందుకు
అల్లుకున్న పూల మాలలం..
భారతీయులం...భారతీయులం..
వందే మాతరం..వందే మాతరం...//జనని ఇది..//
సంక్రాంతి సంబరాలు ...
హేమంతపు చలి కొరుకుడులు
లో లోనకి దూరి ..
చక్కిలి గింతలు పెడుతున్నా ...
తూరుపమ్మ ఎర్ర చీర సింగారించకుముందే ..
ఎగ దోసిన కుచ్చిళ్ళను ...
జారుతున్న పైటను లెక్క చేయక...
తమ వాకిలిలో ముత్యాల సరాల ముగ్గులు..
ఇంద్ర ధనుసును పోలే రంగవల్లికలు...
తీర్చి దిద్దలన్న తపనలతో..
విల్లై వంచిన నడుముతో ..
కొంటె గాలి ఊరకుండక...
మాటి మాటికి కురులను చెరిపేసే వంకన
చెక్కిళ్ళను ముద్దాడి పోతుంటే..
శంఖంలాంటి మెడను విదిలించి ..
నిదుర బారాన్ని వదిలించుకున్న కనులతో
ఉరిమి చూస్తూ...అంతలోనే ..
పెదవులపై నెలవంకను నిలుపుకుంటూ..
రెక్కల గుర్రం మీద వచ్చే రాకుమారుడు కాదు గాని..
రెక్కలున్న విమానం ఎక్కి వచ్చే
రాజశేకరుడు తన వాడే అన్న తపనల కలలను..
ఎదలోపల దాచుకుంటూ ..
సంక్రాంతి శోభను తమ ముంగిటిలో పట్టి బందించే..
ఆ పడుచుదనం అందాలను చూడ ..
ప్రకృతి సైతం స్తంభించిదేమో...
పందాలకై తయారయిన కోడి పుంజులు
ఇక ఒకటే గోల...కొక్కోరోక్కో అంటూ..
గుమ్మడి పూలను కొప్పున పెట్టుకుని
గొబ్బెమ్మలు పేరంటానికి వచ్చేసాయి..
నవదాన్యాల ఆభరణాలు ధరించి..
ఉత్తరాయణంలోనికి అడుగుపెడుతూ సూర్యుడు ..
తూరుపమ్మ ఎర్ర చీర విప్పే ప్రయత్నం చేస్తున్నాడు..
పల్లె సీమకు పట్టు కొమ్మ వలె సంక్రాంతి సంబరాలు ..
భోగిస్నానాలను చేసి ..అంబరాన్ని తాకుతూ ..
ఎగురుతున్నాయి గాలిపటాలై...ఆనందాల విందులతో...!!
**************
సీతమ్మవారి నుదుటన ఉన్న సింధూరం
రామయ్యకి ప్రీతి పాత్రమని ...
వళ్ళంతా సింధూరం పూసుకున్న హనుమా
నీవే ఆ రాముని ప్రేమని పొంది..
ఆయన ఆలింగనాల ఆయువువు అయినావా..హనుమా..
ఆకుతో పూజిస్తే అభయమిస్తావు...
అరటిపండు నివేదిస్తే...
ఆనందపడుతూ...ఆధరిస్తావు...
రామ నామంలొ వనం నీవు..
ఆ వనంలోని సుమాలన్నీ..
రామ భక్తి తత్వంలో లీనమై..
రామ స్మరణల పరిమళాలను గుభాళిస్తున్నాయి...
నిను కొలిచే భాగ్యానికి నోచుకున్న మేము
నీ పాదాల అడుగుల కైమోడ్చి...
సమర్పించెదము ఆత్మ సాక్షిగా వందనం...
జై హనుమాన్..జై హనుమాన్..జై హనుమాన్..!జై శ్రీ రాం..!!
మనిషింతలోనే....
ఆ గాలిని గిచ్చి ..
అల్లరి చూపుల ముడివేసి..
గుండెకు గాలమేసి లాగినాడే..
ప్రేమంటూ మత్తుజల్లి ..
మనసును మాయచేసి..
మాటల పట్టీ వేసినాడే..
దేవుని సాక్షిగా చెప్పి ..
మెడలో మూడుముళ్ళు వేసి..
తపనలతో తనువంతా దోచినాడే..
చిట్లిన పెదవులనేమార్చి...
బరువుగ వాలిన రెప్పలకింద చీకటి చేసి..
మొగమైనా చూపలేదే...
మనిషింతలోనే మారేనా....!!
మనసు తెర చాటు..
కనులు తెలిపే మాటలు ఎపుడూ
మౌనాలను తెరచాటుగా చేసుకుంటాయి..
నీడని మాయం చేసే సూర్య కిరణాల వలె 
అతివ అంతరంగం లోనికి చొచ్చుకొనిపోయి ..
ఆ తలపుల తపనలకు తన వలపు పూ రేకుల
పుప్పొడిని అద్ది మనసంతా ఆక్రమిస్తే..
ఆ మాధవునిగా నిను భావించి ...
రాధగా తాను మారి ఆత్మార్పణగావించదా..
మౌనాల తెరచాటున దాచుకున్న
మాటల మల్లెలతో నీకభిషేకము చేసి...!!
నా జాబిల్లి ..
ఓ మల్లి ..
నీపై మనసుపడి.
తెచ్చానే తోటకు వెళ్లి ..
బొండు మల్లి ..
గువ్వల జంటల కువకువలా..
మన రెండు గుండెలు ..
ఒకే మాట చెపుతాయి..
వాలిన రెప్పల సందుల్లో
దాగిన ఆ మాటే...
నువ్వంటే నాకిష్టమని...
నువ్వంటే నా కిష్టమని...
ఓ మల్లి...
నిండు పున్నమి జాబిల్లి..
ముక్కున మెరిసే ముక్కెర తోటి..
పెదవిపై మొలిచిన చంద్రవంక పోటీ..
ఎరుపెక్కిన బుగ్గలతోటి ..
నుదుటను నిలిచిన సింధూరం పోటీ ..
నాదే అను ఈ అందంతోటి ...
నీదైన ఈ మగసిరి పోటీ..
ఓ మల్లి ..నా జాబిల్లి..!!
శ్రావణ మేఘాలలో నుంచి తొంగి తొంగి చూస్తూ..
నీలోని మమతల వెన్నెలని దొంగలించుకొచ్చిన
ఆ చందమామ ..
శరత్ చంద్రుడై పున్నమిలో మింటిని ఏలుతూ ఉంటే..
నదీనదాలు ఆబగా ఆ వెన్నెలను తాగేస్తున్నాయి..
ఔషధీయిక్తమైన ఆ నీటి అలలస్పర్శలు ...
ప్రకృతిలోని ప్రతి జీవికి ఆసరాగా మారి ..
అమ్మలా అమృతం పంచుతున్నాయి...
(నేను ఇస్తున్నా Uma Devi Kalvakota.....ఉమా రెడీ...)
ఒక్క అడుగు ..
అది తప్పటడుగు అయినా...
వెయ్యాలి ' అంటూ అమ్మ ఇచ్చిన దైర్యం ..
నా వెన్నంటే ఉంటూ..
అడుగుకు అడుగు కలిపి
ముందుకు తీసుకెళుతుంది..
బ్రతుకు బాటలో వెనక్కి తిరిగి
చూసుకునే అవసరం రాకుండా...!
( ఈ రోజు నేను ఇదే స్పూర్తితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశిస్సులు అందిస్తూ...చాలెంజ్ని వేంకటరమణ వెలపర్తి కి ఇస్తున్నా...రమణ బీ రడి,,,)
LikeShow More Reactions
Comment
మనిషి మేధస్సును పదును పెడుతూ..
ఎత్తుకు పై ఎత్తు వేయిస్తూ..
రాజుకు చెక్ పెట్టే ఆట చదరంగం ..
ప్రతి మనిషిలోను ఓ చదరంగం దాగి ఉందేమో..
మనసుకు ..ఆత్మకి ఎప్పుడు పోటినే..
పరిగెత్తే మనసు...అడ్డుకునే ఆత్మ..
ఈ రెంటి సమన్వయ సంవిధానంలో
చాకచక్యంగా వ్యవహరిస్తూ ..
జీవితవనంలో ఏడు రంగుల పూవులు పూయించుకోవాలి..!!
కన్నుల్లో నిలవవు ..
కలలలోకి రావు ...
పట్టుకుందాం అనుకుంటే..
కాలంతో పాటే పరిగెడుతూ పోతావు..
నీ ఆలోచనల మంచు కమ్మేసి
మసకబారిన మనసుతో ..
నీవు ఎక్కడ వదిలి వెళ్ళావో ...
అక్కడే నిలిచి ఉన్నా...
స్తంబించిన గుండెని కెలుకుతూ...
నాన్న వేలు
వేలికొసలతో వేల వేల
అనుభవాల సారాన్ని తెలియజేస్తూ ..
‘నీకు నేను ఉన్నా ‘
అన్న బరోసాని ఇస్తున్న నాన్నా..
ఇంతైనా...ఎంతైనా...
అంతైనా...నీ వేలు పట్టుకుని ..
నీ బాటలో నడవడమే నాకు ఇష్టం నాన్నా..
అల్లరి చెయ్యాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ...
కోపంతో నీవు వేలు చూపిస్తూ..
ఉరిమి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ...
నా బోసినవ్వులతో నీవు మురిసావేమో..
నీ బోసినవ్వుల వెన్నెల్లో నే సేద తీరుతున్నా నాన్నా..
స్వర్గం ఎక్కడో లేదు ..
నాన్నని అనుభవిస్తున్న ప్రతికొడుకు దగ్గర ఉంటుంది కదూ నాన్నా..!!
LikeShow More Reactions
Comment
నిన్నే
గుండె గది గోడల నిండా
నీ చిత్రపటాలే ..
కనులకు కనిపించని నిన్ను ..
చీకటి చేసుకున్న కళ్ళనుంచి ..
తనివి తీరా చూసుకుంటున్నా...
తడి అవుతున్న మనసు పొత్తిళ్ళలో దాచుకుని ..
నిజంలో నీ స్పర్శ లేదని తెలుసు..
అందుకే విశ్వంలోని ప్రతి అణువులో దూరి..
నిన్ను స్పృశిస్తూ .. అనుభూతిస్తూ...ఉన్నా..!!
LikeShow More Reactions
చూపుల పూరెక్కలపై
అనురాగ గంధాలను అద్ది
ప్రెమాక్షరాల పోగులతో
వలపు సంతకాల సంకేతాలను ..
ఎదలోని చెలునికి ..
చేరవేయుమని నీతో
పంపినాను కదా రాయంచ ..
జవాబు తేవడం మరచినావా..
జాబురాయని సఖునిపై కినుకతో
మనసు కలత పడుతున్నది..
ఆ పూర్వ లోకాల
కలల కౌగిళ్ళ అల్లరి
విరహించే తనువుపై స్వారీ చేస్తున్నది ..
ఈ శ్వాసల బరువులతో నిలువలేని
మది తెలుపు భావనలనాలకించవే...
వెన్నెల ముద్దను పోలిన నాకనుంగు కలహంస..!!.
ఎంత కరుణయా నీకు నాపై..
హిమ శిఖరమల్లే నీవుండి..
గంగమ్మనే నా కన్నులకిచ్చినావే..
ఎంత కరుణయా నీకు నాపై..
ఆత్మలో నిలిచి ప్రతిక్షణం
ఆవేదనల అభిషేకాలు చేయించుకుంటున్నావే...
ఎంత కరుణయా నీకు నాపై..
నీ నామంతో గుచ్చబడిన
నా శ్వాసల హారంతో అలంకరించుకుంటున్నావే..
ఎంత కరుణయా నీకు నాపై..
కనిపించే దారులన్నీ మూసేసి
ముల్లోకాలకధిపతిని నేనే అంటూ మదిని తిష్టవేసినావే..
ఎంత కరుణయా నీకు నాపై..
అమ్మలగన్నఅమ్మకు పతి అయిన శంకరా
సతికి అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరా..
శివోహం.....శివోహం ..ఓంనమశ్శివాయః ...
నీలమేఘస్వాముని
నీలాల కన్నుల్లో నిలిపుకొని
మగని వలపులతో మురిసి
వికసించిన పద్మంలాంటి మోముపై
నెలవంక చిరునగవయినా...
పున్నమి వెన్నెల కురిపిస్తూ..
ఆ రాముని పతిగా పొందిన సీతమ్మ ...
స్వయంవరాన శివుని విల్లు విరిచినది
చూపరులకయితే...
అంతఃపురం నుండి
జానకి వేసిన చూపుల బాణానికి
తన మనసును తగిలించి ఇచ్చిన వైనం రామునిది..
ఆలుమగల అన్యోన్యతకు ఆదర్శమూర్తులై
జగత్తును రక్షించే ఆ అది దంపతుల అండ
మనకందరకు ఎల్లప్పుడూ ఉండగా ...
దిగులు లేక ఆ రామ నామం స్మరించుకుంటూ
మానసిక శాంతిని పొందుతూ ఉందాము..
శ్రీ రామ... శ్రీ రామ... శ్రీ రామ..!!
ఈ వెన్నెలకి
వన్నె వన్నెల వలపులన్నీ విరుపులై
ఎదగాయాలకు కారణమవుతున్నాయి...
కురులలో ఒదిగి ముద్దులాడుతున్న విరులన్నీ
గుస్ గుసల గోల చేస్తున్నాయి..
స్వప్న లోకాల కలలజలకాలాడు కనులు
విభుని చూపులకై తపిస్తున్నాయి ..
పరువపు పొంగులను దాయను సాయం చేయలేని పైట
చిరుగాలికే రెపరెపలాడుతుంది ...
వేగంగా కొట్టుకుంటున్న గుండెని సమాదానపరచలేక తనువు ..
చేరువగా లేని చెలునికై విరహిస్తుంది ..
మబ్బుల్లో నుంచి కొంటె చందమామ తొంగి తొంగి చూస్తూ...
ఈ అందాలన్నీ ఆబగా తాగేస్తున్నాడు..
అందుకే పున్నమి చంద్రుని నుంచి జాలువారుతూ ..
పుడమంతా పరుచుకున్న ఈ వెన్నెలకి ఇన్ని సొగసులు కామోసు..!!


కన్నీటి చుక్క ...
సుడులు తిరిగిన భాధ 
హృదయాన్ని మధించేస్తూ ఉంటె...
ఒర్చలేని తాపాల ఆవిరి
కన్నీటి చుక్కై...
కంటి చివర చేరి...
వీడిపోలేక వేదన చెందుతుంది....
ఆ చుక్కకున్న మనసు 
కూడా నీకు లేదు నేస్తం...!!
ఒక్క మాట కూడా
చెప్పకుండా...వెళ్ళిపోయావు...
నిర్దయకి మారు రూపం నీవు...
శ్వాసని గాలికొదిలేసి....
నిర్జీవంగా నేనున్నాను...!!
అయోమయస్థితిలో...
కన్ను...
గాజుగోళమే అయింది...!!
బావా..నాయుడు బావా..
నిగ్గులన్ని మూట గట్టి
పరువంతో జతచేసి ..
రెప్పలకింద దాచినానురా..
కంటి రెప్పలకింద దాచినానురా..
బావా..ఓ నాయుడు బావ..
నీవట్టా...కొరకొరా చూడమాకు రా...
బావా..ఓ నాయుడు బావా..!!
కర్రా బిళ్ళా ఆడుతూ ఉంటే..
ఇరిగిన మందారం కొమ్మ చూసి
నే నేడుస్తూ ఉంటే..
ఊరడించ ఆ కొమ్మను
మా ఇంటి ముందు నాటినావే
అప్పుడు..నీకు పదేళ్ళు ఉన్నప్పుడు..
చూడు.. ఇరగబూసే మందారం ఇప్పుడు..
కోసుకొని కొప్పులోన ముడుచుకొంటిరా బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా...
బావా ..నాయుడు బావా..!!
సంతలోన రంగు రంగుల మట్టి గాజులు ..
పట్నం ఎల్లి పట్టుచీర ..కాసులపేరు ..
అట్టు కొచ్చి మా అయ్యను అడుగుతావనుకొంటి ..
“నీ పిల్లను మనువాడుతానని ..”
ముక్కుకు ముక్కెర పెట్టుకొంటి..
నీకిష్టమని చెవులకు జూకాలు తగిలించుకొంటి..బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా ..
బావా ..నాయుడు బావా...!!
నిజం...నిజం..
నీ తలపుల
కలవరింతల కవుగిలింతలచెరలో...
నే బందీనయ్యానే...
మూత పడని కనులకు నేనొక
ప్రశ్నగా మిగిలానే....
చెలీ ..
.నీ నీడలో దాగిననను
ఒక్కసారి చూపులు సారించి చూడు....
నీ.. నిలువెల్లా...నేనవుతా... నీతోడు....
ప్రణయ కలహమిది ...
పోనీలెమ్మనుకున్నా....
ఎదను తన్నినా ...
సత్య కొంగు విడువనికృష్ణయ్య...
మా గురువన్నా....
చెలీ ...
ఒక్కసారి నువు నా
చెంతకు చేరితే...చాలు...
మన వలపు ప్రమిదెలొ వెలిగే దీపం..
ఆరనివ్వ నెన్నటికీ ... ఇది ..నిజం..నిజం..!!.

నీ వేలి కోసలలో నాట్యమాడుతూ
రంగులలో మునకలేసే కుంచె
చివరలతో నాకు మెరుగులు దిద్దుతూ
నీవర్పించిన ఆరాధనాంజలులు ..
నన్ను జీవితురాలిని చేసాయి ..
చిత్రపటంలో నిలువలేని నేను ..
నీకే అర్ధం అయిన ఈ సొగసు
పూ మాలికలతో నిన్ను
అభిషేకించాలనీ...
ఆర్తితో తలపుల తలంబ్రాలు పోస్తూ..
నీకై మిగలాలని....
సంగతులకు తెలియని చీర
కుచ్చిళ్ళ బరువును మోస్తూ..
అడుగు బయటకు వేస్తున్నా...
చెలికానివి నీవేనని నమ్ముతూ...!!
LikeShow More Reactions