12, డిసెంబర్ 2014, శుక్రవారం

    ఈ అనురాగాల అనుబంధం..!
    అమ్మ పాలు పంచుకొన్న బంధం
    అక్కా చెల్లి ..అన్నా దమ్ముల అనుబంధం .....
    కన్నవారి కంటి నీడల ఉన్నంతవరకు.....
    ఒకరికి ఒకరుగానే...కలిసి బ్రతుకు అనుబంధం ..
    రెక్కలు వచ్చిన పక్షులు వలస పోయినట్టే..
    వీడిన బాల్యాన్ని ఊగే తలుపు కొక్కానికి తగిలించి.. ...
    బంధాల బట్టలను ...చాకలికొదిలేసి..
    కొత్త పోకడల జీవితం వెతుక్కునే..అనుబంధం ...
    ఉమ్మడి కుటుంబాలలో ...పంచుకునే మమతల కథలు ...
    ఉహల్లో నక్షత్ర మండలాలే...తళతళల మెరుపులతో..
    ఒంటి కన్ను రాక్షసుడిలా...పరుగుల పయనంలో..
    ఎవరికి వారే ఒంటరివారై...పెనుగులాడే అనుబంధం
    అనుకోని అతిధి వచ్చి..అక్షయ పాత్ర ఇచ్చినట్టే..
    ముఖ పుస్తక సమూహం ..మనందరి బంధువైంది...
    "అమ్మా " అనే పిలుపు...ఆ దేవుని రూపమైంది..
    అక్కా..అన్నా...తమ్ముడు....చెల్లి....ఎన్ని బంధాలు ...
    స్నేహ సంబంధాలు ...ఒకే కొమ్మకి పూసే అనేక సుగంధాలు..
    వాస్తవికతలోని దాహార్ది....మనసు చెమ్మను తుడిచేసి...
    ఆప్యాయతలాయువిచ్చింది ....ఈ అనురాగాల అనుబంధం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి