30, జూన్ 2016, గురువారం

కోయిల...

మావి చిగురులు నావి..
మామిడీ కాయలు మీవి...
అంటుందా గండు కోయిల...
కుహు.కుహు... అంటూ..
గొంతు సవరించుకొంటూ..

అలుకలనున్నదో..ఏమో..మరి..
పచ్చని చిలక...ఎర్రని ముక్కుతో..
రామ..రామ..అంటూ...
వసంతునికి పితూరీలు చెపుతుంది..
గుబురుల్లోంచి తొంగి చూస్తూ...

ఒంపులు తిరిగిన నదిపాయలాంటి జడలో..
తురిమిన మల్లెలన్ని..నవ్వుతున్నాయి పకపకా..
సైకిల్ పై స్వారి....

సైకిలు పై స్వారి...
జోరుగా... హుషారుగా
సాగునోయి...హాయి..హాయి..
ఇందనం అవసరంలేదు...
ఇక్కట్లకు అవకాశమే లేదు..
కొండలైనా ..గుట్టలైనా.
.కొనలైనా ...లోయలైనా...
పట్టు ఉంటె చాలు...
పయనం ఎంతదూరమైనా.
.పరుగు పెట్టిస్తుంది..
ద్విచక్రవాహనం అయినా.
.సురక్షితంగా గమ్యం చేర్చు..
ఉప్పు..చెక్కెర..
రోగాలకువిడ్కోలిస్తూ...
ఆరోగ్యాన్ని అందిస్తుంది....
నేస్తాలతో పోటి పడినా...
అలసటలో ఆనందాన్నిస్తూ ..
రేగే ముంగురుల మూగభాషల
సాదించిన గెలుపుతో.
.ఆత్మస్థైర్యం పెంచుతుంది...

26, జూన్ 2016, ఆదివారం

****కదూ మరి..*****
అమ్మమ్మా....మీ చెట్టుకి ఎన్ని మామిడి కాయలో..!
కూతురి కూతురు..అబ్బురంగా అంటుంటే...
నానమ్మా .. మన మామిడి చెట్టు ఇన్ని కాయలు కాసింది..
కొడుకు కూతురు...ఆత్రంగా చెపుతుంది..
ఆ “మీ “ ...లో..ఈ “మా “..లో ...తేడా..
అమ్మమ్మకి..నానమ్మకి...ఆలోచనలలో..
నవ్వుకున్నా...ఇద్దరు నా ముద్దుల మనవరాళ్ళే మరి..
అ ఆ ల నుంచి పెద్ద భాలశిక్ష ..తరువాత రామాయణ 
భాగవతాలను తాత్పర్యసహితంగా చదివించిన ఘనత 
మా తాతగారిది...అయితే....కంప్యూటర్లో..కళ్ళకు కట్టినట్టు..
పురాణఇతిహాసాలను చూపిస్తూ...తెలియని ఎన్నో విషయాలను 
అర్ధం అయేలా చెప్పే నేర్పు ...నా మనవడిది...మరి..
రాత్రి పగళ్ళను మింగుతూ...కాలం 
తరాలను..అంతరాలను ... మారుస్తుంది ..
కానీ ..తాత నానమ్మ..తాత అమ్మమ్మ ల ప్రేమ 
పెనవేసుకున్న పేగుభందం మాత్రం ఎప్పుడు అక్షయ పాత్రే.. 
బాల్యాన్ని తిరిగి పొందే అదృష్టం వారిదే కదూ..మరి...!!

charminar

'చార్మినార్'
భాగ్యనగరును ...హైదరాబాదుగా మలిచిన ఘనతతో ..
నాలుగు బురుజులతో..నలుదిక్కులకు చూపులు సారిస్తూ..
నవాబు కట్టడాలలో అద్భుతంగా మిగిలిన రాజసమై..
జుమ్మా మసీదు పక్కనే ..అల్లా ప్రార్ధనలను ఆలకిస్తూ..
చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని సంపాదించుకుని 
మత సామరస్యాని మారు పేరుగా నిలిచిన..
తెలంగాణా ప్రజల మనోరధ మకుటం.మన .'చార్మినార్'
సూపర్ స్పెషాలిటి మాల్స్ ఎన్ని వచ్చినా..
ఎడతెరిపి లేని జనంతో కళకళ లాడుతూ..
కనులకు విందు..మనసుకు పసందును కలిగిస్తూ..
దొరకని వస్తువంటూ లేని బజారులకు ఆవాసమై 
పేద..ధనిక వర్గాల తేడాలను రూపుమాపుతూ..
సమ సమాజ శాంతి చేకూరాలని ఆశించే.. మన 'చార్మినార్'