19, మార్చి 2014, బుధవారం

వాలు జడలో....


తీగపై విరిసిన మల్లెలన్ని....ఒక్క చోటచేరి గుస గుసలాడే...
మరువం ...కనకంబరాలతో జత కలిసి...వాలు జడలో...
...
ముస్తాబయిన ముగ్ధరాలి అందాలకి దాసోహం అంటూ...
పరిమళాలను విందు చేస్తూ... ఒద్దికగా ఒదిగాయి ...వాలు జడలో...
సత్య భామ కోపాన్ని సైతం తన విసురులో దాచుకుంటూ.....
కృష్ణయ్య చెలిమిని తెలియజేసే వయ్యారాలున్నాయి వాలుజడలో...
శాస్త్రీయ నాట్యాలలో....తీరయిన కదలికలకు ...
అపరమితమైన ప్రధాన్యతలు కలిగున్నాయి ....వాలుజడలో...
సాంప్రదాయ తెలుగింటి అమ్మాయి అందాలను ...
ఆ సాంతం పెంచేసే......పూలపుప్పొడి రాగాలుకలవు ...వాలుజడలో...
ఆశల హరివిల్లును దోసిన పట్టుకొన్న ...పెళ్లికూతురి పులకింతలు ...
కన్నేతనంనునుసిగ్గులతో పెనవేసిన సింగారాలున్నాయి....వాలుజడలో...
తొలిసూలు...కడుపున పాపడు...కళ్ళతో తన్నుతుంటే....
కాబోయేఅమ్మ పొందే అపురూపమయిన సీమంతాలున్నాయి...వాలుజడలో...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి