8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నా కొక్కదానికే తెలుసు..!
వేకువలో విచ్చిన కిరణం ..
కమ్మిన మబ్బులలో ....
దాగుతుందా...
తన ప్రసరణను అపుతుందా...
వీక్షించే కనులలో..
వేయని రెప్పల మాటున ..
నీకై శ్వాసించె నా ఆత్మ చప్పుడు
నా కొక్కదానికే తెలుసు..
జీవిత సమరంలో ...
గెలుపు గురుతులు కానరాక..
ఓటమితో చెలిమి చేయలేక..
నీ మదిలో జరిగే సంగర్షణల జ్వాలలో ...
ముసురుతున్న నల్లటి పొగ సెగలో..
సైతం నా తోడు కోసం పరితపించే..
నీ మనస్తత్వం...
నా కొక్కదానికే తెలుసు...!
ఎరుపెక్కిన నీ కన్నులు ...
లోలోన కోరుకుంటున్నాయని..
నా ప్రేమస్పర్శల ఆలంబనని....
కసురుకుంటున్నా....నీ మాటల వెనుక...
నన్ను పోగొట్టుకుంటానేమో ...
అన్న బయం దాగున్నదని ...
నా కొక్కదానికే తెలుసు..!
‘నాతిచరామి ‘ అన్న నీ మత్రోచ్చారణకర్ధం...
మనము ఒకటిగా ఐక్యమవటమే...
.మన్నింపులు ...కంటి చెమరింపులు
మనలను పెనవేయు బందాలే...
సమాజస్థితిగతులలతో పోరాటం చేస్తూ..
జీవించే బలాన్ని తెచ్చుకుని..
మన గమ్యం మనమే అన్న సత్యం
మన ద్యేయమై...
సంసారవీణను శృతి చేసుకుంటూ..
మృదు మధుర గీతాల ఆలాపనల ..
రాగఝరిలో ఓలలాడుతూ...నీలోనేనుంటానని...
నాకోక్కదనికే తెలుసు...!!
**************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి