8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

రోజా పూవు..
విరిసిన గులాబీని చూస్తూ..
మనమనుకుంటాం...
ఎంత అందంగా ..
మనల్నిచూసి
నవ్వుతూ..ఉందని....
నిజానికి అది..
గజగజ వణుకుతుంది..
ఎక్కడ తనని కోస్తారో..
కోసిన వాళ్ళు ఊరికే ఉండరు కదా..
జవరాలి సిగన ఉంచి మురుస్తారో..
పూజలో స్వామికి సమర్పించి
బ్రతుకుకు అర్ధం చెపుతారో..
గాజుకూజాలో అలంకార ప్రియంగా వాడుతారో..
బుట్టలలో మరిన్ని గులాబీలతో జతచేసి..
అంగడి సరుకుగా అమ్ముతారో..
నిర్జీవ శరీరంపై ఉంచి..నివాళులిస్తారో..
రెక్కలు తుంచి యంత్రాలలో వేసి..
తైలం తీసి ..పిప్పి చేస్తారో..
అనుకుంటూ..ఎన్నో..ఎన్నెన్నో..
భయాలు..
ఆకు ఆకు చాటు చేస్తూ..
పొడుచుకొచ్చే ముళ్ళని కంచెగా చేసి..
కాపాడాలనే తపనతో...తన తల్లి
తన ఉనికిని కూడా గుర్తించ నియ్యకుండా..
అమ్మ స్పర్సనుంచి వేరు చేస్తారనే భయాలు..
పులిని చూసిన లేడివలె భీతితో....
ప్చ్..
పరిగెత్తలేదుగా..మరి..
మనకి ఆనందాన్ని ఇవ్వటం కోసం..
పూసిన ప్రతి పూవు...ఎప్పుడూ ..
బలి అవుతూనే ఉంటుంది ...
అర్పణలో దాగిన ఆనందాన్ని వెతుక్కుంటూ..
పలు రేకుల రోజాపూవు...
కనుల బాసల కలిమియే నీవు..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి