29, జూన్ 2014, ఆదివారం

అమ్మా..
ఊపిరి పోసుకున్న క్షణం నుంచీ
ఆకృతిని దాల్చేవరకు...
ఉమ్మనీటి సంద్రంలో......
గర్భకోశ కుహరంలో...
మాయఅనే రక్షకభట
సంరక్షణలో...
అహరహరము కాపాడుతుంది...
పదినెలలు నిను
తన కడుపున మోస్తూ...
నీ జనన సమయంలో..
తాను మరణాన్ని ఆహ్వానిస్తూ...

మృత్యుముఖాన్ని కాలదన్నుతూ...
నీ లేత నవ్వులు చూసి
మురిసిపోయే అమ్మ ...
అనుభందమే కాదు...
పెగును పంచిన అమ్మ ..
అనేక కణాల సముదాయాన్ని
నీ కందించిన అమృత మూర్తి..
అమ్మ నుంచి వేరయినా గానీ..
పదిల పరుచుకున్న బొడ్డుపేగు..(స్టెమ్‌ సెల్‌)
నీకే కాదు..నీ వారినందరికీ..
తన కణాలనందించి...
సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తుంది...
చైతన్య వంతమై...
ప్రజలు మేలుకొని...
వైద్య విజ్ఞానం అందించిన
ఈ మహద్వకాసాన్ని సద్వినియోగం చేసుకుంటూ...
అమృత పానాన్ని ఆస్వాదించండి...
ఆ బ్రహ్మే కాదు...
మా అమ్మ కూడా...
"ఓ బ్రహ్మ " అని నిరూపిస్తూ....!!
+++++++++++++++++++++++
నాన్నా...!!
అమ్మ కడుపులో ఉపిరి పోసుకున్నా...
ప్రసవ వేదనని ఇచ్చి...మరీ
జన్మని పొందాను....
ఆట పాటల ఆలనలలో..
అన్నీ మరచి బాల్యాన్ని
ఇంద్రధనుస్సు రంగులలో...
మిళితం చేసి మరీ
అనుభూతిస్తున్న తరుణం...
పెనుతుఫానులా ....వచ్చి చేరింది...
"లుకేమియా" అట...
నా దేహంలో.....
అమ్మా నాన్నల కళ్ళవెంట కారే..కన్నీళ్ళు...ఆ గంగా యమునలే...
స్టెమ్సెల్ బ్యాంకింగ్ లో నేను పుట్టగానే..
నాన్న నా బొడ్డు పేగు దాచి ఉంచారట...
అందుకే...నాన్నబయాన్ని పారద్రోలి..
అనుకూలమైన ట్రీట్మెంట్ ఇప్పించారు...
ఆ స్టెమ్సెల్ కణజాలాలను నాలోప్రావేసింప జేసి...
నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారు..
మృత్యువు తో పోరాడిన నేను..
తిరిగి ముందు జోవితాన్ని
అందుకున్నాను...నాన్న...
ఇది మీరిచ్చిన జీవితం...
తిర్చుకోలేని ఋణం....
మరు జన్మంటూ ఉంటె..
మీకు తల్లినై....
ఒడిని పంచుతా నాన్నా....!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి