3, జూన్ 2014, మంగళవారం

అమ్మా...అమ్మా...!!

ఎక్కడ ఉన్నవమ్మా......
ఎదలోతుల్లో....
చెదరని భాదని జత చేసి..
ఏమి ఎరుగని దానిలా...
తరలి వెళ్లి పోయావా...

నీ కంటి కొసలలో..
నాకోసం ఎప్పుడు
ఆరాటమే కనిపించేదే...

క్షణం నా దూరం
 బరించలేని తనం
 కనిపించేది..

 'ఆడ' పిల్ల నమ్మా...
అప్పగింతలు చేపితివి కదా..
ఇంటి పేరు మార్చు కొంటి కదా..
నేనాడపిల్లను కదా..అమ్మా...!!
అయినా..నాకోసం ..
కలవరిస్తూనే ఉండే దానివి..
ఆ కలవరింతల కసాయి తనం
 నిన్ను కభళించివేసిందే..
చివరి నీ పిలుపు ..
నాకందనీయకుండా..నీ గుండె పనిచేయడం మనేసిందే..

అమ్మా..అమ్మా అని
 ఇపుడెంతగా ఆక్రోశించినా..
నీ దరి చేరలేను..కానీ..చల్లని వెన్నెల కురిపిస్తూ...
నీ కన్నుల చూపులు
 ఎదరు గోడమీద...!!
గంధంపూల దండ తో నీవు...
మమతల సుగంధాలు వెదజల్లుతూ..!!..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి