17, జూన్ 2019, సోమవారం

"కలువకన్నె "
కలలన్నీ పండు వెన్నెలలయినవి
కలువ పూవుల తావుల చేరి ...
చెలుని తలపుల వలపుల మొహం
ఊరించే విరహానికి ఓపలేకున్నది ...
కొలనులోని చిరు అలల తాకిడికి
అరమూసిన రెప్పల అంచున ఆశలు
చెక్కిళ్ళ చెమరింపులై నిలిచి
ప్రతిబింబమల్లె నిలిపెను సఖుని రూపాన్ని !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి