9, మార్చి 2017, గురువారం

మామ !!
ఏమరతోఏటికేలితే....
ఎదురొచ్చి మామ
బుగ్గ మీద చిటికేసే..
ఎరుపెక్కిన బుగ్గతో
మూతి బిగువు జతచేస్తే..
పకా పకా నవ్విండు మామ
ఆ నవ్వుల పువ్వులన్ని
ఏరుకొని మాల కడుతుంటే..
మాయమై..పొయిండు మామ
రెప్పలార్పు కళ్ళేమో
కొలనులే అయ్యాయి...
దిక్కులన్ని దుగులుగా
చూస్తున్నాయి...
అలల మీద చేపలన్నీ
అటు ఇటు పరిగెడుతూ...
చిలిపి చూపుల
గాలమే ఏస్తుంటే..
ఎకసెక్కాలకు
కాలమిది కాదని...
కాళ్ళతో తపా తపా కొట్టాను..
నీళ్ళన్నీ ఎగిరి పడి
ఒళ్లంతా తడిపేసే..
ఒరుసుకొని గుడ్డలన్నీ
అందాలన్నీ ...ఆరబోసే..
బంతిపూవు తీసుకొని..మామ ...
బేగి బేగి నొచ్చేసి...
జడన తురిమి మామ...
ముద్దిచ్చి ముచ్చట చేసే...మామా...!!

7, మార్చి 2017, మంగళవారం

ఒక వేలు ఎత్తి ఎదుటివారిని చూపిస్తే...
మిగిలిన నాలుగు వేళ్ళు.....
నిన్ను చూసి నవ్వుతాయి...అన్న 
సత్యం తెలుసుకొని ..మసలుకుంటే..
జీవిస్తాము మనసున్న మనుషులలాగా..!
నమస్కరిస్తే...నారాయణుడు..
అర్దిస్తే...అల్లా..
ప్రార్ధిస్తే...ప్రభువు...
మతానికి ఒక పేరు..కులానికి ఒక పేరు..
సర్వం తానైనవాడు పరమాత్మ ...
కనులకు కనిపించక పోయినా..
ఆపదలో ఆత్మ నివేదన చేసుకుంటే...
అండగా తానుండి కాపాడుతాడు...!
పుట్టుకకు లేదు ...మరణానికి లేదు..
రక్తానికి లేదు..శరీరతత్వానికి లేదు..
కుల మత ..బేధం..
జీవించటానికి ఎందుకు ఆ తారతమ్యం..
సమానత్వం సమస్యలకి పరిష్కార మార్గమైనపుడు..
ఆ మార్గం పైనే పయనిస్తూ...గమనం సుగమము చేసుకో...
సమసమాజ నిర్మాణానికి నీవు ఓ పునాది రాయివి అయి..!!
#సుజాత_తిమ్మన
☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆☆

3, మార్చి 2017, శుక్రవారం

బుద్దుడై.....
ఆశ నిరాశలు...సుఖ దుఃఖాల జీవిత ఫలమేమి..అని హరహారము...
ఆలోచనల మధింపు లో...అన్యమనస్కుడై సంచరించే సిద్దార్దునకు....
ఎదురొచ్చిన శవ ఊరేగింపు సమాదానం కాగా....మనసు చలించి..
రాజ్యదికారాలను....అనుభందాలను ..వదులుకొని....సన్యసించే....
భోధి వృక్షము నీడ...నిచ్చి ...జ్ఞాన సంపాదనకు మార్గము బోదించే..
దశావతారాలలో తొమ్మిదవ అవతారమై...భాసిల్లినాడు
అహింస..సత్యము....ధర్మము ....వట్టి మాటలు కావని..
మాననీయ విలువలను కాపాడుకొనుటకు రహదారులని..
ప్రతి మనిషి....వాటికి కట్టుబడి ...మెలగాలని...అడుగడునునా ..
ఆత్మ దర్శనం చేయిస్తూ....బుద్దుడై...విశ్వ శాంతికి కారకుడైయ్యాడు!!