2, నవంబర్ 2014, ఆదివారం

మనసులో....


మనసులో దోబుచులాడు మాట ..
పెదవులు దాటానిది....
అది మాత్రం...ఎప్పుడూ..
మౌనాన్నే ఆశ్రయిస్తుంది..
తెలుసుకొనలేని నీవు......
నాకనురాగం విలువ తెలియదన్నావు..
కనీసం... కంటి కోలుకుల్లో నిలిచిన
కన్నీటికి భాష్యం చెప్పు చాలు...ప్రియా....!!


ఎద గదిలో నిక్షిప్తమై ఉన్న
ప్రేమ నిధిని నీకు దారా దత్తం చేస్తాను..ప్రియా!!
వరలక్ష్మీ దేవి "


తల్లీ వరలక్ష్మీ దేవి..!
మావిడాకుల తోరణాల సన్నాయితో స్వాగతం చేతున్నానమ్మా ....
మంచి ముత్యాల సరులవోలె రంగవల్లులు తీర్చి మరీ.. తల్లీ వరలక్ష్మీ దేవి !


మణిమయసువర్ణ ప్రతిమను మనసున నిలుపుకొని...
పసిడి వర్ణపు పుష్పాల నీకలంకారం చేసితినే తల్లీ వరలక్ష్మీ దేవి.!

శ్రవణమాసపు శుక్రవార శుభఘడియలలో ..మది గదిలో కొలువు తీర్చి
ఆచమనము...అష్టోత్తర అర్చనలతో నిను పుజింతునే తల్లీ వరలక్ష్మీ దేవి !

పరమేశ్వరుడు తన ప్రియపత్ని అయిన పార్వతికి..లోకాల గాచుటకు
ప్రియమారా నీ వ్రత విధానము తెలియజేసేనే తల్లీ వరలక్ష్మీ దేవి ..!

చారుమతి స్వప్నమున దరిశన మిచ్చినావట అనుగ్రహముతో ..
ప్రీతి వాక్కులు పలుకుతూ..నిను సేవించమని చెప్పినావట తల్లీ వరలక్ష్మీ దేవి..!

సంతసించిన ఆ ఇల్లాలు తన చెలులతోగూడి భక్తి శ్రద్దలతో ..
వ్రతమాచరించినంతనే..సౌభాగ్యాల కోరి వరము లిచ్చినావట తల్లీ వరలక్ష్మీ దేవి ..!

నీ కృపాకటాక్షాల భారాన్ని మోస్తూ..చల్లని చూపుల రేఖలు..
మాపై ప్రసరింపజేయ.. మాఇంట ఆసీనురాలివి కావే తల్లీ వరలక్ష్మీ దేవి ..!

నవ సూత్రముతో బందించుకొని ...నవనైవేద్యముల నివేదన చేసితినే తల్లీ వరలక్ష్మీ దేవి !

"ఓ బొజ్జ గణపయ్య ...


"ఓ బొజ్జ గణపయ్య ...నీ బంటునేనయ్య " అని తలపుల నిలుపుకొని..
బంకమట్టితో..మనసున మెదులు నీ రూపమును తీర్చిదిద్దునునయ్యా వినాయకా .. !
...
మారేడు జిల్లేడు మొదలగు పరి పరి విదములగు పత్రితో..నీకాసనము వేసి..
గన్నేరు...నందివర్దనం...చేమంతులు...ముద్దబంతులే కాదు...
ఎదలో పూసిన భక్తికుసుమాల..నీకలంకారము చేసి...
ప్రాణ పటిష్ట గావించి...అష్టోత్తర అర్చనలతో...నిను పూజింతునయ్యా వినాయకా..!.

మోదుకలు...ఉండ్రాళ్ళు...గారెలు ..బూరెలు...పరమాన్నాలతో పాటు..
అటుకులు ..కొబ్బరి పలుకులు..బెల్లం కలిపి..నీకు నివేదన చేసేదనయ్యా..
శమంతకమణి కథ చదివి...అక్షతలు తలపై వేసుకొని ..
చంద్రుని చూసిన నిందను బాపుకొనెదనయ్యా వినాయకా.....!

తొలిపూజలు అందుకొంటూ ...విజ్ఞములను తొలగించే గణనాధుడవు...
మరుగుజ్జు రూపమయినా..... బహుసుందరాంగుడవు..
వాడవాడలా కొలువు తీరి...నవరాత్రుల శోభతో భాసిల్లెదవు.
నిమజ్జనము చెంది.. నీటిలో కలిసినా..లోకాల రక్షించువాడవుగదయ్యా.. వినాయకా ..!
.
పర్యావరణ పరిరక్షణగావించుటకు ...సహజసిద్ది గణేషుడను ..
ప్రతి ఇంట నిలపుకొని ..చవితిలోన చల్లగ అర్చించెదరు గదయ్యా వినాయకా ...!!
సాంప్రదాయమా.....!


వెన్నెలముద్దను తలపొసే.. నందివర్ధం లాంటి అమ్మాయి..
కన్నవారికపురూపమై...ఆశలరెక్కలనావాసం చేసుకొని
ఆత్మస్థైర్యంతో....ఆకాశంలొ విహరిస్తూ ... అబలను కాను.....
ఆడపిల్లా..!! అన్నవాళ్ళకి ఆబ్బో!! అనిపించిన అమ్మాయి...

పెళ్ళి విషయంలో...అమ్మాయి తల్లితండ్రుల బేరాలు..
"అబ్బాయి ఎంత చదివాడు...జితం ఎంత...హైటు..వెయిటు..
కులం...గోత్రం..?" ఆపై.....ఇక..."ఎంతలో ఉన్నారు..(కట్నం)?
ఇన్ని ప్రశ్నలతో సాగుతుంది..వేట..పెళ్లి కొడుకులది..
ఇది దురాచారామా....ఆడపిల్ల శాపమా..అనుకుంటే...
ముందు మారాలి ఆ
డపిల్లల తల్లితండ్రులు..
భవిష్యత్తుకై పునాదులేసి,, ఉన్నత విద్యలందించినట్టే..
ఆత్మీయతల లోగిలున్న కాపురానికై..
కట్నపిచాచిని వారి నడుమ చేరనివ్వకూడదు..
"కార్యేషు దాసి "అన్న పదాలను మాత్రం గుర్తుపెట్టుకొని..
బానిసగా భార్యను తెచ్చిపెట్టుకొని...
"నిన్ను పోషిస్తున్నా...నీ పుట్టింటోళ్ళు ఏమిచ్చారు..."
అంటూ..వేధించే...పురుష పుంగవులు...కోకొల్లలు....
తాంబూలం సాంప్రదాయాన్ని...తాయిలంలా భావిస్తూ..
అమ్మాయిని ఆటబొమ్మని చేసే దురహంకార రాక్షసులు..
నిర్జీవమవనీయక అమ్మతనాన్ని.. కాపాడుకుందాం.. !