12, డిసెంబర్ 2014, శుక్రవారం

    "జై జవాన్..."
    జై జవాన్ అని నినదించటమేనా....
    వారి బాగోగుల గూర్చి ఆలోచిస్తున్నారా...ఒక్కరైనా..
    ఉగ్గుపాలతో అమ్మ పెట్టిన దేశభక్తిని అరిగించుకొని..
    అమ్మని విడిచి...భారతమ్మ ఒడిని కాపాడుకుందుకు ...
    కష్టసాద్యమైన పరీక్షల కోర్చి..
    జవానుగా తుపాకందుకున్న వీరుడు మన జవాను..
    కుల మతాలకతీతంగా ...అందరూ ఒక్కటిగా తలస్తూ...
    తాను ఒంటరి అయినా...తనతోటివారే
    తనవారుగా భావిస్తూ...
    క్రమశిక్షణలో కర్తవ్య ధీరుడు మన జవాను..
    రణరంగంలో రాళ్లయినా...గుట్టలయినా..
    శత్రువులకెదురు నిలిచి..చివరి శ్వాసను సైతం
    నేలమ్మకంకితమివ్వాలని
    తలచే సూరుడు మన జవాను..
    వారి త్యాగనిరతిని తలచుకొని..
    ఒక్కసారి మనని మనం ప్రశ్నించుకుని..
    మనలోని మానవతని మేల్కొల్పుదాం ..
    ప్రతి ఒక్కరము ఒక సైనికునివలె నిలిచి
    చీకటిని పారద్రోలు దివిటీలమై....
    భారతమాత కన్నుల వెలుగుల వెన్నెల నింపుదాం..!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి