12, డిసెంబర్ 2014, శుక్రవారం

    సాహితీ సేవ చిత్ర కవిత -5 ఫలితాలు
    ద్వితీయ ఉత్తమ కవిత :
    ...
    గోడ గడియారం -శ్రీమతి సుజాత తిమ్మన గారు
    శీమతి సుజాత గారికి అభినందనలు
    Sujatha Thimmana
    గోడ గడియారం.....
    టింగ్ టింగ్ మని గోడ గడియారం గంటలు కొట్టినప్పుడల్లా...
    లబ్ లబ్ మనే గుండె ..వెనక్కి తిరుగుతుందేమో అనిపిస్తుంది..
    తాతగారి ఇంటిలోని వారి తాతగారి కాలంనాటి గోడ గడియారం..
    ఊహ తెలిసినప్పటి నుంచి...దానితో పెనవేసుకున్న అనుబంధం...
    సెకను ముల్లు టిక్ టిక్ మంటూ...నిమిషాల్లోకి కలిసిపోతూ ఉంటే..
    నిముషాల ముల్లు గంటల్లోకి...గంట కాగానే...ఊగుతున్న పెండ్యూలం
    ఊరంతా వినిపించేలా గంట కొడుతూ ఉంటే... నాకు కాలం తెలియని వైనం..
    కొంగు చాటులో దాక్కుని..గుప్పిట అమ్మ మెడలోని తాళి ఒడిసిపట్టుకొని..
    గుమ్ముగా అమ్మ పాలతో బొజ్జ నింపుకుంటున్నా...
    గంటల మోతకి ఉలికి పడి .. గడియారం కేసి చూస్తూ..అమ్మని విడిచేసిన వైనం.
    వీధరుగు మీద గచ్చకాయలాడుకుంటున్నా...వాకిట్లో తొక్కుడు బిళ్ళ ఆడుతున్నా..
    వేపచెట్టు కింద తాడాటలాడుతున్నా...నిశిరాతిరి నిద్రపోతూ ఉన్నా..
    గడియారం ముల్లుకు అతుక్కున్న మనసు.. గంట కొట్టగానే చేరుకునే వైనం..
    కాలాన్ని కొలిచే గడియారం..కాలగతిలో .. అమ్మానాన్నలని ఆక్సిడెంట్లో
    అకారణంగా తీసుకెళ్ళినపుడు.. ఏమి తెలియని పసితనంలో కుడా ..
    ఒంటరిని చేయక ..క్షణం విడువని నేస్తం.. అనాధని చెయ్యనివ్వని వైనం..
    చదువులకని పట్నం వచ్చినా... ఆత్మనొదిలేసిపోతున్న భావన...
    సెలవులు రాగానే...ఇంట్లో అడుగుపెడుతూనే గడియారంకేసి చూస్తూ ఉంటే...
    గుబురుమీసాల తాతయ్య ...గుంభనంగా నవ్వుతూ...’నాకంటే..నీకు
    ఆ గడియారమే..ఎక్కువరా బుజ్జి...!’ అని సున్నితంగా తలపై మొట్టిన వైనం..
    పెళ్లి చూపులని తెలిసి....అందరూ హడావిడిగా తిరుగుతూ ఉంటె...
    నిశ్శబ్ద తరంగాలు ఎదను మీటుతూ ఉన్నా...
    ఊహల రెక్కలను గడియారం ముల్లులో బందించేసిన వైనం..
    ఊపిరి పోసుకున్నప్పటినుండి..నాతొ పాటే ఉంటూ..
    నా ఎదుగుదలకి నిలువెత్తు సాక్ష్యం.. అయిన బాల్యంలోని నేస్తం..
    అప్పగింతలతో..'.ఆడపిల్లని ' 'ఈడ పిల్ల ' నయినా..పుట్టింటి భరణంగా వచ్చి
    ఈ నాటికి..నా జీవిత గమనంలో..తాను ఓ పాత్ర గా..నా ఆత్మ అయిన వైనం..!
    See More
    Like · ·

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి