3, జూన్ 2014, మంగళవారం

తపస్సు చేస్తా...!!


"ఆ మందారం
ఎంత బాగుందో..."
అన్న మాట పూర్తి కాకమునిపే...
పక్కింటి గోడ దూకి కోసుకోచ్చావు......
మురిపెంగా జేడలో 

తురుముకుంటూ ఉంటే
నీ కనుల మెరిసిన మెరుపులు

 ఇప్పటికి గురుతే..మరి..
అత్తిచ్చిత పప్పుండని
కాకెంగిలి చేసి
సగం కొరికి ....
మిగిలిన సగం
నా నోట్లో పెట్టావు...
ఆ తీపి నాకింకా జ్ఞాపకమే...
సెలవుల్లో...
సముద్రపుటోడ్డుకు పోయినపుడు
మనిద్దరం ఒక జట్టుగా..
మనకోసం..మనం
ఇసుక గూడు కట్టుకొని...
విశాల మైన పెరడులో
సేదతిరుతూ...ఊసులెన్నో
చెప్పుకుందామనుకుంటూ..
మనలో మనమే...
ఎన్నెన్ని ఆటలాడుకున్నాం
అవన్నీ నిజాలే అని ...
మనసులో నాటేసుకొని...
ప్రతి సెలవులకూ ...
ఎదురు చూస్తూనే ఉన్నా.....
సెలవులు వస్తూ ఉన్నాయి..
అయిపోతూ ఉన్నాయి...
నీవు మాత్రం రావటం లేదు...
నల్లని పాయలలో...
వెండిలా మెరిసే వెంట్రుకలు
వెక్కిరిస్తున్నాయి...
ఛాయ తగ్గిన మేను
కలవర పెడుతుంది ..
కలువల కనులలో...
చెమ్మ ఆరనిదయింది...
బరువెక్కిన గుండె...
ఇక పనిచేయనని
మారాము చేస్తుంది...
సాగి పోయే ఆ మేఘానికి
చెప్పాను..ఓ సారి ...
మా బావ దగ్గరికి వెళ్ళమని
కబురందుకొని....
ఒక్కసారి..
ఇటు రావా బావా..
నీ చేతిలో నా శ్వాస నుంచి..
మరు జన్మ కొరకు తపస్సు చేస్తా...!!...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి