7, సెప్టెంబర్ 2017, గురువారం



అమ్మవే..నమ్మా!!.
ప్రశాంత వదనంతో..
కళ్ళతో వెన్నెలలు..
మొలక నవ్వులతో..
మల్లెలను వెదజల్లే అమ్మ
గోడ మీద పటంలో నుంచి 
నా వైపు చూస్తూ...
" ఎరా బంగారు...
నేనంటే నీకంత అలుసా...
నా ఫోటోకి బొట్టు పెట్టవు..
దండ వెయ్యవు...కనీసం..
ఏడాదికి ఒక్కసారి...అయినా..
నాకు భోజనం పెట్టవు..."
అంటూ...కోపంగా చూస్తూ ఉంది..
"అయ్యో! 
పిచ్చి అమ్మ..నీవు
దేహాన్ని వదిలి వెళ్లావు గానీ..
అనుబంధాలని వదలలేదు కదా..
నీలోని ఓ కణాన్నే నేను..
నీ ఊపిరితో పెరిగాను..
నీ ఊసులతో ఎదిగాను...
నీ పలుకలలో ఓ పదాన్నే నేను కదమ్మా!
లోకం అంటుంది నీవు చనిపోయావని..
కానీ...నాలో...లోలో..ఎప్పుడూ..
సజీవంగానే ఉంటావమ్మా...
తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఎలా
నన్ను నిర్దేశించావో..అలానే..
ఇప్పుడు కూడా నేను వేసే ప్రతి అడుగులోనూ..
నీవు నేర్పిన పాఠం అరచేయిగా మారి 
నా జీవితగమనాన్ని సుగమనం చేస్తుందమ్మా..!
అందుకే ..నమ్మా...
నీ పటానికి బొట్టు పెట్టను.. దండ వెయ్యను...
ఎదలోను..ఎదుట కూడా నీవు నాకెప్పుడు..
అ..ఆ..లు నేర్పుతున్న అమ్మవే..నమ్మా!!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి