8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

పుష్పకవిమానమే...మరి...!
ముల్లోకాల్లోనూ అతి ధనవంతుడయిన కుబేరుని
మనో భావాల సమాహారమే...పుష్పకవిమానం ..
స్వర్గాన్ని జయించిన రావణుని చేతులలో చిక్కి..
భువికి ఏతెంచి...లంకానగరానికి శోభగా నిలిచింది పుష్పక విమానం.
.
వాయువేగాన్ని మించిన మనోవేగం కలదై
సీతాపహరణలో ముఖ్య పాత్ర పోషించి..
మూగగా విలపించింది... పుష్పక విమానం..
రావణసంహార అనంతరం...సీతాలక్ష్మణ ఆంజనేయులే కాక..
విభీషణ సుగ్రీవ ..మొదలగు .. అతిరధ మహాయోధుకను.. తనలో..
పొదువుకుని.. మరొకరికి చోటు చూపిస్తున్న అక్షయం .. పుష్పక విమానం..
అన్నగారి రాక ఘడియ ఆలస్యం అయినదని....
ప్రాణ త్యాగానికి సిద్దపడ్డ భరతుని ఆనందసాగరాన తేలింపజేస్తూ..
తళతళమెరుపులతో..మింటి నుంచి మేఘంలా వాలింది పుష్పకవిమానం...
భక్తిరస ఆస్వాదనలో ఇహం మరచి..పరమాత్మను తమలో
దాచుకున్న భక్తాగ్రేసరులకు ముక్తినొసగుతూ...
సుశరీరాన్ని మోసుకెళ్ళే మహిమాన్వి ..పుష్పక విమానం..
ఇతిహాసాన్ని చదువుకుంటూ... ఇవి ఇహంలో లేవు అనుకున్నా...
ప్రతి మనిషి మనసు కూడా పుష్పకవిమానమే..
పుట్టిననాటి నుండి.. సమస్యల వలయాలు ..
వేదనలు...రోదనలు.. కలతలు కన్నీళ్ళు..
ఆరాధనలు, ఆవేదనలు... ఆనందాలు ..అతిశయాలు...
జవాబు దొరకని ప్రశ్నలు.. జీవం మరచిన జీవితాలు ....
స్వార్ధంతో పక్కవాడిని పడగొట్టాలనే తాపత్రయాలు...
ఎన్ని ఎన్నిటి నైనా..అలవోకగా మోసే మనసు పుష్పకవిమానమే.మరి..!!
***************** *************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి