16, అక్టోబర్ 2011, ఆదివారం

శిలనైన నేను

శిలనైన నేను
నీకోసం ......
శిల్పంగా మారాలనుకున్నాను
చిరకాలం నిలవాలనుకున్నాను

నీ ఉహల ఉలితో
నీవు కోరిన విదంగా
మరలాలనుకున్నాను
నీ ....పదునైన ఉలి కొసలు
నా... అణువణువునా
గాయాన్ని కలిగించాయి
గాయాలతో....నేను
రక్త సిక్తమై
రూపం లేని బొమ్మ అయినాను......

వెన్నెల రేయి

వెన్నెల రేయైనా
నీవు చెంతగా
లేని క్షనమిది
నాకెంతో భారము సుమా....!

కన్నుల నీరిడి
కలయ చూచితిని
చూపుల కందక
చుక్కల చేరి
వెక్కిరిస్తూ వేదన
నింపే వెండుకని //వెన్నెల //

మరలిపోని జ్ఞాపకాల
అలల తరంగాలలో
తడిచి నే తపిసున్ననీ
ఉపిరి స్పర్స కై //వెన్నెల //

వినిపించని నీ
అడుగుల సవ్వడి కోసం
మనసున ఆస ను
చంపలేక ......
అనుభందల తాకిడిలో
జివించను రా
చితిగా నైన మిగిలిపోయి
నిను చేరుకోనా ......... //వెన్నెల //


"సుజాత"

14, అక్టోబర్ 2011, శుక్రవారం

మరు భూమి

మరుభూమి లాంటి
హృదయంలో....
మంచు బిందువు వలె
నిలిచావు

మరపు కు తాళం వేసి
మమతల అనుభందం
పెనవేసికొని ....
మిగిలవు వరమిచ్చిన
దేవతవై......

వెచ్చని వేదనల సెగలతో
వేసారిన మనసునకు
పచ్చని పచ్చిక పైరగాలివి నీ వై
పరవసింప జేసావు

మరుభూమి లాంటి
హృదయంలో......
మంచు బిందువు వలె
నిలిచావు.......

కవిత

కవుల కులంలో
పుట్టాను
కాగితాల పై
పెరిగాను

కలములతో
సహవాసం
కానేకాను
ఎన్నటికి నేను
నిర్జీవం

ఎవరినండి నేను.....?
నేనే నండి .....
"కవిత" ను

"సుజాత "

నీ ప్రేమ

నీ ప్రేమ లాలన లోనా ....
నే కరిగి పోవాలి
నీ కన్నుల నిడ లలోన ...
నే కరిగి ఉండాలి....

మేగాలెన్నో ముసిరినా....
రవి ఉదయించక మానునా
హోరున గాలులెన్నో విచినా....
మెరిసే తారలే రాలునా
లోకమంతా ఒకటై
మన మనకేరై నిలిచినా....
వీడి పోదు మన బందం.....
వీడి పోదు మన బందం..... // నీ//

యుగాలెన్నో గడచినా....
జన్మలెన్నోముగిసినా ....
తరాల అంతరాలు
ఎన్ని మారినా.....
నిన్నువిడదు
నా హృదయం
నిన్ను విడదు
నా హృదయం..... // నీ //


సుజాత