7, సెప్టెంబర్ 2017, గురువారం


కిందకి జారబడిన ముత్యాల బుట్టలు గుసగుసల అల్లరులు చేస్తూ..
ఊగిసలాడు తున్నాయి..మెల్లగా ..మత్తుగా..
కళ్యాణ తిలకంతో పోటీపడుతూ...
ఎర్ర రంగు పాపడ బిళ్ళ నుదురును
ముద్దాడుతూ..మురిపిస్తుంది..
బిగువైన పరువాలకి తోడు..బరువైనవా ..
అనిపిస్తున్నాయి బంగారు గొలుసులు..
లేనట్టుండే నడుమును చుట్టేసిన వడ్డాణం..
ఒళ్ళంతా తడుముతూ..పసుపు రంగు కంచి పట్టు చీర...
కావాలని కుట్టించుకున్న మల్లెపూల జడ..అక్కడక్కడ గులాబీలు..
నిలువెత్తు నిండుగా ముస్తాబయిన తనని తాను...
ఓరకంట నిలువుటద్దంలో చూసుకుంటూ.. “ఇన్నాళ్ళూ దాచిన కన్నెతనం..
కానుక చేస్తూ...ఇక పై వారు నేనవుతా..వారిలో నే జీవిస్తా...’
మనసుతో మాట చెప్పుకుంటూ..దోసిట్లోకి కొబ్బరి బోండాం అందుకొని..
వెంట వచ్చే ముత్తైదువులతోపాటు..మెల్లని అడుగులు వేస్తుంది..నవ వధువు..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి