29, జూన్ 2014, ఆదివారం

తెలుగు బిడ్డలు
పాండవ మధ్యముడు ..అర్జునుని లక్ష్యసిద్దిని ఆవాసంగా చేసుకొని...
అసేతుహిమాచలం...అవలీలగా అధిరోహించిన తెలుగు బిడ్డలు...
...
మొక్కవోని ధైర్యానికి మారురూపాలై...మంచుపర్వతం మారము చేసినా..
మంచి చేసుకొని మరీ.. గిరి శిఖరాన జెండా పాతిన తెలుగు బిడ్డలు ..
బంజారా బ్రతుకులైనా...గురుకులం శిక్షణలో సాటి లేని వారై..
అట్టడుగునుంచి...ఆకాశపుటంచులను తాకినారు తెలుగు బిడ్డలు ..
ప్రాయంలోనికి కూడా చేరని పసివయసు వారు..అయినా .
ఆపదలు లెక్కచేయక ఆత్మస్థైర్యం చూపినారు తెలుగు బిడ్డలు..
అమ్మాయని అలుసు చూపే లోకానికి ..పరిపూర్ణతని ఇస్తూ..
"మాలావత్ పూర్ణ " తనే ఒక ఎవరెస్ట్ శిఖరం అని చాటింది...
బడుగువారిని బానిసలుగా చూసే...ప్రజలకి ఆచ్చర్యానందాలనిస్తూ..
"ఆనంద్ కుమార్ " తనొక మట్టిలోమాణిక్యం అని తెలియజెప్పాడు..
కలలు కూడా తెలియని కన్నవారికి ..ప్రపంచ ఖ్యాతిని
దోసిట్లో పోస్తూ...విజయ కేతనం ఎగురవేస్తున్నారు...
జాతి గౌరవమే కాదు...దేశ ప్రగతికి సోపానమై..
భావి భవితకు ఆదర్శప్రాయ మయినారు..మన "తెలుగు బిడ్డలు"!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి