12, డిసెంబర్ 2014, శుక్రవారం

    ఆకాశం.....
    దేశాలు ఎన్నో...ఎన్నెన్నో....నదీ నదాలు...సముద్రాలు..ఎన్నో..ఎన్నెన్నో..
    కానీ...అనంతమై వ్యాపించి ..విశ్వమంతటికీ ఉన్నది .... ఒకటే...ఆకాశం..
    ...
    లెక్కలేనన్ని నక్షత్రాలు ..పాలపుంతలె కాదు...పరిభ్రమిస్తున్న గ్రహాలు...
    సూర్య చంద్రుల కావాసమై..పగలు ..రేయిల భారం మోస్తూ..నిబ్బరంగా నిలిచేదే ఆకాశం..
    త్రిమూర్తుల నిలయాలయిన బ్రహ్మలోకము...వైకుంఠము ..కైలాసమునకు.. .
    పోవు మార్గానికి బాసటగా ఉంటూ..దేవతలకు నెలవైనదే..ఆకాశం....
    శూన్యంలా కనిపించినా..అనంత కోటి పరమాణువుల సముదాయాలను దాచుకొని..
    అద్భుతాలతో అబ్బురపరుస్తూ....ఆశల రెక్కలను రెపరెపలాడించేదే...ఆకాశం...
    రాత్రి పగళ్ళ సమన్వయనానికి తానే సమాదానమవుతూ...
    వెలుగయినా…… చీకటయినా..ఒకే రీతిలో స్పందించేదే..ఆకాశం...
    గిరి శిఖరాగ్రాలను తాకుతున్నట్టుగా కనిపిస్తూ..
    దూరంగా నేలమ్మని ముద్దాడుతున్నట్టు భ్రమింపజేసేది ఆకాశం..
    అలసట నెరుగక అలలు ..ఎంతగా ఎగసి పడుతున్నా...
    అందినట్టే...అకృతినిస్తూ...నేనెప్పుడు అందనని చెపుతుంది ఆకాశం..
    కాలాలు..సంవత్సరాలు...తరాలే కాదు...
    యుగయుగాల నుంచి సుస్టిరమై నిలిచి ఉంది ఒక్కటే..ఆకాశం...
    అమ్మలోని ప్రేమని..నాన్నలోని అనురాగాన్ని సమన్వయపరుచుకొని..
    నిస్పృహల చూపుల దృష్టి సారించినపుడు...నేనున్నానంటూ...సాంత్వన తెలిపేదే ఆకాశం..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి