20, జనవరి 2017, శుక్రవారం

సాక్షి..

ఓపలేని సొగసులకు ..

నిన్ను తమలో ఇముడ్చుకోలేనితనంతో ..
బరువెక్కి.. అరమోడ్పు లయిన 
ఈ కనురెప్పలే సాక్షి..

నీ తలపుల పులకరింతలతో..
ఎరుపెక్కిన చెక్కిళ్ళను 
సుతి మెత్తగా తాకుతూ..
.మర్మాన్ని గ్రహించిన .ఈ గులాబీలే సాక్షి...

మేలిముసుగు పరదాలో..
దాగిపోవాలని యత్నించే అందాలకు 
నీ శ్వాసలను మోసుకొచ్చిన చిరుగాలి అల్లరులకు 
మోముపై సైయ్యాటలాడుతున్న ముంగురులే సాక్షి...

నిరీక్షణలో గడిచిన రాతిరికి..
నిదురను మరిచి ఎరుపు జిరలను 
అరువు తెచ్చుకున్న కనులకు..
ఉదయ సంధ్యను స్వాగతిస్తూ...
మసీదు ప్రాకారం నుంచి....
‘అల్లా ఓ అగ్బర్’ అని వినిపించే ప్రార్దనే.. సాక్షి...!!

10, జనవరి 2017, మంగళవారం

ఎంత తొందరో ...
బాస్కరునికి ...తన లేత కిరణాలతో...
అలలపై తేలుతూ..జలకాలాడాలని..
కొండలని చీల్చుకొని...
ఉరికి ఉరికి వస్తున్నాడు..
ప్రకృతి కన్యకి భయమేసిందేమో....
కెంజాయ రంగులో మారి..
వెలుగు దుప్పటి సరిచేస్తూ ఉంది..
తనలో మునిగి తేలుతున్న సూర్యునితో
ఉబికే తరంగాలు ఆనందంతో ...
ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి..
పచ్చని ఆకులతో పహారా కాస్తూ చెట్లు...
భానుని ఆగమనానికి స్వగతం పలుకుతూ..
గాలి స్నేహ్యితునితో కలిసి..
ఈలాల గానాలు అలపిస్తున్నాయి..
రకరకాల బంగిమలలో మబ్బుల ముద్దు గుమ్మలు
మురిసిపోతూ ఆకాశ రాజులో ఐక్యం అయిపోతున్నాయి...
అనంత కోటి బ్రహ్మాండాలను తనలోనే దాచుకున్న
ఆది నాయకా ...అఖిలాండ స్వరూపా...
ఉదయాలు నీవే...అస్తమయాలు నీవే...
ఉపిరి పోసుకోవడం ఎంత నిజమో..
నీవున్నావన్నది అంత నిజం
దేవా దేవా...విష్ణు స్వరూపా...
మేలుకొలుపుల నీకు
నీరాజనం ఇచ్చెద..
మనస్పు ష్పాల అభిషేకించెద....
హారతినై నీకై కరిగిపోయి..
ఆత్మనివేదన చేసేదనయ్యా ...
అందుకొనుమా...ఈ మంగళ హారతి..


.ఆదిత్య నారాయణ...నమో నమః...

4, జనవరి 2017, బుధవారం

గమ్యం
గెలుపు ఓటమిల
సమీకరణలలో చిక్కి
కావద్దోయి నీకు నీవే 
మరో సమస్య వై....
కాలమెక్కిన
గుఱ్ఱానికెపుడు కళ్ళాలుండవు
గడచిన ప్రతీ క్షణం
గతమవుతుంది
వెనక్కి తిరిగి చూసుకుంటే
వేదనే మిగులుతుంది
ఆలోచనల పెనుగాలులలో
ఆటు పోట్ల ఆవిరైపోకు
ఆత్మ స్తైర్యంతో
సాగిపో....
అల్లదిగో...నీ ముందే ఉంది
నీవు చేరాలనుకునే గమ్యం
************ఎంతబాగుండు.***************.
అలంకరణలో రాజసాన్ని అపాదించుకొని..
పగటివేళల్లో నక్షత్రమై భాసిస్తావు...వజ్రమా..
నీ జిలుగులకు బానిసలై..రాజ్యాలను..
కొల్లగొట్టుకున్న రాజులేందరో...చరిత్రలో...
నేలతల్లి గర్బంలో...మట్టి పొరలమద్య..
ఇరుక్కుపోయి...రాయివై దాగుంటావు..వజ్రమా..
నిన్ను పరి పరి విదాల సానబెట్టి..
కోతలు కోస్తారు ఈ మానవులు...నీకు జిలుగులనీయ..
నవ రత్నాలలో మేటి అనిపించుకొని...
పసిడి పొదుగులో ప్రకాశిస్తావు...వజ్రమా...
జాతక చక్రంలోని దోషాలకు..పరిహారముగా..
నీ మేలిమితో...చాటుకుంటావు నీ ప్రతిభను..
బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకన చేరి..
జన్మసార్ధకం చేసుకున్నావు.... వజ్రమా..
తిరుపతి వెంకన్న కిరిటాన కోటిప్రభలతో నిలిచి..
భక్తులకు దరిశనమిస్తూ...పాత్రవైనావు స్వామి కృపలో..
ప్రతిఫలిస్తే కాని...నీ ఉనికి నీకే తెలియదు...
అందుకే అయినావు అతి ముఖ్యభూమికవు..వజ్రమా..
వాడుకుంటారు ప్రతి చర్యలోనూ..నీ పేరును..అట్లాగనే..
ప్రతి ఒక్కరు..వజ్రం వలె ప్రతిభింబిస్తూఉంటే..ఎంతబాగుండు..

3, జనవరి 2017, మంగళవారం

నిట్టూర్పు...
నిజం నిద్రావస్తలో చేరి
ఆత్మ స్మశానంలో
సజీవ సమాదైంది ....
అప్పుడప్పుడు
శ్వాస పిలుస్తూ
హృదయ వేదనతో
పొటి పడుతూ ..
నిట్టూర్పు రూపంలో
వెలుపలికి వస్తుంది ...
బయిటి ప్రపంచాన్ని చూస్తూ..
బయంతో వణుకుతూ..
సమాధి స్థానమే
తనకు శ్రేయస్కరమని
బ్రమించి " నిట్టుర్పు" కు
ఆయువు నిస్తూ...
తాను విగతమవుతుంది