26, ఫిబ్రవరి 2018, సోమవారం

బావా..నాయుడు బావా..
నిగ్గులన్ని మూట గట్టి
పరువంతో జతచేసి ..
రెప్పలకింద దాచినానురా..
కంటి రెప్పలకింద దాచినానురా..
బావా..ఓ నాయుడు బావ..
నీవట్టా...కొరకొరా చూడమాకు రా...
బావా..ఓ నాయుడు బావా..!!
కర్రా బిళ్ళా ఆడుతూ ఉంటే..
ఇరిగిన మందారం కొమ్మ చూసి
నే నేడుస్తూ ఉంటే..
ఊరడించ ఆ కొమ్మను
మా ఇంటి ముందు నాటినావే
అప్పుడు..నీకు పదేళ్ళు ఉన్నప్పుడు..
చూడు.. ఇరగబూసే మందారం ఇప్పుడు..
కోసుకొని కొప్పులోన ముడుచుకొంటిరా బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా...
బావా ..నాయుడు బావా..!!
సంతలోన రంగు రంగుల మట్టి గాజులు ..
పట్నం ఎల్లి పట్టుచీర ..కాసులపేరు ..
అట్టు కొచ్చి మా అయ్యను అడుగుతావనుకొంటి ..
“నీ పిల్లను మనువాడుతానని ..”
ముక్కుకు ముక్కెర పెట్టుకొంటి..
నీకిష్టమని చెవులకు జూకాలు తగిలించుకొంటి..బావా..
నీ వట్టా కొరకొరా చూడమాకు రా ..
బావా ..నాయుడు బావా...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి