17, జూన్ 2019, సోమవారం

"ఎదురు చూపుల యశోద "
కురుక్షేత్ర యుద్ధంలో
గీతను బోధించిన కృషుడైనా
వెన్నమెక్కిన మూతిని
తల్లి చీరకొంగుకు తుడిచినవాడే
బలరామన్న
మన్ను తింటున్నాడని నిజం చెపుతున్నా
బుజ్జినోటిలో విశ్వాన్ని చూపి
అబద్దంతో గెలిచినవాడే
కురుక్షేత్రంలో
గీతను బోధించిన ఆ కృష్ణునికై
ఎదురుచూపుల వేదనలో
చిక్కి యశోద వెన్నచిలుకుతుంది !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి