17, జూన్ 2019, సోమవారం

"నాకు నేను.."
నావరకు నేను
ఓ పాటనే పాడుకున్నా..
రాగం తెలియదు
రచన తెలియదు
అయినా ...
తన్మయత్వమే పొందాను
నాకు నేను ...
నీవొచ్చావు ..
శృతి కలిపావు
ఆహా ...ఓహో ..
అనుకున్నా ...
ప్రేమను బంధాన్ని
ఉరిగా బిగించి
గొంతు నొక్కి వెళ్ళిపోయావు ...
ఏరులై పారుతున్న
కన్నీటిలో మృతమై తేలాను ...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి