22, ఫిబ్రవరి 2016, సోమవారం

గోదాదేవి"

అనురాగము..ప్రేమ...భక్తి..కలయికల రూపమే..గోదాదేవి..
కృష్ణనామ శబ్దాన్ని శ్వాసించటమే జీవితమని ఎంచుకొన్న
భూదేవి..తననితాను పసిపాపగా మలచుకొని..
తులసీవనాన పురిటికందుగా.అగుపించి..
.పొత్తిళ్ళతో..విష్ణుచిత్తుని..ఒడి చేరింది...తల్లి భూమాత....
తండ్రిఅయి ఆమెను..గుండెల్లోపెట్టుకు పెంచుకున్నాడాయన..
కోవెలలో జరుగు శ్రీకృష్ణుని అర్చనాభిషేకాలకు...
తోటలోని ప్రతిచెట్టును అడిగి అడిగి మరి..
కోసి తెచ్చుకున్న అన్నివర్ణముల పూలను..
శ్రద్దాభక్తులతో...అతిసుందరమైన మాలలల్లి..
ముకుందునికి అలంకరించాలనుకొని..
"క్రితం జన్మలో సత్యభామను నేనే..
నా విభుడు ఈ మాధవుడే కదూ..!"
అని తలచుకొనుచు...పరవశముతో..స్వామి సన్నిధిలో
ఉన్నాననుకుంటూ..ఆ మాలలను తనే
సింగారించి.. మురుస్తూ..చప్పున తప్పుతెలుసుకొని
ఏమెరుగక ప్రీతిగా స్వామికి సమర్పించేది..గోదాదేవి...
ఆమె ఆంతర్యం గ్రహించి గోవిందుడు..ఆమెచేయందుకొని
కల్యాణమాడి....తనలో ఐక్యం చేసుకున్నాడు..
ముప్పైపాశురాలనిచ్చి స్వామినిచేరు దారి చూపిందీతల్లి..!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి