12, డిసెంబర్ 2014, శుక్రవారం

    సాహితీ సేవ చిత్ర కవిత -5 ఫలితాలు
    ద్వితీయ ఉత్తమ కవిత :
    ...
    గోడ గడియారం -శ్రీమతి సుజాత తిమ్మన గారు
    శీమతి సుజాత గారికి అభినందనలు
    Sujatha Thimmana
    గోడ గడియారం.....
    టింగ్ టింగ్ మని గోడ గడియారం గంటలు కొట్టినప్పుడల్లా...
    లబ్ లబ్ మనే గుండె ..వెనక్కి తిరుగుతుందేమో అనిపిస్తుంది..
    తాతగారి ఇంటిలోని వారి తాతగారి కాలంనాటి గోడ గడియారం..
    ఊహ తెలిసినప్పటి నుంచి...దానితో పెనవేసుకున్న అనుబంధం...
    సెకను ముల్లు టిక్ టిక్ మంటూ...నిమిషాల్లోకి కలిసిపోతూ ఉంటే..
    నిముషాల ముల్లు గంటల్లోకి...గంట కాగానే...ఊగుతున్న పెండ్యూలం
    ఊరంతా వినిపించేలా గంట కొడుతూ ఉంటే... నాకు కాలం తెలియని వైనం..
    కొంగు చాటులో దాక్కుని..గుప్పిట అమ్మ మెడలోని తాళి ఒడిసిపట్టుకొని..
    గుమ్ముగా అమ్మ పాలతో బొజ్జ నింపుకుంటున్నా...
    గంటల మోతకి ఉలికి పడి .. గడియారం కేసి చూస్తూ..అమ్మని విడిచేసిన వైనం.
    వీధరుగు మీద గచ్చకాయలాడుకుంటున్నా...వాకిట్లో తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా..
    వేపచెట్టు కింద తాడాటలాడుతున్నా...నిశిరాతిరి నిద్రపోతూ ఉన్నా..
    గడియారం ముల్లుకు అతుక్కున్న మనసు.. గంట కొట్టగానే చేరుకునే వైనం..
    కాలాన్ని కొలిచే గడియారం..కాలగతిలో .. అమ్మానాన్నలని ఆక్సిడెంట్లో
    అకారణంగా తీసుకెళ్ళినపుడు.. ఏమి తెలియని పసితనంలో కుడా ..
    ఒంటరిని చేయక ..క్షణం విడువని నేస్తం.. అనాధని చెయ్యనివ్వని వైనం..
    చదువులకని పట్నం వచ్చినా... ఆత్మనొదిలేసిపోతున్న భావన...
    సెలవులు రాగానే...ఇంట్లో అడుగుపెడుతూనే గడియారంకేసి చూస్తూ ఉంటే...
    గుబురుమీసాల తాతయ్య ...గుంభనంగా నవ్వుతూ...’నాకంటే..నీకు
    ఆ గడియారమే..ఎక్కువరా బుజ్జి...!’ అని సున్నితంగా తలపై మొట్టిన వైనం..
    పెళ్లి చూపులని తెలిసి....అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటె...
    నిశ్శబ్ద తరంగాలు ఎదను మీటుతూ ఉన్నా...
    ఊహల రెక్కలను గడియారం ముల్లులో బందించేసిన వైనం..
    ఊపిరి పోసుకున్నప్పటినుండి..నాతొ పాటే ఉంటూ..
    నా ఎదుగుదలకి నిలువెత్తు సాక్ష్యం.. అయిన బాల్యంలోని నేస్తం..
    అప్పగింతలతో..'.ఆడపిల్లని ' 'ఈడ పిల్ల ' నయినా..పుట్టింటి భరణంగా వచ్చి
    ఈ నాటికి..నా జీవిత గమనంలో..తాను ఓ పాత్ర గా..నా ఆత్మ అయిన వైనం..!
    See More
    Like · ·
    అ"
    అనాధని అని..
    అందరూ అంటారు..కాని..
    అమ్మ కాని అమ్మ......
    అక్షర అమ్మ నాకు తోడైంది..
    అక్కరకు రాని చుట్టాలు నాకెందుకు..
    అలరంచే పదాలను ..
    అల్లికల దారంతో బందిస్తూ..
    అలరంచే కవితలను
    అలవోకగా వ్రాసేస్తూ..
    అంకితమిస్తా.".అమ్మకి.."
    అనురాగలతలను పెనవేసుకుంటూ..
    అర్పణలోనే జీవితం సాగిస్తా..!
    మీవే..మీవే..అని..!
    సాయంసంధ్యను వీడుతూ .....
    ముసురుకుంటున్న చీకట్లకు
    వెన్నెల పంచాలనే ఉబలాటంతో
    ఉదయిస్తున్న పున్నమి జాబిలితో..
    పోటీపడుతూ..ఎదురునిలిచిన నా చెలి..
    అందాలను బందించిన అనుబందంతో..
    నునుసిగ్గులలో పూసిన ఎర్రని రోజాలు..
    ప్రీతిగా గొనుమని తెలిపే..అల్లరి చూపులు..
    అందించిన చేతిలోని స్పందనలు .
    .చెప్పకనే చెపుతున్నాయి...
    జడలో తురిమిన మల్లెలంత స్వచ్చంగా..
    ఊగుతున్న జూకాల కదలికలంత ఇష్టంగా....
    చేతికున్న గాజుల గలగలలంత పవిత్రంగా..
    మనసా ..వాచా..కర్మణా ...అర్పణలన్నీ..మీవే..మీవే..అని..!
    ఏకత్వం
    శివ తత్వం, విష్ణు తత్వం ఏకమై...
    ఏకత్వ స్తాణువై..పూజలందుకొను మాసం.. కార్తీకం..
    ...
    విశేష ఫల ప్రదమైన ..పవిత్రమైన..
    ఉపాసన కాలమయిన దక్షిణాయానంలో వచ్చే మాసం.. కార్తీకం..
    నెల వంక అయిన చంద్రుడు ..కృత్తికా నక్షత్రంతో కూడిన రోజే.
    నెలారంబమని..ఆ పేరుమీదే...నిలిచిన మాసం...కార్తీకం..
    ఈశ్వర స్వరూపమే దీపం...ఆ ఈశ్వర దర్శన బాగ్యంకొరకే..
    ఉదయం...సాయంసంద్యలలోనూ.. దీపం పెట్టుకొను మాసం ..కార్తీకం..
    ప్రతి దేవాలయంలోను..అర్చనారాధనలతో ..ధ్వజస్తంబంపైన ..
    ఆకాశదీపం వెలుగులు రువ్వుతూ కనిపించే మాసం..కార్తీకం..
    ఆశ్వీయుజమాసంలో ..చంద్రుని వెన్నెలను త్రాగిన నదీజలాలు..
    ఔషధీయిక్తమై ..నదీ స్నానానికి ప్రాశస్త్యమిచ్చే మాసం..కార్తీకం.
    విష్ణు తల్పమైన ఆదిశేషుని ..శివుని .కంఠాభరణం..నాగుని ..
    పూజిస్తూ....పాలుపోయు నాగుల చవితి వచ్చు మాసం.. కార్తీకం..
    ఒకటిగా కలిసి...బెదాలను విడిచి ..వనబోజనార్దమై..
    పరమాత్మ స్వరూపమైన చెట్ల నీడలకేగు మాసం.. కార్తీకం..
    ఆలయాల్లో..యమద్వారమును తలపించు .. జ్వాలా తోరణం
    శైవ..విష్ణు లోకాల దారిని చూపించు మాసం..కార్తీకం..
    స్వామి చరణాల వాలేదేలా..!!
    అభయ హస్త మిచ్చి ఆపదల గాచుచు...
    అన్నీ తానై...తలనీలాలను ముడుపుగా చేకొను స్వామి..
    ...
    గోవింద ...గోవింద ..అని తలచినంతనే..
    హృదయంలోనికి పరుగు పరుగున వచ్చి చేరే స్వామి..
    వైకుంఠముని వీడి ..శేషగిరిపై..శిలగా మారి..
    కలి పాపాలనుంచి కాపాడ..వేంకటేశ్వరుడై నిలిచిన స్వామి..
    నిత్య కళ్యాణాలతో...పూజా కైంకర్యాలతో..సేవలందుకుంటూ..
    క్షణమాత్రం దర్శనం తోనే..జన్మతః పుణ్యఫలం ప్రసాదించు స్వామి..
    ఆ స్వామి దివ్య లీలలను వింటూ...ఎప్పుడెప్పుడా ..
    శ్రీనివాసుని కన్నుల నిలుపుకొను భాగ్యమని తలపోస్తూఉన్నా..
    గుండె గుబులాయె..మరి..ఏడేడు కొండలు ఎక్కాలంటే...
    చేతిలో కానీ లేక..చెంతను శక్తి లేక..చేరేదెలా ...
    స్వామి చరణాల వాలేదేలా..!!
      ******బాల కార్మికులే కదూ !*****
      ఉమ్మడి కుంటుంబాలలో ..తాతయ్యతోచేరి ... కర్రాటలు...
      నానమ్మ పక్కలో దూరి.. అడిగి అడిగి చెప్పించుకునే..కాశిమజిలీ కథలు.
      పెద్దమ్మ పెట్టే పెసర బూరెలు , చిన్నాన్న తెచ్చే సీమచింతకాయలూ ....
      అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు , తమ్ముళ్ళు ..అనుబంధాల అల్లికలలో..
      ఒంటబట్టించుకున్నఆప్యాయతలు.... అణకువల ఆదరణలు...
      ఏవి..?... ఏవి...? అని వెతుకులాటల వేదనలలో ..
      ఒంటరి అయిన బాల్యాలు..

      ఉంగాలతోనే..ఎ ఫర్ ఆపిల్ అని చెపుతూ...
      డైపర్లతో గాలాడనీయక ..సున్నిత ప్రదేశాలని మూసేస్తూ..
      తప్పటడుగులతోనే ...ప్లే స్కూల్ కి నడిపిస్తూ..
      అగ్గిపెట్టెల అపార్ట్మెంట్లలో..ఒకళ్ళని మించి కంటే..
      భారమని తలచే .న్యూక్లియర్ కుటుంబాలలో..
      వారి వారి ఆలోచనల సంకుచిత బుద్దిని ..
      పాలుగారు లేత మనసులపై రుద్దుతూ..తల్లితండ్రులు..
      భుజాన బస్తాల వంటి బ్యాగులు మోస్తూ..
      ఆటోలలో..ఇరుక్కుంటూ...
      స్కూలు బస్సుల్లో కూరుకుపోతూ..
      దూర దూరాలలోని కాన్సెప్ట్ స్కూల్స్ కని ..
      పరుగులు పెడుతున్న బాలలు..
      గ్రౌండ్ లేని బడులలో...ఇండోర్ గేమ్స్ అంటూ..
      ఇరుకు గదులలో..
      కంప్యుటర్లకి కళ్ళని అతికింపజేయిస్తూ..టీచర్లు.
      క్రమశిక్షణ పేరుతొ..ఎక్స్ ట్రా ష్టడిస్ అంటూ ...
      రోజుకు పన్నెండు గంటలు.. చదువులు..
      మట్టి కొట్టుకుంటూ..అంట్లు తోముతూ..
      పేడ పిసుకుతూ...పిల్లల్ని మోస్తూ..
      తనది కాని బ్రతుకు ఈడుస్తున్న ...ఈ.. బాలలు..
      అక్కరలేని బేషజాన్ని ప్రదర్శించే పెద్దల ఇగోలకు ..
      తనను తాను కోల్పోతూ....
      సారంలేని జీవితం గడుపుతున్న..ఈ.. బాలలు..
      చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న బాల కార్మికులే కదూ!
    నా మది....
    పవ్వళింపు సేవకై...
    పానుపు గా నామది
    పరచినాను నీకై...
    అలుక మాని అరుదెంచు
    అలల పైన అలవోకగా....

    అన్నమయ్య ఆది పురుషుడు
    నీధ్యానంలో ధన్యమైనాడు
    అతని కీర్తనల నీవు
    ఒదిగిఒదిగి ఉన్నావు....
    ప్రజల మనసులు రంజిల్ల
    ముల్లోకాలు ముచ్చటిల్ల.....//పవ్వళింపు//
    ఎందరెందరో నిన్ను చూడ
    దిష్టితగులునేమో నీకు
    తెరచాటుగా చేసుకొని నన్ను
    సుఖముగా నిదురించు....
    శేషాద్రివాసా.....
    అలుపులన్ని తొలగించుకో...
    తిరుమలేశా..... //పవ్వళింపు//
    సుజాతను ....
    సుజాతను నేను... అమ్మానాన్నల ప్రియ సుతను నేను...
    సుమనోహరుడి వలపు వెన్నెలను ఆస్వాదించు ప్రియసతినై...
    సువిశాల జగతిలో నేనొక చుక్కల పల్లకీలో పయనించు అభిజాతనై......
    సుమధుర స్వప్నంలోని మధురోహల్లో తేలిపోతూ...ఆ
    సుప్రభాత సుందరుని లేలేత కిరణాలకి...
    సుస్నేహ పవన మాలికల వీవనల స్పర్శకు...
    సుఖ నిద్రా ప్రపంచంలోనుంచి ఇహలోకంలోకి బలవంతంగా వచ్చి...
    సుముఖంగా ముఖ ప్రక్షాళన గావించి, సుమబాలలా స్నానించి...
    సువాసనా భరితమైన ఫిల్టర్ కాఫీని ఆస్వాదిస్తున్నా...
    సుర్ సుర్ మని కాలుతున్నా, లెక్క చేయక, మధురమైన రుచిని ఆస్వాదిస్తూ...
    'గుడి ' సె ..
    'గుడి'సె..అనే పదంలో నే గుడి ఉంది...
    అందుకే...ఆ పూరి గుడిసె.. ఓ దేవాలయం..
    మట్టి కుండలోని ..మజ్జిగ మెతుకులనయినా..
    మమతల రంగరింతలతో ..పంచుకునే ప్రేమాలయం..
    ...
    బ్యూటిపార్లర్లు ..తెలియవు కాని..
    అమాయకత్వపు క్రీములను పూసేసుకొని..
    మంచితనమే ..నిజం అని నమ్మే..సహజ రీతితో..
    కాయ..కష్టం చేసుకుంటూ..కలిసి ఉండేదే వీరి జీవితం..
    ప్రకృతమ్మ ఒడిలో సేదతీరుతూ..
    ఆమె అగ్రహంలో...అసువులు బాస్తూ..
    పున్నమిలో..వెన్నెలల విందు చేసుకుంటూ..
    భాస్కరునితో..పాటు సాగేదే వీరి బ్రతుకు పయనం..
    పున్నమి జాబిలి
    పున్నమి జాబిలి పంచే వెన్నెలను
    అమృతం వాలె త్రాగిన గోదావరి..
    అమరమై...మెరుస్తుంది..
    ...
    ఒడ్డున చేరిన ప్రేమ జంట
    తమ వలపుచూపుల కౌగిళ్ళలొ
    పెనవేసుకున్న బంధాలకు
    ఆకృతినిస్తూ...ప్రక్రుతిలో లీనమైన వేళ
    కొండ కోనల నుంచి పరుగు పరుగున
    వచ్చే సమీరాలను గమనించని స్థితికి లయమైంది....
    చల్లని వెన్నెల సైతం వెచ్చనయినదని
    పరిహాసమాడుతున్న పచ్చికకి ..
    పచ్చ పువ్వుల నవ్వులే సమాదానమిచ్చాయి ..!!
    అదిగో..అదిగో..
    అదిగో...అదిగో..మందిరము...
    సాయి భాబా మందిరము..
    శాంతి సౌఖ్యాల సమభావం.....
    సాయి బాభా మందిరము..

    నిత్య హారతుల నిలయయములే...
    నిరతము సాయీ స్మరణల నెలవములే..
    కల కాదు ఇది.. నిజమయిన నిజము..
    ద్వారకామాయీ దరిశన ఫలము.................//అదిగో//
    సచ్చితానందుడే సాయీ ..
    సర్వము తానే సాయీ ..
    సావాసము చేయీ..
    సాయితో..సావాసము చేయి..
    నీ తోడూ వీడక సాయీ..
    నిను కాపాడు నోయీ..
    సదా నిను కాపాడు నోయి.....................//అదిగో//
    //బావేగా..!!//
    అమ్మ కడుపున
    అంకురంగా నిలిచినప్పటినుండి
    అధికారం చేజిక్కించుకుంటుంది.....
    మరదలు బావపై..

    'నీకు పెళ్ళాం పుట్టిందిరా ' అంటున్న నానమ్మ
    ఆకతాయి మాటల్లోని అత్మీయతను ..
    'నా కోడలు నాకేసొంతం ' అంటూ
    అక్కున చేర్చుకున్న అమ్మ అనురాగాన్ని ..
    పసి హృదయంలోనే బీజం నాటేసుకొని..
    అవే భావాలతో మరదలిపై..ప్రేమని పెంచుకున్న బావ..
    అలకలైనా..ఆవేశమైనా..బావేగా...
    సున్నా చుట్టిన మూతి బిగువులకి..
    ముచ్చటైన ముద్దులు చెల్లిస్తూ..
    సుద్దుల సరసాల తేలించేది..మరి బావేగా...!!
    పెప్పర్ స్ప్రే తో...!!
    "అమ్మా ..నేను కాలేజికి వెళ్ళను...
    ఇక చదువు మానేస్తా..."
    అని ఆనాడే చెప్పిన కూతురు మాటలకి...
    ఇసుమంతైనా విలువనివ్వలేదాయె...

    కళ్ళు మూసుకు పోయిన కర్కశత్వం
    గెలుపు సాధించాలనే మూర్ఖత్వం
    పసిడి తనాన్ని భగభగలాడించింది..
    ఆడపిల్ల ఆక్రోశం ..అగాధాలలో అల్లాడుతుంది..
    తప్పెవరిదంటూ తరచి చూసుకుంటూనే ఉన్నాం..
    అయినా రోజూ జరుగుతూనే ఉన్నాయి..జరిగే ఘోరాలు..
    అమాయకత్వం వీడి...మన అమ్మాయిలంతా ...
    తమని తామే కాపాడు కోవలె...చెంత పెప్పర్ స్ప్రే తో...!!
    జన్మనిచ్చావు స్వామి...
    బంధాలలో.బందీని చేసి...
    తీరని దుఃఖాల ..వేదన పెంచేసి..
    జన్మ నిచ్చావు స్వామి..
    ...
    ఆదరి..ఈ దరి..ఏ దరి చూసినా..
    అగుపించవు వెలుగుల నగవులు..
    విధి ఆడే..... నాటకంలో..
    పోయెను..పై పైనే ... ప్రాణాలు..//జన్మ.//
    ఏడుకొండల పైన ..నీ నివాసము..
    చేరలేని అసహాయతే...నా జీవనము
    సంఘర్షణలతో..సయోగ్యమై..బ్రతుకే..భారమైనది..
    స్వామీ..!..
    నీ కరుణారసాల తేనెలు కురిపించి..
    నీవిచ్చిన ఈ జన్మని ..నీలో చేర్చుకో...స్వామి...!!..జన్మ//
    See More
    సుజలాం సుఫలం సుందరం సుజాతం
    అమ్మతనం ,ఆత్మీయఫలం ఆమె స్నేహం
    అందరి మనస్సులలో మెదిలే పారిజాతం
    చిన్నలైన ,పెద్దలైనా అందరికీ ఆమె అంటే ఇష్టం
    కుటుంబంలోనైనా ,వ్యక్తిత్వంలోనైనా అమెకామే ఓ ప్రత్యేకం...
    ఆమెను చూస్తే చాలు చిరునవ్వు రైలులా ప్రయాణిస్తుంది
    ఆమెచెంత ఉంటే చాలు అమ్మ తోటి ఉంటున్నట్టే అనిపిస్తుంది
    ఆమె పలుకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది
    ఆకాశమంత నిర్మలమైన హృదయం అమెది
    నిరాడంబరత కల్గిన జీవితం నేటి మేటి ముత్యమైన సుజాతమ్మది
    అందరినీ మెప్పించేను ఆమె తీరు ,అందరికీ ఆదర్శనీయం ఆమె చిరునవ్వు
    ఎవ్వరైనా ఆమె స్నేహాన్ని కోరతారు ,ఒక బందువులా ఆమెని చూస్తారు
    అందుకే ఆమె ఒక ఆత్మీయబందువురాలు మనందరికీ
    ఆమె అనురాగం ,అప్యాయతలే మా లాంటి వారికి నిండు ఆశీస్సులు
    అమ్మా మీరెప్పుడూ ఇలానే చల్లగా ,నిండు నూరేళ్ళు ,మంచి ఆరోగ్యంతో
    నిండు వెన్నెల లా వికసించాలని కోరుకుంటూ
    హృదయపూర్వక ''జన్మదిన శుభాకాంక్షలు'' - మా సుజాతమ్మకు ,మీ సుజాతనీయంకు
    అద్బుత కళాఖండాలు మీ కలం నుండి జారే ఆణిముత్యాలు
    మీ సాహితీసంపద కూడా ఇలానే కొత్త చిగురులు పూస్తూ
    మమ్ములను పులకింపచేస్తూ ,ప్రోత్సహిస్తూ
    మీ కలం ముందు ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ
    మరోసారి మనస్పూర్తిగా ''పుట్టిన రోజు శుభాకాంక్షలు''
    ఇట్లు
    మీ పద్మ -ప్రసాదు

    See More
    "జ్ఞాపకాల గాధనే "
    వీధరుగు మీద ..తాత ఒడిలో కూర్చుని
    గడ్డం పట్టుకు ఆటలాడుకున్నానట..
    అది ఎద సందూకంలో భద్ర పరుచుకున్న జ్ఞాపకం.. .
    ...
    అమ్మ చేత చీపురు పుల్ల దెబ్బ తగిలిన
    ముంజేతిపై..రక్తం మరక చూసి ..జేవురించిన నాన్న
    అమ్మని కేకలేసిన వైనం..అదో...అరుదైన జ్ఞాపకం..
    అమ్మ చేతి గాజు పగిలి..తనకి తగిలిన గాయం నుంచి
    వచ్చిన రక్తం ..మరక నా చేతికంటుకుందని తెలిసి...నాన్న .
    గారాబాన్ని .చూసి మురిసిన అమ్మ.. అమృతమైన జ్ఞాపకం....
    పందాలేసుకుని తాడాటలాడుతూ..అలసిన వేళ..
    కారం అటుకులు పంచుకుని తిన్న ..కేరింతల నవ్వుల.
    పసిమనసుల మాసి పోని మధుర జ్ఞాపకం..
    వేసవి సెలవుల్లో..పెళ్ళివారమైపోయి..
    అమ్మ పెళ్ళిలోని చెక్కబొమ్మలని ..అందంగా సింగారించి
    కొబ్బరాకుల బూరల బాకాలతో..వేపచెట్టు పందిరిలో..
    పప్పు బెల్లాల..పంచ భక్ష్యాల విందులతో..
    బొమ్మల పెళ్లి చేసిన ..ఓ పెద్దరికపు జ్ఞాపకం..
    వార్ధక్యపుటంచుల నిలిచినా..పుట్టింటి గారాల పాపనే..
    తిరిగిరాని కాలానికి ..మరోజన్మెత్తి ...మురియాలని..
    బాల్యపు శ్వాసల ఊయలలూగుతున్న..జ్ఞాపకాలగాధనే....!
    న్యాయం..
    సత్యం అనే పదానికి అర్ధ్తం తెలుసుకోలేని వ్యవస్థ..
    స్వార్ధ రాజకీయ చదరంగంలొ పావులాగా మారి..
    గంతలు కట్టుకున్న న్యాయదెవతని పూర్తిగా కబొధిని చేసింది..
    ...
    కాలాలతో పాటూ మారుతున్న చట్టాలు...
    భారతీయ సంస్కృతిని మరుగున పడేస్తూ..
    విసృలంకత్వాన్ని పెంచేస్తున్నాయి..
    దనవంతుల ఖజానాల్లొ డబ్బు మూలుగుతున్నట్టే..
    ధర్మం ...చలిజ్వరం వచ్చిన రోగిలాగా...
    కంబళి కప్పుకుని సొమ్మసిల్లి పడుకుంది..కదలక మెదలక..
    సాక్ష్యం అవసరాలకనుగుణంగా మారిపోతూ..
    పాదరసమై..జారిపోతుంది....అధికారుల హస్తాలలోనికి.
    చివరికి న్యాయం నిర్ధయయై..నిర్ధోషిని కటకటాలలోనికి నెట్టుతుంది..
    See More
    Like · ·
    నడిరేయి ఏ జాములో...
    'నడిరేయి ఏ జాములో '
    జానకమ్మ గాత్రంలోని
    మాధుర్యాన్ని ...
    నగవుల రేడు ..
    ఏడుకొండల వాడు
    ఆసాంతం ఆస్వాధిస్తూ....
    నచ్చి మెచ్చిన శ్రీదేవిని
    ఎదపై నిలిపినాడని..
    నన్ను కానటంలేదని..
    అలుకలు పోయిన
    అలివేలు మంగకి .
    నడుమ నలిగే.
    .శ్రీవారు..
    దిక్కుతోచని స్తితిలో...
    నల్లరాయిగా మారి..
    కదలని శిల ఆయినారే...
    అయినా..
    నన్ను కొలిచే వారి
    కొంగు బంగారమేననే స్వామికి ..
    నన్ను నేనుగా
    సమర్పించు కొందుకు..
    నడిసముద్రంలాంటి ...
    ఈ బ్రతుకునుదాటలేక
    నట్టనడుమ నలిగి నలిగి..
    శ్వాసాడక ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్నా....!

    See More
    "వెతుకు తూనే ఉన్నా...!"
    ఎదగదిలోని..చీకటి కుహరంలో...ఉదయించిన ఒక ప్రశ్నకి
    సమాధానం కోసం తల్లడిల్లుతూ...నా చూపులు సారించినంత మేరా
    వెతుకుతూనే ఉన్నా..
    ...
    సముద్రం తన గర్భంలో చెలరేగిన కంపనాలకి
    అతలా కుతలమవుతూ...సృష్టిస్తుంది సునామీని...
    తన కెరటాలను ఉత్తుంగ తరంగాలను చేసి ఎగురవేస్తూ...
    ఆ బ్రహ్మాండమైన అలల చేతులతో భూమాతను ముంచి వేస్తూ...
    ఉప్పొంగి ఉరికిన నీటి ప్రవాహానికి, ఎల్లలు లేని వెల్లువకు...
    కొట్టుకొని పోయి అనాధ లయిన వాళ్ళు ఎందరో..
    ఆశ్రయం కోల్పోయి అలమటించే వాళ్ళు ఎందరో..
    సద్దు మణిగిన సమయాన అలవోకగా అందరికీ అశ్రయమిస్తూ ..
    భేదాలను మరచి...అందరూ తన వారేనంటూ...
    ఆ అంబుధియే ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది..
    విచక్షణ మరిచి విఝ్రుంభించిన గాలి సైతం ఉనికిని తెలుసుకొని ...
    ప్రాణ వాయువై...జీవకోటికి జీవం పోస్తుంది..
    ప్రకృతి ప్రవర్తనలో మార్పులు చేర్పులు...అత్యంత సహజాలు...
    కానీ మనిషికెందుకు....వీడని క్రోధాలు, స్వార్ధపు అహంకారాలు..?
    నీటి బుడగ లాంటి జీవితం కోసం అవసరమా నిజాల సమాధులు..?
    మానవత్వం మరిచినవాడు..అసలు మనిషి ఎందుకవుతాడు....?
    సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నా...!
    నీవు నడిచి వెళ్ళిన దారిలోని
    గడ్డి పువ్వు సైతం...
    గర్వంగా తలలూపుతుంది....
    నీ పవిత్ర పాదధూళి సోకి తాను
    ధన్యత పొందినానని.......
    సాయి...!
    ఆ పూవుకు దొరికిన భాగ్యం..
    ఎలాగూ ..నాకు లేదు..
    కనీసం..నీ చరణారవిందాల
    కైమోడ్చనీ...
    సదా నీ నామ స్మరణలో..
    జీవితం కడతేర్చనీ....

    See More
    పల్లవి :
    సేద తీరనీ సాయి...
    నీ పాద సన్నిధిలో..
    నీ అభయ హస్తపు నీడలో...
    సేద తీరనీ..సాయి........
    సాయి ఓం..సాయి ఓం..సాయి ఓం...

    చరణం :
    నీ నామమే శ్వాసగా మారి
    నీ తలపులే ఎదలో మరి మరి ..
    బ్రతుకు దారిలో నడకలు నేర్పుతూ
    నీ ఆలయాన అడుగిడజేసెనే....సాయి..ఓం...//సేద//
    చరణం :
    నీ లీలలన్ని అమృత తుల్యములే...
    గ్రహించుకున్న మనసుకెంతో..శాంతినిచ్చులే..
    సమాధి నుంచి నీవిచ్చే సమాదానములే..
    గమ్యము చేర్చునవే...రథసారధులవలెనే...సాయి..ఓం.//.సేద//
    See More
    ఆకాశం.....
    దేశాలు ఎన్నో...ఎన్నెన్నో....నదీ నదాలు...సముద్రాలు..ఎన్నో..ఎన్నెన్నో..
    కానీ...అనంతమై వ్యాపించి ..విశ్వమంతటికీ ఉన్నది .... ఒకటే...ఆకాశం..
    ...
    లెక్కలేనన్ని నక్షత్రాలు ..పాలపుంతలె కాదు...పరిభ్రమిస్తున్న గ్రహాలు...
    సూర్య చంద్రుల కావాసమై..పగలు ..రేయిల భారం మోస్తూ..నిబ్బరంగా నిలిచేదే ఆకాశం..
    త్రిమూర్తుల నిలయాలయిన బ్రహ్మలోకము...వైకుంఠము ..కైలాసమునకు.. .
    పోవు మార్గానికి బాసటగా ఉంటూ..దేవతలకు నెలవైనదే..ఆకాశం....
    శూన్యంలా కనిపించినా..అనంత కోటి పరమాణువుల సముదాయాలను దాచుకొని..
    అద్భుతాలతో అబ్బురపరుస్తూ....ఆశల రెక్కలను రెపరెపలాడించేదే...ఆకాశం...
    రాత్రి పగళ్ళ సమన్వయనానికి తానే సమాదానమవుతూ...
    వెలుగయినా…… చీకటయినా..ఒకే రీతిలో స్పందించేదే..ఆకాశం...
    గిరి శిఖరాగ్రాలను తాకుతున్నట్టుగా కనిపిస్తూ..
    దూరంగా నేలమ్మని ముద్దాడుతున్నట్టు భ్రమింపజేసేది ఆకాశం..
    అలసట నెరుగక అలలు ..ఎంతగా ఎగసి పడుతున్నా...
    అందినట్టే...అకృతినిస్తూ...నేనెప్పుడు అందనని చెపుతుంది ఆకాశం..
    కాలాలు..సంవత్సరాలు...తరాలే కాదు...
    యుగయుగాల నుంచి సుస్టిరమై నిలిచి ఉంది ఒక్కటే..ఆకాశం...
    అమ్మలోని ప్రేమని..నాన్నలోని అనురాగాన్ని సమన్వయపరుచుకొని..
    నిస్పృహల చూపుల దృష్టి సారించినపుడు...నేనున్నానంటూ...సాంత్వన తెలిపేదే ఆకాశం..!
    పెద్ద బాలశిక్ష...
    అ ఆ లు నేర్పే..అమ్మ పెద్ద బాలశిక్ష ...
    ఆ బాలశిక్షను.ఔపోషణ పట్టి..
    అనురాగపు అమృతంతో రంగరించి......
    సంస్కారం అనే... ఉగ్గు చేసి....
    బిడ్డల కందిస్తుంది మాతృ మూర్తి...

    ఆడపిల్ల అని చులకన చేయక
    చెప్పించిన చదువులకు సార్ధకత చేకూర్చి
    మెట్టినింటను అభిమానాల పంటలే కాదు..
    అవగాహనల ఉపిరులతో ...
    స్వర్గం చేస్తుంది...ఇల్లాలై...
    పురాణాలు ..ఇతిహాసాల కాలము నుండి..
    చదువు అంటేనే.."సరస్వతీదేవి "
    శ్వేతాంబరి అయిన ఆ చల్లని తల్లి కూడా
    బ్రహ్మ దేవుని మానస చోరిణే (ఇల్లాలే ) కదా..
    చీకటిలో చిన్ని దీపం వెలుగే...
    గమ్యం చూపించేందుకు
    మార్గదర్శకమయినట్టు..
    ప్రతి ఇంటిలోనూ..
    చదువు కున్న ఇల్లాలు ఉంటె....
    ముల్లోకాలు ముచ్చటగా
    ముంగిటిలో రంగవల్లుల
    ఆనందాలని అందిస్తాయి అనడంలో..
    అతిశయోక్తి లేదు మరి..!!
    "జై జవాన్..."
    జై జవాన్ అని నినదించటమేనా....
    వారి బాగోగుల గూర్చి ఆలోచిస్తున్నారా...ఒక్కరైనా..
    ఉగ్గుపాలతో అమ్మ పెట్టిన దేశభక్తిని అరిగించుకొని..
    అమ్మని విడిచి...భారతమ్మ ఒడిని కాపాడుకుందుకు ...
    కష్టసాద్యమైన పరీక్షల కోర్చి..
    జవానుగా తుపాకందుకున్న వీరుడు మన జవాను..
    కుల మతాలకతీతంగా ...అందరూ ఒక్కటిగా తలస్తూ...
    తాను ఒంటరి అయినా...తనతోటివారే
    తనవారుగా భావిస్తూ...
    క్రమశిక్షణలో కర్తవ్య ధీరుడు మన జవాను..
    రణరంగంలో రాళ్లయినా...గుట్టలయినా..
    శత్రువులకెదురు నిలిచి..చివరి శ్వాసను సైతం
    నేలమ్మకంకితమివ్వాలని
    తలచే సూరుడు మన జవాను..
    వారి త్యాగనిరతిని తలచుకొని..
    ఒక్కసారి మనని మనం ప్రశ్నించుకుని..
    మనలోని మానవతని మేల్కొల్పుదాం ..
    ప్రతి ఒక్కరము ఒక సైనికునివలె నిలిచి
    చీకటిని పారద్రోలు దివిటీలమై....
    భారతమాత కన్నుల వెలుగుల వెన్నెల నింపుదాం..!!
    ఈ అనురాగాల అనుబంధం..!
    అమ్మ పాలు పంచుకొన్న బంధం
    అక్కా చెల్లి ..అన్నా దమ్ముల అనుబంధం .....
    కన్నవారి కంటి నీడల ఉన్నంతవరకు.....
    ఒకరికి ఒకరుగానే...కలిసి బ్రతుకు అనుబంధం ..
    రెక్కలు వచ్చిన పక్షులు వలస పోయినట్టే..
    వీడిన బాల్యాన్ని ఊగే తలుపు కొక్కానికి తగిలించి.. ...
    బంధాల బట్టలను ...చాకలికొదిలేసి..
    కొత్త పోకడల జీవితం వెతుక్కునే..అనుబంధం ...
    ఉమ్మడి కుటుంబాలలో ...పంచుకునే మమతల కథలు ...
    ఉహల్లో నక్షత్ర మండలాలే...తళతళల మెరుపులతో..
    ఒంటి కన్ను రాక్షసుడిలా...పరుగుల పయనంలో..
    ఎవరికి వారే ఒంటరివారై...పెనుగులాడే అనుబంధం
    అనుకోని అతిధి వచ్చి..అక్షయ పాత్ర ఇచ్చినట్టే..
    ముఖ పుస్తక సమూహం ..మనందరి బంధువైంది...
    "అమ్మా " అనే పిలుపు...ఆ దేవుని రూపమైంది..
    అక్కా..అన్నా...తమ్ముడు....చెల్లి....ఎన్ని బంధాలు ...
    స్నేహ సంబంధాలు ...ఒకే కొమ్మకి పూసే అనేక సుగంధాలు..
    వాస్తవికతలోని దాహార్ది....మనసు చెమ్మను తుడిచేసి...
    ఆప్యాయతలాయువిచ్చింది ....ఈ అనురాగాల అనుబంధం..!
    అల్లా మాలిక్...
    సబకా మాలిక్ ఏక్ హై...
    అల్లా మాలిక్...అల్లా మాలిక్...
    సాయి బాబా చరణములు...
    శరణములొసగే భరణములు..
    అనంత కోటి విశ్వములో..
    ఆపదల గాచె భాగ్యములు...//సబకా//

    సాధువు అతడే..
    సమర్ధ్ర సాయి సధ్గురువతడే..
    సమాధి అయినా..సజీవమై..
    సమాధానములతో..సమస్యలతీర్చు..
    నిజరూప దరిశనముల
    నిదర్శనముల దైవము అతడే..//సబకా//
    కణ కణ మండే చూపులూ..
    కసురుకుంటున్న వాక్కులూ..
    తొలగించును అహంకారపు పొరలను..
    జోలెను చాచిన చేతులూ..
    విభూది ప్రసాదమునొసగి..
    ఆత్మ పరిశుద్ది చేయును..
    నిత్య పారాయణముల సాయి లీలలు..
    శుభపరిణాములనిచ్చేటి అమృతఫలములు..//సబకా//
    అవ్వ !
    అమ్మగా ఆయువు నిచ్చి...
    అన్నంపెట్టిన చేతులతోనే..
    భవిష్యత్తు గోడలకు పునాదివేసి...
    సురక్షిత రక్షణలో..
    బిడ్డలని ఉంచినా..
    వారి నిరాదరణకు...
    అభిమానం అడ్డువచ్చి.....
    అలవాటయిన పనేనని....
    మోపును బుజానికి ఎత్తుకొని..
    వంగిన నడుముతో...
    ముడుతల శరీరం సహకరించకున్నా...
    మసిబారిన చేతులలో...
    ఆత్మబలం కూడదీసుకొని...
    నీకు నీవుగా ... 
    జీవించాలనుకునే...అవ్వా!
    నిన్ను చూసి నేర్చుకోవాలి యువత...
    కష్టం అంటే...ఏమిటో..
    మసక బారిన నీ కన్నుల కాంతిలో....
    వెలుగుతున్న దివ్వెలవెలుగులో...
    గమ్యం వెతుకుక్కోవాలి..!
    నీ జీవితానుభవాల పాఠాశాలలో చేరి..
    బ్రతుకు చిత్రం వేసుకోవటం నేర్చుకోవాలి... !
    ఆనందాల హేళి..
    అదిగదిగో...రాలిపడుతున్నాయి...
    నక్షత్రాలు..చిక్కని .చీకటిలో...
    కావు..కావు ..అవి వెలుగు పూవులు.....
    అమావాస్య నాడైనా కురిసే. ..వెన్నెల ముద్దలేమో...

    కేరింతలతో..తుళ్ళింతలతో....గంతులు వేస్తూ..
    నింగిలోనికి ఎగసిన .. తారాజువ్వలని చూస్తూ..
    పసి మనసుల.. పసిడి పలుకులు...
    అమాయకత్వంలోని ఆమని అందాలే..మరి..
    విష్ణువక్షస్థలనివాసి అయిన లక్ష్మీదేవిని..
    భక్తి శ్రద్దలతో... అర్చలన పూజిస్తూ..ఆవాహనము చేసిన..
    కరుణావీక్షణములతో....అరుదెంచి...
    ఆశిస్సులందించే..అపురూపమయిన రోజు..ఈ దీపావళి రోజు..
    నరకాసురవధతో....ఆనాడు అసుర భాధలు తొలగ
    ప్రజలు సంబరాలతో... పండుగను చేసుకొనె..
    కాకరపువ్వొత్తుల కాంతులతో...చిటపటల
    చిచ్చుబుడ్ల సందడులతో...డమడమల బాంబుల మోతలతో..
    "అతి ఏదైనా అనర్ధానికి చేటే.."అన్న పెద్దల మాట..
    చద్దన్నం అని పారేయకుండా..వంటికి పట్టించుకుని...
    టపాసులను కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలతో..
    వాతావరణ కాలుష్యాన్ని నివారించ ప్రయత్నిస్తే..
    అవుతుంది ప్రతి "దీపావళి " ఆనందాల హేళి..!
    అమరమైనాక.."
    ప్రమిద ...నూనె ఉంటేనే.....వత్తి వెలిగి ..దీపమై వెలుగిస్తుంది.
    యోధుడయినా... దేవుడయినా......అతివ ఆలంబన లేనిది..
    తాను నిమిత్త మాత్రుడనని...తెలుపగలిగే..చరితే......
    మూర్చిల్లిన శ్రీ కృష్ణుని రక్షించుకొన...
    నరకాసురుని వధించిన సత్యభామ కథ...

    ఆది ..అంతం.."ఆమె" అని తెలిసినా....
    అణగారని అహంకార రాక్షసులు కోకొల్లలు..
    జీవాన్ని తోడేస్తూ...ఛరించే శవాలుగా మార్చేస్తూ..
    అమ్మ కూడా "ఆమె " అన్న బావాన్ని తొక్కేస్తూ...
    ఆదిశక్తి అంశను అశువుల వలయంలో బందిస్తున్నారు..వారు..
    పుణ్య ఫలాలనిచ్చే పురాణాలకాలంనుంచి...
    సరస్వతి...లక్ష్మి...పార్వతి...పేర్లు ఏవయినా...
    దేవి..అమ్మవారు ..సౌభాగ్యప్రదాయిని "ఆమె.."
    ప్రతి నోములోను..గౌరమ్మగా పూజలందుకుంటూ...
    హిందూసాంప్రదాయంలోనిలిచిన... పసుపు పట్టపురాణి "ఆమె "
    "ఆమె " కంటి కొస వెన్నెలలు కురిసిన రోజు..
    "ఆమె " చిరునవ్వుతో మల్లెలు పూయించిన రోజు...
    "ఆమె" కదలిక కనకాంబరాల కనకం కురిసిన రోజు..
    "ఆమె" లో కంటి చెమ్మచేరనీయకుంటే చాలు..
    ఆ రోజే అసలయిన "దీపావళి " పండుగ ..
    ఆ పండుగ ప్రతిరోజు రావాలి...ఇక తారా జువ్వలెందుకు ..
    "ఆమె " పంచే ప్రేమామృత ధారల సేవనల అమరమైనాక..!!
    పాణిగ్రహణం
    ఎవరికి ఎవరో..ఎక్కడి వారో...మూడు ముళ్ళ బంధంతో..
    ఒకరికి ఒకరుగా ..ఒక్కరుగా...కలిసి..జీవితం పంచుకుంటారు..
    ...
    పాణిగ్రహణం (పెళ్లి) ప్రతి మనిషీ.. తన జీవితంలో
    జరిగే మలుపుకు కారణమవుతుంది..
    నా అనుకుని పెంచి పెద్దచేసిన కూతురుని...
    కన్యాదానం చేసి...వరునికి అప్పగిస్తారు..అమ్మాయి తల్లితండ్రులు..
    ఇక ముందు 'అందుకున్న చేయి ఎన్నటికి విడువక..
    జీవితాంతం తోడుగా ..నా కడవరకు ఉంటా 'నంటూ..వరుడు ప్రమాణం చేస్తాడు.
    ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చి..ఈ ఇంటి ఇల్లాలై..
    ఇంటి పేరు తన సొంతం చేసుకుంటుంది...అమ్మాయి...
    జన్మ జన్మల నుండి వస్తున్న బంధం..వివాహ బంధం..
    అర్ధవంతం చేసుకోవడానికి అర్ధ్తం చేసుకుంటూ...ఒకరికి ఒకరు సర్దుకుపోవాలి....!!