7, సెప్టెంబర్ 2017, గురువారం


చీరకట్టు..

భారతీయ సంస్కృతికి వరప్రసాదంగా లభించిన చీర...
అతివల అందాలను తనలో దాచుకుని దాగుడుమూతలాడించేదే చీరకట్టు..
అమ్మాయి అనగానే లక్ష్మీ రూపం కనులముందు ఉంటె..
ఆ దేవతామూర్తులకు అలంకారభూషితమయినది ...చీరకట్టు...
దేశానికి నలుదిక్కుల ఉన్న ప్రాంతాలవారిగా...
వారి వారి అభిరుచికి తగినట్టుగా సింగారాల నెలవైనది చీరకట్టు..
పసిదానికి పసందైనది అయితే....పడుచుదానికి సొగసైనది అయి..
ముగ్ధకు మనోహర రూపమిస్తూ...ముదిత ఆహార్య లాస్యమైనది చీరకట్టు..
చేనేత కార్మికుల అద్భుత కళా సృష్టి ...నేత చీరలయితే..
వేసవిలో ఉపశమనంగా ఉంటూ..మెత్తగా ఒంటినంటి పెట్టుకునేదే..చీరకట్టు..
సాంప్రదాయానికి తగినట్టుగా....పలు రకాల చీరలయితే....
పండుగలలో ఇంతులను పూబంతులుగా మలచేదే చీరకట్టు...
ప్రాంతీయతను ప్రతిబింబింపజేస్తున్నా...పలకరింపులకు స్పందనలై..
కుల మతాలకతీతంగా .....అరమరికలు దూరం చేసేదే చీరకట్టు..
ఆధునికత ఎంతగా ప్రభావితం చేసినా..యువతులకు ...
అమ్మాయితనానికి అర్ధమై ..యువకుల గుండెలకు గాయంచేసేదే చీరకట్టు..
సీతమ్మను సైతం చింతలో పడవేసి..పట్టాభిషేకసమయంలో....
‘ఏం చీర కట్టుకోను స్వామి?..’ అని అడిగింపజేసినదట ఈ చీరకట్టు..
యుగాలు మారినా...శతాభ్దాలు గడిచినా...విదేశీయులకు సైతం
అబ్బురమనిపిస్తూ...చేతులెత్తి నమస్కరింపజేసుకునేదే..చీరకట్టు..!!!
********* **************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి