9, ఫిబ్రవరి 2016, మంగళవారం



మన తెలుగు మన సంస్కృతి నిర్వహించిన - – 126 వ చి త్ర క వి త – పోటీ లో మొదటి స్థానం లో నిలిచిన కవిత:
Sujatha Thimmana *********రామచిలకలు************
ఒకరికోసం ఒకరను శ్వాసకంకితమై...
కులుకులకు కొత్త భాషలు నేర్పే చిలకలు..
పలుకులకు పంచదార గుళికలను పులుముకున్నాయి..
పోటిప్రపంచంలో..పరుగుపందాల మానవులకు..
రేపులోని గీతను తెలియజేయగలవీ చిలకలు..
జంటగా కలిసిఉండే... మాధుర్యాన్నెప్పుడూ... జుర్రుకుంటాయి..
కసరు కాయలతింటూ...ఆదమరచి..
చిగురాకుల జోలలో ఊయలలూగుతాయి ఈ చిలకలు..
సాత్వికతకు చిహ్నమై..లేతాకు వర్ణంలో మెరుస్తూ ఉంటాయి..
అంబరంలో విహారానికి వెళుతూ...
గుంపులుగా చేరి..కిచకిచల..అల్లరి చేసే...ఈ చిలకలు.
దోరజామపళ్ళను ప్రీతిగా తినేందుకు.. ఇస్టపడతాయి...
తమ ముచ్చటలు తిరుచుకొందుకు...
అమాయకం ఆపాదించుకున్న ఈ చిలకలను..
పంజరంలో బందీగా చేసి.. వేదనకు గురిచేస్తున్నారే....
జన్మతః వచ్చిన అనుకరణ శాపమైనదా..
దైవం పేరును కానుకగా పొంది..రామ చిలకయినా గాని...
రామదాసు పోడుపుళ్ళను తప్పించుకోలేదే..
'చెరప లేనిది నుదిటివ్రాతే ' అది పక్షి అయినాగానీ..
అన్న నిజం తెలుపుతున్నవీ...రామచిలకలు...!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి