17, జూన్ 2019, సోమవారం

తుమ్మెదవై నీవు
ఎద సంద్రంలో
ఈదులాడుతూ
ఊహల అలలపై
తేలి తేలి పోతూ
ఆ పున్నమి
ఈ వెన్నెల
ఈ నీరు
ఆ గాలి
అంతా నాదే ..
అంతా నేనే ..
అనుకుంటూ మది
పరవశమౌతున్న వేళ
చూపుల గాలం వేశావు
ప్రేమను మధువును త్రాగించావు
వలపను కౌగిట బందించావు
నేనను నేను లేక నీలో
ఒరిగి కరిగినాను
తీరిన కోర్కెల తుమ్మెదవై నీవు
తిరస్కారపు మాటలతో
హృదయమునే కోసినావు
నీ దారి వేరని నా దరిని వీడి
.ఎగిరి పోతున్నావే ....
వెనుతిరిగి చూడు ఒక్కసారి
నా రుధిరపు మరకలతో
నీ నీడను శాశ్వతమై నిలచినాయి
నా శ్వాసను చివరి దశకు చేర్చి
అవి నీ రెక్కలకు ఎరుపు రంగునే అద్దినాయి !
************* 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి