8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

కోపం...తాపం..
మనువు నుంచి మొదలు 
మనిషి రూపము మాకిచ్చినావు ..
ఆ రూపులోనే నిన్ను ....
దేవునిగా కొలుస్తున్నాము..
కృష్ణ పక్షం...శుక్ల పక్షం అంటూ..
తరుగుతూ..పెరుగుతూ..ఉండే
నెలవంకని సిగన చుట్టి మెరిపిస్తున్నావు..
సుఖ దుఃఖాల నిలయం జీవితం
అని తెలియజెపుతూ..
సృష్టి ..స్తితి ..లయ కారకుడయిన
భానుని అగ్ని శిలలు నీలో నుంచి
జనించినవే కదా ఈశ్వరా..
ఆ తాపం తగ్గించు కొందుకే..
గంగమ్మని తలపై నుంచుకొంటివి...
ప్రేమ తత్వం తెలుపుటకే..
నీకై తనువు చాలించిన సతి..
పార్వతిగా తిరిగి నీకు ఆలి అయింది..
నీలో సగం తనకిచ్చి నీవు..
అర్ధనారీశ్వరుడవి అయినావు...మహా దేవా..
ఐక్యమయిన ఆత్మల సంబంధం
ఆలుమగల అనుబంధం ..
అలకలయినా...అలింగనాలయినా..
మూతి విరుపులు ..
మగని క్రిగంటి చూపుల మెరుపుల కొరకే..
ఈ తత్వం తెలియదా నీకు శంకరా....
(కొస మెరుపు ...)
మరెందుకయా...
ఆవకాయ వడ్డించ లేదనా ..అమ్మ మీద కోపం..!!
ఏ సి రిపేరు చేయించ లేదనా తల్లీ...ఈ తాపం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి